టెక్ టాక్ టెక్నాలజీ
మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీలో కూడా వినూత్న మార్పులు చోటుచూసుకుంటున్నాయి. కొత్త కొత్త ఫీచర్స్ మన దగ్గరకు వస్తున్నాయి. వాటిలో రెగ్యులర్‌గా వాడే వస్తువులైనా ఉండొచ్చు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామైనా ఉండొచ్చు. ఫీచర్‌కి తగ్గట్టుగా సరికొత్త టెక్నాలజీ పరికరాలు ఇప్పుడు మీ ముందుకు వచ్చాయి. మరవేంటో చూద్దాం.
ఇన్‌స్టాలో 15 నిమిషాల ఎడిట్ ఫీచర్!
మెసేజ్‌లను పంపిన తరువాత పదిహేను నిమిషాల వరకు ఎడిట్ చేయవచ్చని ప్రకటించింది ఫోటో, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్. పదిహేను నిమిషాల ఈ ఎడిట్ విండో వాట్సాప్‌లాంటి ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లాగే ఉంటుంది. సరిగ్గా అనిపించని మెసేజ్‌లను సరిచేయడానికి ఇది యూజర్‌లను అనుమతిస్తుంది. యూజర్లు ఒకే సందేశాన్ని పలుమార్లు ఎడిట్ చేయవచ్చు. ఒకసారి ఎడిట్ చేసిన తరువాత మెసేజ్ ఎడిట్ చేయబడిందనే విషయం హైలెట్ అవుతుంది.
యాపిల్ న్యూ మ్యాక్‌బుక్ ఎయిర్
సైజ్ : 13.30 అంగుళాలు
రిజల్యూషన్ : 2560్ఠ1600 పిక్సెల్స్
బరువు (కేజీ) : 1.29
మెటీరియల్ : అల్యూమినియం
స్టోరేజ్ : 256జీబి
కలర్ : గోల్డ్, సిల్వర్, స్పేస్ గ్రే
గెలాక్సీ ఎఫ్ 15
లేటెస్ట్ బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎఫ్15 గురించి ప్రకటించింది శాంసంగ్. 4/6 జీబి ఆఫ్ ర్యామ్, 128 జీబి ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్‌తో కూడిన రెండు మెమోరీ వేరియంట్స్‌తో వస్తోంది.
కొన్ని వివరాలు..
డిస్‌ప్లే : 6.5 అంగుళాలు రిఫ్రెష్ రేట్: 90 హెచ్
ప్రైమరీ కెమెరా : 50 ఎంపీ
బ్యాటరీ : 6,000 ఎఏహెచ్
కలర్స్ : యాష్ బ్లాక్, జాజ్ గ్రీన్, వయోలెట్
Comments
Please login to add a commentAdd a comment