చూడటానికి ఇది సాదాసీదా సైకిల్‌లాగానే కనిపించినా, నిజానికిది ఫాస్ట్ ఫోల్డింగ్ ఈ–బైక్. ఇప్పటికే కొన్ని ఫోల్డింగ్ ఈ–బైక్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిని మడతపెట్టడానికి రెండు మూడు నిమిషాల సమయం పడుతుంది.
బ్రిటిష్ కంపెనీ ‘డికాథ్లాన్’ తాజాగా మార్కెట్‌లోకి ‘బీటీవిన్ ఈ–ఫోల్డ్–900’ పేరుతో తీసుకు వచ్చిన ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను కేవలం ఒక సెకండులోనే మడతపెట్టి కోరుకున్న చోటుకు తేలికగా తీసుకుపోవచ్చు. ఇది 252 డబ్ల్యూహెచ్ సామర్థ్యం గల రీచార్జ్ బ్యాటరీతో పనిచేస్తుంది. బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేశాక 55 కిలోమీటర్ల వరకు నిరంతరాయంగా ప్రయాణిస్తుంది.
బ్రష్‌లెస్ మోటారుతో తయారైన దీని గరిష్ఠ వేగం గంటకు 25 కిలోమీటర్లు. నగరాలు, పట్టణాల రహదారుల్లోనే కాకుండా ఎగుడు దిగుడు కొండ దారుల్లో కూడా సునాయాసంగా ప్రయాణించేలా దీనిని తీర్చిదిద్దడం విశేషం. ప్రస్తుతం దీనిని యూరోప్ మార్కెట్‌లోకి అందుబాటులోకి తెచ్చారు. దీని ధర 1499 పౌండ్లు (రూ.1.59 లక్షలు).
ఇవి చదవండి: ఇది డబుల్ డెక్కర్ బస్సు.. అలాగే రెస్టారెంట్ కూడా!
Comments
Please login to add a commentAdd a comment