
సాక్షి, న్యూఢిల్లీ: ‘హర్ ఘర్ తిరంగా’కార్యక్రమం సందర్భంగా సమాజంలోని దురాచారాలను తరిమి వేయడంపై యువత దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.
మహిళలకు సరైన గౌరవం కల్పించడంతోపాటు, దివ్యాంగులు, వెనుకబడిన వర్గాలకు చేయూతనందించినపుడే అందరినీ సమాజాభివృద్ధిలో భాగస్వాములుగా చేయగలమని ఉపరాష్ట్రపతి సూచించారు.బుధవారం ఢిల్లీలో ఎర్రకోట ప్రాంగణం నుంచి తిరంగా బైక్ ర్యాలీని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి అంతకుముందు బైక్ ర్యాలీకి వచ్చిన ఎంపీలు, కేంద్రమంత్రులు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.