Har Ghar Tiranga Caller Tune Makes a Comeback - Sakshi
Sakshi News home page

Independence Day: ఫోన్లలో మారుమోగుతున్న ‘హర్‌ఘర్‌ తిరంగా’

Published Tue, Aug 15 2023 2:17 PM | Last Updated on Tue, Aug 15 2023 3:13 PM

Har Ghar Tiranga Caller Tune Makes a Comeback - Sakshi

భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుతున్నాయి. ఈ సందర్భంగా దేశ పౌరులు తమలోని దేశభక్తిని పలు రకాలుగా చాటుకుంటున్నారు. అందులో భాగంగా దేశ వ్యాప్తంగా పలువురి ఫోన్లలో ‘హర్ ఘర్ తిరంగా' కాలర్ ట్యూన్ మారుమోగుతోంది.  ఫోన్‌ చేసినప్పుడు హర్ ఘర్ తిరంగా సందేశం వినిపిస్తోంది. 

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత సంవత్సరం ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ హర్‌ఘర్‌ తిరంగా కాలర్‌ ట్యూన్‌  మోరుమోగింది. ఈ సారి కూడా పలువురికి ఫోన్‌ చేసినప్పుడు హర్‌ఘర్‌ తిరంగా కాలర్‌ ట్యూన్‌ వినిపిస్తోంది. త్రివర్ణ పతాకంతో దిగిన ఫొటోను హర్ ఘర్ తిరంగా వెబ్‌సైట్‌లో పంచుకోవాలనే సందేశం వినిపిస్తోంది. జాతీయ జెండాను ఎగురవేయడాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం చేస్తున్న ప్రచారంలో భాగంగా ఈ కాలర్ ట్యూన్‌లను మార్చారు. జెండా సందేశం తర్వాత హర్ ఘర్ తిరంగా థీమ్ సాంగ్‌కు సంబంధించిన చిన్న క్లిప్ ప్లే అవుతోంది. 

77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆగస్టు 13 నుంచి ఆగస్టు 15 వరకు అత్యంత వైభవంగా జరుపుకునే 'హర్ ఘర్ తిరంగ' ఉద్యమంలో భారతీయులందరూ పాల్గొనాలని  ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్‌ (ట్విటర్‌)లో ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement