
ఇద్దరు ఎస్సైలకు అవార్డులు
హన్మకొండ అర్బన్ : వరంగల్ రూరల్ పోలీస్ విభాగం లో ఏఆర్‌ఎస్సై(6081)గా పనిచేస్తున్న ఎంఏ రఫీఖ్ ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్నారు. శనివారం హైద రాబాద్ గోల్కొండ కోటలో జరిగిన 69వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా రఫీక్ ఈ అవార్డు అందుకున్నారు. ఏఆర్‌లో ఎస్సైగా విధులు నిర్వహించే రఫీక్ డ్రైవింగ్‌లో నిష్ణాతుడు. గతంలో పలుమారులు ఉన్నతాధికారులనుతన డ్రైవింగ్ నైపుణ్యం ద్వారా ప్రమాదాలనుంచి కాడాడారు. అదే విదంగా జిల్లాకు ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖుల పర్యటనల సమయంలో వాహనాన్ని ఎక్కువగా రఫీక్ నడిపేవారు. రఫీక్‌కు పోలీసు అధికారులు, ఇతర సిబ్బంది అభనందనలు తెలిపారు.
కళ్లెం వాసికి గ్యాలంటరీ అవార్డు
లింగాలఘణపురం: మండలంలోని కళ్లెం గ్రామానికి చెందిన తాటిపాముల సురేష్ ప్రస్తుతం ఖమ్మం జిల్లా జిల్లా టేకులపల్లి ఎస్సైగా పని చేస్తూ పోలీసుశాఖలో విశిష్ట సేవలు అందించినందుకు శనివారం హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం చేతుల మీదుగా ప్రెసిడెంట్ ఆఫ్ పోలీసు మెడల్ ఫర్ గ్యాలంటరీ అవార్డు అందుకున్నారు. కళ్లెం గ్రామానికి చెందిన తాటిపాముల వైకుంఠం, శశిరేఖల మూడో సంతానంగా సురేష్ జన్మించి ఎస్సైగా ఉద్యోగం సాధించాడు. తమ గ్రామానికి చెందిన వ్యక్తి సీఎం చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం ఎంతో ఆనందం గా ఉందని పలువురు గ్రామస్తులు అభినందించారు.