న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే బ్లూప్రింట్ వంటిదని పారిశ్రామిక వర్గాలు పేర్కొన్నాయి. మోదీ ప్రసంగంలో గత దశాబ్దంలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ, 2047 నాటికి భారతదేశం ‘వికసిత భారత్’ (అభివృద్ధి చెందిన దేశం)గా మారేందుకు బ్లూప్రింట్‌ను రూపొందించిందని పరిశ్రమల సంఘం సీఐఐ తెలిపింది. (టెకీలకు గుడ్ న్యూస్: ఇన్ఫోసిస్ మెగా డీల్)
భారత్‌ను మూడో అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించాలన్న ప్రధాని దార్శనికత వచ్చే ఐదేళ్లలో సులువుగా ఫలించగలదని సీఐఐ విశ్వసిస్తోందని డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ తెలిపారు. ప్రధాని తన ప్రసంగంలో వివరించిన విజయాలు, దార్శనికత అమృత్ కాలంలో భారతదేశం అగ్రగామిగా, ప్రపంచ సూపర్ పవర్‌గా ఎదిగేందుకు కావాల్సిన బలం, ధైర్యాన్ని అందిస్తాయి. ఇందుకు తగిన వేదికను ఏర్పాటు చేస్తాయి’’ అని ఆయన అన్నారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మోదీ చేసిన ప్రసంగం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే జాతీయ సంకల్పాన్ని మరింత ముందుకు తీసుకువెళుతుందని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ అన్నారు
Comments
Please login to add a commentAdd a comment