Bulletproof iphone 13 series Price And Details: పై హెడ్డింగ్ చదివాక.. సాంకేతికత ఎంతగా వృద్ధి చెందినా.. స్మార్ట్‌ఫోన్ ఉండేది కేవలం వాడుకోవడానికే కదా అనే అనుమానం కలగవచ్చు. కానీ, ఇప్పుడు చెప్పబోయే ఫోన్ అందరికీ అందుబాటులో ఉండేది కాదు. చాలా ప్రత్యేకత సంతరించుకుంది మరి!.
సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌కి బుల్లెట్ తగిలితే.. దూసుకెళ్లి తునాతునకలు అవుతుంది. కానీ, ఈ ఫోన్లు మాత్రం తీవ్రతను తట్టుకుని చక్కగా పని చేస్తాయి. ఇటలీకి చెందిన లగ్జరీ బ్రాండ్ కంపెనీ ‘కేవియర్’ స్టీల్త్ ఐఫోన్ పేరుతో సిరీస్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తోంది. కిందటి ఏడాది ఐఫోన్ 12లో లగ్జరీ మోడల్‌ను తీసుకొచ్చిన కేవియర్.. ఇప్పుడు దానికి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా స్టీల్త్ 2.0 ఐఫోన్ 13 సిరీస్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత ఏంటంటే.. బుల్లెట్లను సైతం తట్టుకోగలుగుతుంది.
స్టీల్త్ వెర్షన్ 2.0 ఐఫోన్లు.. బీఆర్-2 క్లాస్2కి చెందిన బుల్లెట్‌ప్రూఫ్ కవచంతో తయారు చేయించింది. బుల్లెట్‌ప్రూఫ్ కవచాలతో ఆయుధ వాహనాల్ని, యుద్ధ విమానాల్ని రూపొందించే ఎన్‌పీవో టీసీఐటీ సహకారంతో కేవియర్ ఈ ఐఫోన్‌ను పైప్యానెల్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. అంతేకాదు పిస్టోల్స్ ఈ ఫోన్లను కాల్చి మరీ డెమోలను చూపించింది కంపెనీ. అదే టైంలో ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దంటూ ప్రజలకు సూచించింది కూడా.
సాధారణ ఫోన్లకు గనుక బుల్లెట్ తగిలితే.. అది ఫోన్ పై ప్యానెల్ గుండా ఫోన్ బాడీలోకి చీల్చుకుపోతుంది. ఫోన్‌ను పనికి రాకుండా డ్యామేజ్ చేస్తుంది. కానీ, ఈ ఫోన్ మాత్రం బుల్లెట్ తీవ్రతను తట్టుకుని పైన ప్యానెల్‌ను పగలగొట్టి సరిపెట్టుకుంది. విశేషం ఏంటంటే.. బుల్లెట్ తగిలాక కూడా ఆ ఫోన్ కండిషన్‌తో పని చేయడం. బుల్లెట్‌ప్రూఫ్ ఫోన్లుగా ఇప్పటికే కొన్ని మార్కెట్‌లో చెలామణి అవుతుండగా.. వాటన్నింటికంటే ఇది స్టాండర్డ్‌గా తేలడం విశేషం.
ఇక కేవియర్ ఇలాంటి ఫోన్లను కేవలం 99 యూనిట్లు(పీసులను) మాత్రమే తయారు చేయించింది. ప్రారంభ ధర 6, 370 డాలర్లుగా(మన కరెన్సీలో 4, 86 వేల రూపాయలకు పైనే) ఉంటుంది. గరిష్టంగా ఈ తరహా బుల్లెట్ ఐఫోన్‌ను(ఐఫోన్ ప్రో మ్యాక్స్.. 1 టీబీ స్టోరేజ్) 7, 980 డాలర్లకు అందించనుంది. కాబట్టి, బాగా డబ్బున్నోళ్ల కోసం, సెక్యూరిటీ భయం ఉన్నవాళ్ల కోసం ఈ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురాబోతున్నట్లు అర్థమవుతోంది కదా!.
2010 నుంచి ఇటాలియన్ నగల వ్యాపారి ఇలియా గియకోమెట్టి ఆధ్వర్యంలో ‘కేవియర్’(1861 నుంచి వ్యాపారంలో ఉంది).. ఫ్లోరెన్స్(ఇటలీ) వేదికగా లగ్జరీ ఉత్పత్తులను ప్రపంచానికి అందిస్తోంది. ఐఫోన్, శాంసంగ్‌లతో పాటు పలు రకాల బ్రాండ్‌లకు విలాసవంతమైన సొగసులు అద్ది(బంగారం, వజ్రాలు ఇతరత్రాలు) లిమిటెడ్ యూనిట్లను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తూ ఓ బ్రాండ్‌గా ముద్రను సంపాదించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment