Vulgar Comments on KCR in Tik Tak, Young Man Got Arrested in Hyderabad - Sakshi
Sakshi News home page

టిక్‌టాక్‌లో కేసీఆర్‌ను దూషించిన యువకుడి అరెస్ట్‌

Published Wed, Apr 24 2019 10:56 AM | Last Updated on Wed, Apr 24 2019 11:53 AM

Vulgar Comments On KCR Young Man Arrested - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావును దూషించిన యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కొద్దిరోజుల క్రితం ఓ యువకుడు టిక్‌టాక్‌ వేదికగా కేసీఆర్‌ను ఉద్ధేశిస్తూ అసభ్యకరంగా మాట్లాడాడు. ఆయన్ని అవమానించే విధంగా వీడియోను చిత్రీకరించి ఆ వీడియోను సామాజిక మాధ్యమంలో ఉంచాడు. దీంతో సదరు యువకుడిపై కేసునమోదు చేసిన రాచకొండ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

స్వల్ప నిడివి వీడియోలను షేర్‌ చేసుకునేందుకు ఉపయోగపడే టిక్‌టాక్‌ యాప్‌ ద్వారా అశ్లీల వీడియోలు కూడా వ్యాప్తి చెందుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చైనా ఆధారిత యాప్‌పై ఇండియాలో బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో గూగుల్, యాపిల్‌ సంస్థలు టిక్‌టాక్‌ను తమ యాప్‌ స్టోర్స్‌ నుంచి తొలగించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement