
సాక్షి, ముంబై: బాలీవుడ్ స్టార్‌హీరో సల్మాన్‌ఖాన్ సూపర్‌లగ్జరీ కారును సొంతం చేసుకున్నాడు. భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేయని కొత్త బుల్లెట్ ప్రూఫ్ ‘నిస్సాన్ పెట్రోల్ ఎస్‌యూవీ’ని సల్మాన్ ఖాన్ అంతర్జాతీయ మార్కెట్‌నుంచి ప్రైవేట్‌గా దిగుమతి చేసుకున్నట్టు తెలుస్తోంది.
బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ నిస్సాన్ అత్యంత ఖరీదైన ఎస్‌యూవీని సొంతం చేసుకున్న సల్లూ భాయ్. ఈ వారం ముంబైలో తన వ్యక్తిగత భద్రత , స్థానిక పోలీసులతో పా తన కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ప్రయాణించినట్టు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోలను అనేక యూట్యూబ్ ఛానెల్‌లు షేర్ చేశాయి. సల్మాన్ ఖాన్ కనిపించిన నిస్సాన్ పెట్రోల్ స్టైలిష్ వైట్ కలర్‌లో ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టారు. ముందు సల్మాన్ ఖాన్ వ్యక్తిగత భద్రత ఉన్న నల్లటి టయోటా ఫార్చ్యూనర్ ,వెనుక మహీంద్రా బొలెరో నియోలో పోలీసు అధికారులున్న వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.
అత్యంత ఖరీదైన నిస్సాన్ ఎస్‌యూవీ ఆగ్నేయాసియా మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి. వ్యక్తిగత భద్రత రీత్యా బుల్లెట్‌ఫ్రూఫింగ్‌కు ఉత్తమ ఎంపికగా పరిగణించబడే అత్యంత సురక్షితమైన కారు బుల్లెట్ ప్రూఫ్ నిస్సాన్ పెట్రోల్ ఎస్‌యూని కొనుగోలు చేయడం విశేషం
5.6-లీటర్ వీ8 పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. 405hp, 560Nm ని అందించే ఈ ఇంజీన్‌లో 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా ఉంది. సాధారణ కార్లలో కనిపించే వాటి కంటే మందంగా ఉండే కొత్త విండ్‌షీల్డ్‌తో పాటు మందపాటి క్లాడింగ్‌తో కూడిన విండో గ్లాసులను కూడా ఇందులో జోడించారు.
కాగా సల్మాన్ ఖాన్ గ్యారేజీలో ఇది మొదటి బుల్లెట్ ప్రూఫ్ SUV కాదు. టయోటా ల్యాండ్ క్రూయిజర్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌తో అప్‌గ్రేడ్ చేశాడు. వీటితోపాటు, Range Rover Autobiography, Audi RS7, Mercedes AMG GLE 63 S , Mercedes BenzGL-Class కూడా సల్మాన్ ఖాన్ సొంతం
Comments
Please login to add a commentAdd a comment