వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటి దురుసు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అప్పుడప్పుడు ఆయన చేసే వ్యాఖ్యలు చూస్తే స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా అనిపిస్తుంది. అధ్యక్షుడే అంటే.. ఆయనకు పోటీగా వైట్ హౌస్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో ముందుంటుంది. ఇప్పుడు దీని గురించి చర్చ ఎందుకంటే.. ఈ నెల 4న అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుక సందర్భంగా ట్రంప్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికా గొప్పతనాన్ని చాటడం కోసం ట్రంప్ తన ప్రసంగంలో కొన్ని తప్పుడు వ్యాఖ్యలు చేశారు. ‘అమెరికన్లు విద్యుత్తును ఉపయోగించుకున్నారు. అణువును విభజించారు. ప్రపంచానికి టెలిఫోన్, ఇంటర్నెట్ ఇచ్చారు. మేము వైల్డ్ వెస్ట్‌ను స్థిరపర్చాము. రెండు ప్రపంచ యుద్ధాలను గెలిచాము. అమెరికన్ వ్యోమగాములు చంద్రునిపై కాలు మోపారు. త్వరలోనే అంగారక గ్రహంపై మా జెండా ఎగర వేస్తాము’ అంటూ ట్రంప్ ప్రగల్భాలు పలికారు. (‘అలాంటి వారికి ట్రంప్ తోడయ్యారు’)
"Americans harnessed electricity, split the atom, and gave the world the telephone and the internet. We settled the Wild West, won two World Wars, landed American Astronauts on the Moon—and one day soon, we will plant our flag on Mars!"
— The White House (@WhiteHouse) July 6, 2020
— President @realDonaldTrump
అధ్యక్షుడే మిస్టేక్ చేశాడంటే.. వైట్ హౌస్ మరో అడుగు ముందుకు వేసి ట్రంప్ వ్యాఖ్యలను యథాతథంగా ట్వీట్ చేసింది. ఇంకేముంది నెటిజనులు ఓ ఆట ఆడుకుంటున్నారు. ‘వైట్ హౌస్‌లో కనీసం చరిత్ర పుస్తకాలు కూడా లేవా’ అని ప్రశ్నిస్తున్నారు. ఇదేకాక కరోనా విషయంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఎక్కువ సంఖ్యలో టెస్టులు చేయడం వల్లే అమెరికాలో ఎక్కువ కేసులు వెలుగు చూస్తున్నాయన్నారు ట్రంప్. టెస్టుల సంఖ్య తగ్గిస్తే.. కేసులు కూడా తగ్గిపోతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment