Bullet Proof
-
రష్యా గడ్డపై కిమ్.. నాలుగేళ్ల తర్వాత తొలిసారి
సియోల్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మంగళవారం రష్యాలో అడుగు పెట్టారు. రష్యాకు కిమ్ వెళ్లడం ఇది రెండో సారి. తొలుత 2019లో ఆయన మొదటిసారి రష్యాలో పర్యటించారు. దాదాపు నాలుగేళ్ల తరువాత మరోసారి రష్యాలో పర్యటిస్తున్నారు. మంగళవారం కొందరు మంత్రులతో భేటీ అయ్యారు. బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కిమ్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనేది ఇంకా తెలియరాలేదు. 2019లో ఇరువురు నేతలు వ్లాదివోస్తోక్లోనే సమావేశమయ్యారు. ఈసారి కూడా భేటీ అక్కడే జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కిమ్ మాట్లాడుతూ.. దేశాల సంబంధాల వ్యూహాత్మక ప్రాముఖ్యత కోసం రష్యాతో భేటీ అవుతున్నట్లు తెలిపారు. ఇక పటిష్టమైన భద్రత మధ్య విలాసవంతమైన బుల్లెట్ ప్రూఫ్ రైలులో సుదీర్ఘంగా ప్రయాణించి రష్యాకు చేరుకున్నారు. ఆయన ఆదివారం మధ్యాహ్నం ఉత్తర కొరియా రాజధాని పాంగ్యాంగ్ నుంచి రైలులో బయలుదేరారు. 740 కి.మీ ప్రయాణించి ఉత్తర కొరియా సరిహద్దుకు సమీపంలో రష్యా భూభాగంలో ఉన్న వ్లాదివోస్తోక్ నగరానికి ఉత్తర దిక్కున 60 కిలోమీటర్ల దూరంలోని ఉసురియ్స్క్ అనే ప్రాంతానికి ఈ రైలు చేరుకున్నట్లు దక్షిణ కొరియా వార్తా సంస్థ కేసీఎన్ఏ వెల్లడించింది. ఈ ప్రాంతంలో కొరియన్ల జనాభా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉంది. అయితే, కిమ్ గమ్యస్థానం ఏమిటన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. కిమ్ రష్యాకు చేరినట్లు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ నిర్ధారించారు. పశ్చిమ దేశాల ఆంక్షల వల్ల ఒంటరిగా మారిన కిమ్ జోంగ్ ఉన్ రష్యా సహాయాన్ని అర్థిస్తున్నారు. చదవండి: అమెరికాకు వ్యతిరేకంగా చేతులు కలిపిన రష్యా, ఉత్తర కొరియా గంటకు 50 కిలోమీటర్ల వేగమే.. ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ప్రయాణించిన రైలుకు చాలా ప్రత్యేకతలున్నాయి. ఈ రైలు కేవలం గంటకు 50 కిలో మీటర్ల వేగంతోనే ప్రయాణిస్తుంది. దీనికి భారీగా సాయుధ కవచాలు అమర్చి ఉండటంతో భారీ బరువు కారణంగా వేగంగా వెళ్లలేదు. ఈ రైలుపేరు తయాంఘో.. అంటే కొరియా భాషలో సూర్యుడు అని అర్థం. ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్‌కు గుర్తుగా ఈ పేరుపెట్టారు. ఆయన కాలం నుంచే ఉ.కొరియా నేతలు సుదూర ప్రయాణాలను రైల్లోనే చేయడం మొదలుపెట్టారు. -
రష్యాకు రైల్లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్
సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ రష్యాకు పయన మయ్యారు. ఆయన తన సొంత బుల్లెట్ ప్రూఫ్ రైలులో ఆదివారం సాయంత్రం రాజధాని ప్యాంగాంగ్ వదిలివెళ్లారని దక్షిణ కొరియా వర్గాలు తెలిపాయి. మూడు రోజులపాటు జరిగే ఒక అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనేందుకు పుతిన్ సోమవారం వ్లాడివోస్టోక్ వెళ్లారని, అక్కడే ఆయనతో కిమ్ సమావేశమవ్వొచ్చని చెబుతున్నారు. కిమ్ తమ దేశానికి వస్తున్నారంటూ రష్యా కూడా సోమవారం ధ్రువీకరించింది. అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు త్వరలో కిమ్ రానున్నారని క్రెమ్లిన్ అధికార వెబ్సైట్ పేర్కొంది. పుతిన్, కిమ్‌లు త్వరలో కలుసుకుంటారని ఉత్తరకొరియా అధికార వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ కూడా తెలిపింది. ‘రష్యా పర్యటనలో కామ్రెడ్ కిమ్ జొంగ్ ఉన్, కామ్రెడ్ పుతిన్‌తో చర్చలు జరుపుతారు’అని పేర్కొంది. అయితే, ఈ భేటీ ఎప్పుడు, ఎక్కడ ఉంటుందనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. కిమ్ విదేశీ పర్యటనలకు వినియోగించే ఆకుపచ్చ బోగీలతో కూడిన బుల్లెట్ ప్రూఫ్ రైలును రష్యా సరిహద్దుల్లోని ఉత్తరకొరియా రైల్వే స్టేషన్లో ఉండగా గుర్తించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఉక్రెయిన్‌తో ఏడాదిన్నరగా కొనసాగుతున్న యుద్ధానికి అవసరమైన ఆయుధాల కొనుగోలుకు కిమ్‌తో పుతిన్ ఒప్పందం కుదుర్చుకునేందుకు అవకాశాలున్నాయన్నది పశ్చిమదేశాల అంచనా. కోవిడ్ మహమ్మారి ప్రబలిన దాదాపు నాలుగేళ్ల తర్వాత కిమ్ మొట్టమొదటి విదేశీ పర్యటన ఇదే. రైలులోనే ఎందుకు? గతంలో 2019లో మొదటిసారిగా వ్లాడివోస్టోక్‌లో పుతిన్‌తో సమావేశమైనప్పుడు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లతో సమావేశాలకు రైలులో వెళ్లినట్లుగానే ఈసారీ కిమ్ రష్యాకు రైలులోనే బయలుదేరారు. సొంత రైలులోనే విదేశీ పర్యటనలు చేసిన దివంగత పాలకుడు, తన తండ్రి పాటించిన సంప్రదాయాన్ని కిమ్ కూడా కొనసాగిస్తున్నారు. ఈ రైలుకు 20 బుల్లెట్ ప్రూఫ్ బోగీలుంటాయి. దీనివల్ల సాధారణ రైళ్ల కంటే ఇది ఎక్కువ బరువుంటుంది. సరాసరిన గంటకు 59 కిలోమీటర్లకు మించి వేగంతో ఇది ప్రయాణించలేదు. ఈ వేగంతో ప్యాంగ్యాంగ్ నుంచి వ్లాడివోస్టోక్‌కు వెళ్లడానికి ఒక రోజంతా పడుతుంది. -
సల్మాన్ బ్రాండ్ న్యూ బుల్లెట్ ప్రూఫ్ కార్: ఇంటర్నెట్లో వీడియో హల్చల్
సాక్షి, ముంబై: బాలీవుడ్ స్టార్హీరో సల్మాన్‌ఖాన్ సూపర్‌లగ్జరీ కారును సొంతం చేసుకున్నాడు. భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేయని కొత్త బుల్లెట్ ప్రూఫ్ ‘నిస్సాన్ పెట్రోల్ ఎస్యూవీ’ని సల్మాన్ ఖాన్ అంతర్జాతీయ మార్కెట్‌నుంచి ప్రైవేట్‌గా దిగుమతి చేసుకున్నట్టు తెలుస్తోంది. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ నిస్సాన్ అత్యంత ఖరీదైన ఎస్‌యూవీని సొంతం చేసుకున్న సల్లూ భాయ్. ఈ వారం ముంబైలో తన వ్యక్తిగత భద్రత , స్థానిక పోలీసులతో పా తన కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ప్రయాణించినట్టు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోలను అనేక యూట్యూబ్ ఛానెల్‌లు షేర్ చేశాయి. సల్మాన్ ఖాన్ కనిపించిన నిస్సాన్ పెట్రోల్ స్టైలిష్ వైట్ కలర్లో ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టారు. ముందు సల్మాన్ ఖాన్ వ్యక్తిగత భద్రత ఉన్న నల్లటి టయోటా ఫార్చ్యూనర్ ,వెనుక మహీంద్రా బొలెరో నియోలో పోలీసు అధికారులున్న వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. అత్యంత ఖరీదైన నిస్సాన్ ఎస్యూవీ ఆగ్నేయాసియా మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి. వ్యక్తిగత భద్రత రీత్యా బుల్లెట్ఫ్రూఫింగ్కు ఉత్తమ ఎంపికగా పరిగణించబడే అత్యంత సురక్షితమైన కారు బుల్లెట్ ప్రూఫ్ నిస్సాన్ పెట్రోల్ ఎస్‌యూని కొనుగోలు చేయడం విశేషం 5.6-లీటర్ వీ8 పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. 405hp, 560Nm ని అందించే ఈ ఇంజీన్‌లో 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా ఉంది. సాధారణ కార్లలో కనిపించే వాటి కంటే మందంగా ఉండే కొత్త విండ్‌షీల్డ్‌తో పాటు మందపాటి క్లాడింగ్‌తో కూడిన విండో గ్లాసులను కూడా ఇందులో జోడించారు. కాగా సల్మాన్ ఖాన్ గ్యారేజీలో ఇది మొదటి బుల్లెట్ ప్రూఫ్ SUV కాదు. టయోటా ల్యాండ్ క్రూయిజర్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌తో అప్‌గ్రేడ్ చేశాడు. వీటితోపాటు, Range Rover Autobiography, Audi RS7, Mercedes AMG GLE 63 S , Mercedes BenzGL-Class కూడా సల్మాన్ ఖాన్ సొంతం -
భారత్ జోడో యాత్ర బుల్లెట్ ప్రూఫ్ కారులో చేసేది కాదు: రాహుల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహల్ గాంధీ ఢిల్లీలో భారత్ జోడో యాత్ర నిర్వహించినప్పుడు భద్రతా వైఫల్యాలపై ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిన సీఆర్పీఎఫ్ రాహులే నిబంధనలు ఉల్లంఘించారని బదులిచ్చింది. తాజాగా రాహుల్ గాంధీ ఈ విషయంపై స్పందించారు. తాను బుల్లెట్ ప్రూఫ్ కారులో తిరుగుతూ భారత్ జోడో యాత్రలో పాల్గొనలా? అని ప్రశ్నించారు. అది ఎలా సాధ్యమని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు బుల్లెట్ ప్రూఫ్ కార్లను విస్మరించి నిబంధనలను తుంగలో తొక్కినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. వ్యక్తులను, పార్టీలను బట్టి ప్రోటోకాల్స్ మారుతాయా అని నిలదీశారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈమేరకు మాట్లాడారు. భారత్ జోడో యాత్ర దేశ భావోద్వేగాలకు సంబంధించిందని, తనకు చాలా విషయాలు నేర్పిందని రాహుల్ అన్నారు. తాను ఊహించిన దానికంటే ఎక్కువే నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే 2024లో ప్రతిపక్షాలు అన్నీ ఏకమైతే బీజేపీ గెలవడం కష్టం అన్నారు రాహుల్. ప్రతిపక్షాలు ప్రత్యామ్నాయ విజన్‌తో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. అయితే కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరు? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. తన దృష్టంతా విద్వేషం, ఆగ్రహావేశాలపై పోరాడటమేనని పేర్కొన్నారు. చదవండి: తల్లి హీరాబెన్ పాడె మోసిన ప్రధాని మోదీ -
బెదిరింపులు.. అయినా ఆ కారునే వాడుతున్న సల్మాన్ ఖాన్!
సౌకర్యవంతమైన ప్రయాణం కోసం లగ్జరీ కార్లను ఎంచుకుంటారు. అయితే ఒక్కోసారి కంఫర్ట్‌తో పాటు భద్రతను దృష్టిలో ఉంచుకుని కొన్ని కార్లని ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. ఈ జాబితాలో టయోటా ల్యాండ్ క్రూయిజర్ కూడా ఉంది. అందుకే దేశంలోని పలువురు రాజకీయ నాయకులు టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎల్సీ 200 (LC200) కారుకి బుల్లెట్ ప్రూఫ్‌తో అప్‌గ్రేడ్ చేసి వాడుతున్నారు. భద్రత పరంగా ప్రముఖులు ఈ తరహా కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అసలు కథేంటంటే.. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్‌కు చంపుతామంటూ బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే కదా! తనను, తన తండ్రిని హెచ్చరిస్తూ వచ్చిన బెదిరింపు లేఖపై సల్మాన్ ముంబై పోలీస్ చీఫ్ వివేక్ ఫన్సాల్కర్‌ను కలిశారు. ఈ బెదిరింపుల తర్వాత సల్మాన్ ముందు జాగ్రత్తగా తన ల్యాండ్ క్రూయిజర్‌ను బుల్లెట్ ప్రూఫ్ చేయించారు. ఈ బాలీవుడ్ హీరో తరచూ ఈ టయోటా ల్యాండ్ క్రూయిజర్ కారులోనే తిరుగుతూ కనిపిస్తాడు. ఆశ్చర్యమేమంటే సల్మాన్ వాడుతున్న టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎస్యూవీ లేటెస్ట్ మోడల్ కూడా కాదు. కానీ ఈ కారు తయారీ మోడల్ అనుసరించి దీనికి పకడ్బందీగా బుల్లెట్ ప్రూఫ్‌తో భద్రత ఏర్పాట్లను చేసుకున్నాడు. సల్మాన్ ఖాన్‌కి కార్లంటే చాలా ఇష్టం. మార్కెట్లో ఏదైనా కొత్త మోడల్ కారు వచ్చిందంటే చాలు అందులో లాంగ్ డ్రైవ్‌కు వెళ్తుంటాడు. టయోటా ల్యాండ్ క్రూయిజర్ బుల్లెట్ ప్రూఫ్‌తో పాటు సల్మాన్ ఖాన్ వద్ద మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, లెక్సస్ ఎల్ఎక్స్ 470, ఆడి ఎ8, పోర్స్చే కయెన్, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ఆడి ఆర్ఎస్7, మెర్సిడెస్ ఎఎమ్‌జి జిఎల్ఇ 63 ఎస్, మెర్సిడెస్ బెంజ్ జిఎల్-కేజ్‌లు ఉన్నాయి. చదవండి: Narendra Modi: ‘అమ్మ కొడుతోంది.. ధరలు మండుతున్నాయ్ మోదీ జీ’.. ఈ పాపకి ఎంత కష్టం వచ్చిందో! -
సంచలన ఆవిష్కరణ: బుల్లెట్లను తట్టుకునే స్మార్ట్‌ఫోన్
Bulletproof iphone 13 series Price And Details: పై హెడ్డింగ్ చదివాక.. సాంకేతికత ఎంతగా వృద్ధి చెందినా.. స్మార్ట్‌ఫోన్ ఉండేది కేవలం వాడుకోవడానికే కదా అనే అనుమానం కలగవచ్చు. కానీ, ఇప్పుడు చెప్పబోయే ఫోన్ అందరికీ అందుబాటులో ఉండేది కాదు. చాలా ప్రత్యేకత సంతరించుకుంది మరి!. సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌కి బుల్లెట్ తగిలితే.. దూసుకెళ్లి తునాతునకలు అవుతుంది. కానీ, ఈ ఫోన్లు మాత్రం తీవ్రతను తట్టుకుని చక్కగా పని చేస్తాయి. ఇటలీకి చెందిన లగ్జరీ బ్రాండ్ కంపెనీ ‘కేవియర్’ స్టీల్త్ ఐఫోన్ పేరుతో సిరీస్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేస్తోంది. కిందటి ఏడాది ఐఫోన్ 12లో లగ్జరీ మోడల్‌ను తీసుకొచ్చిన కేవియర్.. ఇప్పుడు దానికి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా స్టీల్త్ 2.0 ఐఫోన్ 13 సిరీస్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత ఏంటంటే.. బుల్లెట్లను సైతం తట్టుకోగలుగుతుంది. స్టీల్త్ వెర్షన్ 2.0 ఐఫోన్లు.. బీఆర్-2 క్లాస్2కి చెందిన బుల్లెట్‌ప్రూఫ్ కవచంతో తయారు చేయించింది. బుల్లెట్‌ప్రూఫ్ కవచాలతో ఆయుధ వాహనాల్ని, యుద్ధ విమానాల్ని రూపొందించే ఎన్పీవో టీసీఐటీ సహకారంతో కేవియర్ ఈ ఐఫోన్‌ను పైప్యానెల్ను ప్రత్యేకంగా రూపొందించారు. అంతేకాదు పిస్టోల్స్ ఈ ఫోన్లను కాల్చి మరీ డెమోలను చూపించింది కంపెనీ. అదే టైంలో ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దంటూ ప్రజలకు సూచించింది కూడా. సాధారణ ఫోన్లకు గనుక బుల్లెట్ తగిలితే.. అది ఫోన్ పై ప్యానెల్ గుండా ఫోన్ బాడీలోకి చీల్చుకుపోతుంది. ఫోన్‌ను పనికి రాకుండా డ్యామేజ్ చేస్తుంది. కానీ, ఈ ఫోన్ మాత్రం బుల్లెట్ తీవ్రతను తట్టుకుని పైన ప్యానెల్‌ను పగలగొట్టి సరిపెట్టుకుంది. విశేషం ఏంటంటే.. బుల్లెట్ తగిలాక కూడా ఆ ఫోన్ కండిషన్‌తో పని చేయడం. బుల్లెట్‌ప్రూఫ్ ఫోన్లుగా ఇప్పటికే కొన్ని మార్కెట్లో చెలామణి అవుతుండగా.. వాటన్నింటికంటే ఇది స్టాండర్డ్‌గా తేలడం విశేషం. ఇక కేవియర్ ఇలాంటి ఫోన్లను కేవలం 99 యూనిట్లు(పీసులను) మాత్రమే తయారు చేయించింది. ప్రారంభ ధర 6, 370 డాలర్లుగా(మన కరెన్సీలో 4, 86 వేల రూపాయలకు పైనే) ఉంటుంది. గరిష్టంగా ఈ తరహా బుల్లెట్ ఐఫోన్‌ను(ఐఫోన్ ప్రో మ్యాక్స్.. 1 టీబీ స్టోరేజ్) 7, 980 డాలర్లకు అందించనుంది. కాబట్టి, బాగా డబ్బున్నోళ్ల కోసం, సెక్యూరిటీ భయం ఉన్నవాళ్ల కోసం ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు అర్థమవుతోంది కదా!. 2010 నుంచి ఇటాలియన్ నగల వ్యాపారి ఇలియా గియకోమెట్టి ఆధ్వర్యంలో ‘కేవియర్’(1861 నుంచి వ్యాపారంలో ఉంది).. ఫ్లోరెన్స్(ఇటలీ) వేదికగా లగ్జరీ ఉత్పత్తులను ప్రపంచానికి అందిస్తోంది. ఐఫోన్, శాంసంగ్‌లతో పాటు పలు రకాల బ్రాండ్లకు విలాసవంతమైన సొగసులు అద్ది(బంగారం, వజ్రాలు ఇతరత్రాలు) లిమిటెడ్ యూనిట్లను మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఓ బ్రాండ్‌గా ముద్రను సంపాదించుకుంది. చదవండి: వారం పాటు బ్యాటరీ వచ్చే స్మార్ట్‌ఫోన్! ఏదంటే.. -
జమ్మూకశ్మీర్‌లో చవరిరోజు అమిత్ షా పర్యటన
-
కశ్మీర్ పర్యటన: సాహసోపేత నిర్ణయంతో షాకిచ్చిన అమిత్ షా
శ్రీనగర్: మూడు రోజుల పర్యటనలో భాగంగా జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. పర్యటనలో చివరి రోజు సోమవారం నాడు ఆయన షేర్ ఈ కశ్మీర్ ఇంటర్నెషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. దీనికి ముందు అమిత్ షా చేసిన పని అక్కడున్నవారందరిని ఒకింత భయానికి గురి చేసింది. అదేంటంటే వేదిక మీదకు ఎక్కి ప్రసంగించడానికి ముందు అమిత్ షా తాను ధరించిన బుల్లెట్ ప్రూఫ్‌షీల్డ్‌ని తొలగించారు. అమిత్ షా చేసిన పనికి అక్కడున్నవారంతా షాకయ్యారు. (చదవండి: వారిని మనమే కాపాడుకోవాలి!) అనంతరం అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘నన్ను దూషించారు, అడ్డుకున్నారు. కానీ నేను జమ్మూకశ్మీర్ ప్రజలతో సూటిగా, స్పష్టంగా మాట్లాడాలనుకున్నాను. అందుకే బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్, సెక్యూరిటీని తొలగించాను. ఫరూఖ్ సాహెబ్ నన్ను పాకిస్తాన్‌తో మాట్లాడమని సూచించారు. కానీ నేను కశ్మీర్ లోయలో ఉన్న యువత, ప్రజలతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను’’ అని తెలిపారు. చివరి రోజు పర్యటనలో భాగంగా అమిత్ షా సోమవారం ఉదయం గండెర్బాల్ జిల్లాలో ఉన్న ఖీర్ భవానీ ఆలయంలో పూజలు నిర్వహించారు. అలానే అమిత్ షా కశ్మీర్ ఫెరాన్ మాదిరి దుస్తులు ధరించి.. మాతా రంగ్యాదేవి ఆలయంలో పూజలు నిర్వహించారు. కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అమిత్ షాతో పాటు ఆలయాన్ని సందర్శించారు. (చదవండి: అభివృద్ధికి విఘాతం కలిగిస్తే సహించం) కశ్మీర్ పర్యటనలో భాగంగా తొలి రోజు శనివారం అమిత్ షా ఈ ఏడాది జూన్‌లో మిలిటెంట్ల చేతిలో హతమైన పోలీసు అధికారి పర్వీజ్ అహ్మద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటీవల కాలంలో లోయలో పెరిగిన చొరబాట్లు, పౌరుల హత్యల నేపథ్యంలో అమిత్ షా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రాజ్‌భవన్‌లో జరిగిన సమావేశంలో అమిత్‌షా భద్రతా పరిస్థితులను కూడా సమీక్షించారు. చదవండి: కశ్మీర్లో ‘ఉగ్ర’ ఉద్యోగులపై వేటు -
బుల్లెట్ నుంచి మనిషి ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌ఫోన్
ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్ అంటే చాలా మంది వీడియోలు చూడటం కోసం, గేమింగ్ ఆడటం కోసం, ఫోటోలు తీయడం కోసం పనికొస్తుందని అనుకుంటారు. కానీ, మనం ఇప్పుడు చెప్పుకొనే స్మార్ట్‌ఫోన్ మాత్రం ఏకంగా మనిషి ప్రాణాలే కాపాడింది. మోటరోలాకు చెందిన ఐదేళ్ల పాత మోటో జీ5 స్మార్ట్‌ఫోన్ ఒక మనిషి ప్రాణం కాపాడింది. వేగంగా వస్తున్న బుల్లెట్‌ను అడ్డుకుని బుల్లెట్ ప్రూఫ్ లా పనిచేసింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ మొబైల్ కేసు మీద ది ఇన్ క్రెడిబుల్ హల్క్ డిజైన్ ఉంది. మార్వెల్ హీరో హల్క్, మోటో జీ5 కలిసి ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన గత వారం బ్రెజిల్లో దొంగతనం జరిగే సమయంలో జరిగింది. ఆ సమయంలో అక్కడున్న వ్యక్తిపై దుండగుడు బుల్లెట్ ఫైర్ చేశారు. అది నేరుగా మోటో జీ5 స్మార్ట్‌ఫోన్‌కు తగిలి దిశ మార్చుకొని నడుము భాగంలోకి దూసుకెళ్లింది. అలా చిన్నపాటి గాయంతో బయటపడ్డ వ్యక్తికి ప్రాణాపాయం తప్పింది. ఇది తప్ప బుల్లెట్ వల్ల మరే ఇతర గాయం లేదు. ఫోన్ యజమానికి చికిత్స చేసిన వైద్యుడు షేర్ చేసిన ఫోటో ప్రకారం మోటో జీ5 బుల్లెట్ నుంచి ప్రాణాలు కాపాడింది. బుల్లెట్ ఫోన్ స్క్రీన్ ను తాకడం మనం చూడవచ్చు. ఇప్పుడు అది పగిలిపోయింది. ఫోన్ వెనుక భాగంలో పెద్ద బొడిపే కూడా ఉంది. ఫోన్ లో హల్క్ కేసు కూడా కనిపిస్తుంది. గతంలో వచ్చిన మోటో జీ5 వంటి ఫోన్లు చాలా మందంగా ఉండేవి. కానీ, ఇప్పుడు వచ్చే ఫోన్లు స్లిమ్, సున్నితమైన డిజైన్ తో వస్తున్నాయి. ఇలాంటి ఘటనల నుంచి కాపాడతాయా అనే సందేహం రాకమానదు. ఫోన్ అరేనాప్రకారం, ఒక శామ్ సంగ్ గెలాక్సీ, ఐఫోన్ వారి యజమానులను బుల్లెట్ల నుంచి కాపాడాయి.(చదవండి: ఇక తగ్గేదె లే అంటున్న టాటా మోటార్స్!) -
‘సీఎం’కు మరో బుల్లెట్‌ప్రూఫ్ ఇల్లు!
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రికి పటిష్ట భద్రత కల్పించే లక్ష్యంతో ఆయన నియోజకవర్గం గజ్వేల్‌లో నిర్మిస్తున్న క్యాంపు కార్యాలయానికి బుల్లెట్‌ప్రూఫ్ భద్రతను కల్పిస్తున్నారు. ఇటీవల మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో పటిష్ట భద్రత ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేలా ఎమ్మెల్యేలకు ఆయా నియోజకవ ర్గ కేంద్రాల్లో క్యాంపు కార్యాలయాల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలకు కొత్త క్వార్టర్లు నిర్మిస్తున్నందున.. గ్రేటర్ హైదరాబాద్ పరిధి మినహా రాష్ట్రవ్యాప్తంగా 104 నియోజకవర్గాల్లో ఆధునిక హంగులతో, అన్ని సౌకర్యాలతో ఈ కార్యాలయాలను నిర్మిస్తున్నారు. అందులో ఇప్పటికే 16 భవనాలు సిద్ధం కాగా.. మరో 31 చోట్ల పదిహేను రోజుల్లో పూర్తికానున్నాయి. ఇందులో సీఎం నియోజకవర్గం గజ్వేల్‌లోని క్యాంపు కార్యాలయం కూడా సిద్ధమవుతోంది. సీఎం కార్యాలయం కావడంతో.. గజ్వేల్ నియోజకవర్గ కార్యాలయం నిర్మాణ నమూనాలో మిగతావాటి తరహాలోనే ఉన్నా.. ముఖ్యమంత్రి కార్యకలాపాలు నిర్వహించే నేపథ్యంలో ప్రత్యేక హంగులు, ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల మావోయిస్టుల నుంచి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో.. ఈ భవనానికి బుల్లెట్ ప్రూఫ్ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖ ప్రతిపాదించింది. ఈ సూచనలకు సాధారణ పరిపాలన శాఖ ఓకే చెప్పడంతో.. ఆర్థిక శాఖ ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. ఆ నిధులతో బుల్లెట్ ప్రూఫ్ ఏర్పాట్లు చేస్తున్నారు. సకల సౌకర్యాలతో.. గజ్వేల్–ముట్రాజ్‌పల్లి మార్గంలో సుమారు ఎకరం స్థలంలో ఈ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. అన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తుండగా.. దీనిని 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంతో చేపట్టారు. జీ ప్లస్ వన్ పద్ధతిలోని భవనంపోగా మిగతా స్థలంలో పచ్చిక పెంచి మొక్కలు నాటారు. భవనం ముందు వైపు, పక్కన 16 ఫీట్ల సీసీ రోడ్లను నిర్మించారు. రోడ్లకు ఇరుపక్కలా మొక్కలు నాటి, అందంగా ముస్తాబు చేశారు. భవనంలో అన్ని గదులకు ఏసీ వసతి ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆయన కాన్వాయ్‌లోని కార్లన్నింటికీ సరిపడేలా పార్కింగ్ ఏర్పాటు చేశారు. ప్రజలు వస్తే కలిసేందుకు వీలుగా ఒక హాల్‌ను, సిబ్బంది కోసం క్వార్టర్లను నిర్మించారు. మొత్తంగా మిగతా క్యాంపు కార్యాలయాలకు రూ.కోటి చొప్పున ఖర్చవుతుండగా.. దీనికి రూ.2 కోట్లకుపైగా ఖర్చవుతోంది. సీఎం నిర్ణయం మేరకు ముహూర్తం చూసుకుని.. కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. -
ఉక్కునైనా ఛేదించగల వాటర్‌గన్
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్కునైనా ఛేదించగల వాటర్‌గన్ అందుబాటులోకి వచ్చింది. దీనిని షూట్ చేస్తే, ఇందులోంచి పెనువేగంతో దూసుకొచ్చే నీరు.. ఉక్కు, కాంక్రీట్, ఇటుకలు, చివరకు బులెట్‌ప్రూఫ్ గ్లాస్‌ను కూడా ఛేదించగలదు. ఏదైనా గోడపై దీనిని గురిచూసి ప్రయోగిస్తే, మూడంగుళాల రంధ్రం ఏర్పడి, అందులోంచి నీరు లోపలకు దూసుకుపోతుంది. అగ్నిమాపక పరికరాలను తయారు చేసే ‘పైరోలాన్స్’ అనే కంపెనీకి చెందిన నిపుణులు ఈ వాటర్‌గన్‌ను అల్ట్రా హైప్రెషర్ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఈ ‘పైరోలాన్స్’ వాటర్‌గన్స్‌ను ప్రస్తుతం అమెరికన్ నేవీ, ఎయిర్‌ఫోర్స్ బలగాలు ఉపయోగిస్తున్నాయి. కొన్ని విమానాశ్రయాల్లో కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటి సైజును బట్టి ఒక్కొక్కటి 15 వేల డాలర్ల నుంచి 80 వేల డాలర్ల వరకు ఇవి దొరుకుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అగ్నిమాపక దళాలు వీటిని ఉపయోగించేటట్లయితే చాలా వరకు అగ్నిప్రమాదాలను నిరోధించవచ్చని ‘పైరోలాన్స్’ కంపెనీకి చెందిన ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండులు, షాపింగ్‌మాల్స్, సినిమా థియేటర్స్ వంటి జనసమ్మర్దం గల ప్రదేశాల్లో వీటిని అందుబాటులో ఉంచితే, అగ్నిప్రమాదాలను తేలికగా అరికట్టడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. -
కేసీఆర్ పాలన పూర్తిగా కామెడీ అయింది
-
ఎంపీ కవితకు బుల్లెట్‌ప్రూఫ్ వాహనం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవితకు రాష్ట్ర ప్రభుత్వం బుల్లెట్‌ప్రూఫ్ వాహనం సమకూర్చింది. భద్రతా కారణాల రీత్యానే కవితకు ఈ వాహనం కేటాయించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవలి కాలంలో నక్సల్స్ కదలికలు ఎక్కువకావడం, పైగా ఆమెకు వారి నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలనుంచి సమాచారం రావడంతో ఆమె భద్రతను అధికారులు సమీక్షించారు. కవిత సీఎం కుమార్తె.., పార్లమెంటు సభ్యురాలు కూడా కావడంతో సెక్యూరిటీ విభాగం భద్రతను కట్టుదిట్టం చేసింది. -
బాబు కోసం ఐదు కోట్ల బస్సు
-
బాబు కోసం ఐదు కోట్ల బస్సు
సీఎం బసకు బుల్లెట్, బాంబు ప్రూఫ్ బస్సు కొనుగోలు చేసిన ఆర్టీసీ సాక్షి, విజయవాడ బ్యూరో: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కోసం రూ. 5 కోట్లతో అత్యంత సౌకర్యవంతమైన బస్సును ఏపీఎస్ ఆర్టీసీతో ప్రభుత్వం కొనుగోలు చేయించింది. పటిష్టమైన భద్రత కోసం బుల్లెట్, బాంబు ప్రూఫ్‌గా బస్సును రూపొందించారు. ఆ బస్సును శుక్రవారం విజయవాడ క్యాంపు ఆఫీసు వద్ద చంద్రబాబు పరిశీలించారు. బస్సు లోపల సిట్టింగ్, ఇంటీరియర్లల్లో కొద్దిపాటి మార్పులు సూచించారు. బెంజి కంపెనీకి చెందిన ఈ బస్సుకు చండీగఢ్‌లోని జేసీబీఎల్ కంపెనీలో బాడీ బిల్డింగ్ చేయించారు. బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ బస్సులో ఏర్పాటు చేశారు. మొత్తం తొమ్మిది మంది కూర్చునే డైనింగ్ కమ్ మీటింగ్ హాలు ఉంటుంది. వైఫై, ఇంటర్నెట్, కంప్యూటర్, ఫ్యాక్స్, ప్లాస్మా టీవీ, డిష్ యాంటెనా వంటి అధునాతన సాంకేతిక హంగులన్నీ బస్సులో ఉన్నాయి. ఎటువంటి రోడ్లపైనైనా ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేలా దీన్ని తీర్చిదిద్దారు. బస్సుకు చుట్టూ అమర్చిన ప్రత్యేక కెమెరాల ద్వారా బయట ఏం జరుగుతోందో లోపలి టీవీ ద్వారా గమనించవచ్చు. డ్రైవర్‌కు సైతం కెమెరాల ద్వారా రోడ్డు క్లారిటీ, ట్రాఫిక్ గమనించే సౌకర్యం కూడా ఉంటుంది. రోడ్డు షోల సందర్భంలో ఉపన్యాసం స్పష్టంగా విన్పించేందుకు ప్రత్యేక స్పీకర్లు ఏర్పాటు చేశారు. విజయవాడ క్యాంపు ఆఫీసుతో పాటు రాష్ర్టంలో ఎక్కడకు వెళ్లినా బస్సులోనే సీఎం బస చేసేలా సౌకర్యాలను సమకూర్చారు. ఈ బస్సు నిర్వహణ ఏపీఎస్ ఆర్టీసీకి అప్పగించడంతో విజయవాడలోని ఆర్టీసీ గ్యారేజీలో ఉంచనున్నారు. చంద్రబాబు రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా ఆయన బస కోసం అక్కడికి ఈ బస్సు పంపించనున్నారు. -
ఒక్క రోజుకే ‘షెడ్డు’కు..!
-
మంత్రి ఈటలకు తప్పిన ప్రమాదం
హుజూరాబాద్ టౌన్/శంకరపట్నం: రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు సోమవారం ప్రమాదం తప్పింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్ అనుబంధ గ్రామం మాలపల్లి వద్ద రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ఈటల రాజేందర్ తదితరులు మిషన్‌కాకతీయ పనుల ప్రారంభానికి బయలుదేరారు. అయితే మంత్రి ఎప్పుడూ ప్రయాణించే బుల్లెట్‌ప్రూఫ్ వాహనంలో కాకుండా ఎంపీ వినోద్‌కుమార్‌కు చెందిన ఫార్చునర్‌లో ఎక్కారు. మంత్రి, ఎంపీ ప్రయాణిస్తున్న ఫార్చునర్ వెనుక కాన్వాయిలో బుల్లెట్‌ఫ్రూఫ్ వాహనం ఉండగా, శంకరపట్నం మండలం ఎరుకలగూడెం-మెట్పల్లి గ్రామాల మధ్య బుల్లెట్‌ఫ్రూఫ్ వాహనంకు సడెన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న తాటిచెట్టును బలంగా ఢీకొంది. దీంతో వాహనం ముందు బ్యానెట్ భాగం దెబ్బతినడంతో ఆ వాహనాన్ని ప్రమాద సంఘటన వద్దనే వదిలి వెళ్లారు. -
బుల్లెట్లకు బెదరని బీఎండబ్ల్యూ..
బుల్లెట్ ప్రూఫ్ కార్లు చాలా ఉన్నాయి.. అయితే.. ఈ బీఎండబ్ల్యూ ఎక్స్5 సెక్యూరిటీ ప్లస్ వాహనం ఏకే 47ను కూడా లైట్ తీసుకుంటుందట. ఏకే 47ను సైతం తట్టుకునే కారు ఇదొక్కటేనని సదరు కంపెనీ చెబుతోంది. ఈ వాహనం తయారీలో ప్రత్యేకమైన స్టీలును వాడారట. దీంతో తూటాలు తగిలినా.. వాహనానికేం కాదు. చిత్రం చూశారుగా.. అవన్నీ బుల్లెట్ తాలూకు మచ్చలే. బాడీకే కాదు.. అద్దాలకు కూడా ఏం కాదట. మాస్కో మోటారు షోలో ప్రదర్శనకు పెట్టిన ఈ వాహనం ధర రూ. 1.5 కోట్లు దాకా ఉండొచ్చని చెబుతున్నారు. -
'బుల్లెట్ ప్రూఫ్'ను బ్రేక్ చేసిన మోడీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తన విలక్షణతను మరోసారి చాటుకున్నారు. ఎర్రకోటపై తొలిసారిగా జాతీయ జెండాను ఎగుర వేసిన ఆయన తన ప్రత్యేకత చాటారు. 68వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని హోదాలో ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. ఎటువంటి రక్షణ కవచం లేకుండా ఆయన ప్రసంగించడం విశేషం. మోడీ కంటే ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ బుల్లెట్ ప్రూఫ్ అద్దం రక్షణ కవచం వెనుక నుంచి ప్రసంగించారు. అయితే మోడీ ఇది లేకుండానే తన శైలిలో ప్రసంగించారు. కాషాయ రంగు తలపాగా, క్రీమ్ కలర్ పైజామా, తెలుపు రంగు లాల్చీ ధరించి గుజరాతీ సంప్రదాయ ఆహార్యంతో పాటు తన ప్రసంగంతోనూ మోడీ అందరినీ ఆకట్టుకున్నారు. తొలి పంద్రాగసట్టు ప్రసంగంలోనూ తన ప్రత్యేకత చాటుకున్నారు. ప్రసంగ పాఠాన్ని చదవకుండా ఆశువుగా ప్రసంగించారు. ఇక మోడీ తొలి పంద్రాగసట్టు ప్రసంగంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. -
సీఎం భద్రతకు మైన్‌ప్రూఫ్ వాహనాలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భద్రత కోసం మందుపాతరలను తట్టుకునే సామర్థ్యం కలిగిన వాహనాలను పోలీసుశాఖ కొనుగోలు చేసింది. సీఎం కాన్వాయ్‌లో ప్రస్తుతం బులెట్‌ప్రూఫ్ వాహనాలను వినియోగిస్తుండగా వీటి స్థానంలో మైన్‌ప్రూఫ్ వాహనాలు వచ్చి చేరనున్నాయి. మందు పాతర్లను తట్టుకునే సామర్థ్యం కలిగిన వాహనాలను కొనుగోలు చేయడం మాత్రం ఇదే మొదటిసారి. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో జామర్ వాహనంతోపాటు బులెట్‌ప్రూఫ్ కలిగిన మూడు ఫార్చ్యునర్ వాహనాలను వినియోగిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్కార్పియో బులెట్‌ప్రూఫ్ వాహనాలను ఉపయోగించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత స్కార్పియోల స్థానంలో అత్యంత ఖరీదైన ఫార్చ్యునర్ వాహనాలు వచ్చిచేరాయి. ముఖ్యమంత్రి భద్రత కోసం ఇప్పుడు తాజాగా రూ. 1.21 కోట్లతో రెండు టయోటా ప్రడొ వాహనాలను కొనుగోలు చేశారు. మరో కోటి రూపాయలు వెచ్చించి ఆ వాహనాలను మైన్ప్రూఫ్గా తయారు చేయిస్తున్నారు. మందుపాతర్లు ప్రయోగించినా ఆ వాహనం దెబ్బతినకుండా ఉంటుంది. అందులో ప్రయాణించేవారి ప్రాణాలకు ముప్పు చాలా తక్కువగా ఉంటుంది. నగరంతోపాటు ముందస్తుగా నిర్ణయించిన జిల్లా పర్యటనల్లో సీఎం ఇవే వాహనాలను వినియోగిస్తారు. అత్యవసరంగా జిల్లాలకు వెళ్లే సమయాల్లో మాత్రం అందుబాటులో ఉన్న బులెట్‌ప్రూఫ్ వాహనాలనే వినియోగిస్తారు.