'బుల్లెట్ ప్రూఫ్'ను బ్రేక్ చేసిన మోడీ | No Bullet-Proof Glass is a Break from Tradition | Sakshi
Sakshi News home page

'బుల్లెట్ ప్రూఫ్'ను బ్రేక్ చేసిన మోడీ

Published Fri, Aug 15 2014 4:01 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

'బుల్లెట్ ప్రూఫ్'ను బ్రేక్ చేసిన మోడీ - Sakshi

'బుల్లెట్ ప్రూఫ్'ను బ్రేక్ చేసిన మోడీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తన విలక్షణతను మరోసారి చాటుకున్నారు. ఎర్రకోటపై తొలిసారిగా జాతీయ జెండాను ఎగుర వేసిన ఆయన తన ప్రత్యేకత చాటారు. 68వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని హోదాలో ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. ఎటువంటి రక్షణ కవచం లేకుండా ఆయన ప్రసంగించడం విశేషం. మోడీ కంటే ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ బుల్లెట్ ప్రూఫ్ అద్దం రక్షణ కవచం వెనుక నుంచి ప్రసంగించారు. అయితే మోడీ ఇది లేకుండానే తన శైలిలో ప్రసంగించారు.

కాషాయ రంగు తలపాగా, క్రీమ్ కలర్ పైజామా, తెలుపు రంగు లాల్చీ ధరించి గుజరాతీ సంప్రదాయ ఆహార్యంతో పాటు తన ప్రసంగంతోనూ మోడీ అందరినీ ఆకట్టుకున్నారు. తొలి పంద్రాగసట్టు ప్రసంగంలోనూ తన ప్రత్యేకత చాటుకున్నారు. ప్రసంగ పాఠాన్ని చదవకుండా ఆశువుగా ప్రసంగించారు. ఇక మోడీ తొలి పంద్రాగసట్టు ప్రసంగంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement