బెదిరింపులు.. అయినా ఆ కారునే వాడుతున్న సల్మాన్‌ ఖాన్‌! | Salman Khan Toyota Land Cruiser Car Upgrades To Bulletproof After Threat | Sakshi
Sakshi News home page

Salman Khan: బెదిరింపులు.. అప్‌గ్రేడ్‌ చేసి మరీ ఆ కారులోనే ప్రయాణిస్తున్న సల్మాన్‌ ఖాన్‌!

Aug 1 2022 3:08 PM | Updated on Aug 1 2022 3:34 PM

Salman Khan Toyota Land Cruiser Car Upgrades To Bulletproof After Threat - Sakshi

సౌకర్యవంతమైన ప్రయాణం కోసం లగ్జరీ కార్లను ఎంచుకుంటారు. అయితే ఒక్కోసారి కంఫర్ట్‌తో పాటు భద్రతను దృ‍ష్టిలో ఉంచుకుని కొన్ని కార్లని ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. ఈ జాబితాలో టయోటా ల్యాండ్ క్రూయిజర్ కూడా ఉంది. అందుకే దేశంలోని పలువురు రాజకీయ నాయకులు టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎల్‌సీ 200 (LC200) కారుకి బుల్లెట్ ప్రూఫ్‌తో అప్‌గ్రేడ్‌ చేసి వాడుతున్నారు. భద్రత పరంగా ప్రముఖులు ఈ తరహా కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు.

అసలు కథేంటంటే..
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్‌కు చంపుతామంటూ బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే కదా! తనను, తన తండ్రిని హెచ్చరిస్తూ వచ్చిన బెదిరింపు లేఖపై సల్మాన్‌ ముంబై పోలీస్‌ చీఫ్ వివేక్ ఫన్సాల్కర్‌ను కలిశారు. ఈ బెదిరింపుల తర్వాత సల్మాన్ ముందు జాగ్రత్తగా తన ల్యాండ్ క్రూయిజర్‌‌ను బుల్లెట్ ప్రూఫ్ చేయించారు. ఈ బాలీవుడ్‌ హీరో తరచూ ఈ టయోటా ల్యాండ్ క్రూయిజర్ కారులోనే తిరుగుతూ కనిపిస్తాడు. ఆశ్చర్యమేమంటే సల్మాన్ వాడుతున్న టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎస్‌యూవీ లేటెస్ట్‌ మోడల్‌ కూడా కాదు. కానీ ఈ కారు తయారీ మోడల్‌ అనుసరించి దీనికి పకడ్బందీగా బుల్లెట్‌ ప్రూఫ్‌తో భద్రత ఏర్పాట్లను చేసుకున్నాడు. 

సల్మాన్ ఖాన్‌కి కార్లంటే చాలా ఇష్టం. మార్కెట్లో ఏదైనా కొత్త మోడల్‌ కారు వచ్చిందంటే చాలు అందులో లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్తుంటాడు. టయోటా ల్యాండ్ క్రూయిజర్ బుల్లెట్ ప్రూఫ్‌తో పాటు సల్మాన్ ఖాన్ వద్ద మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, లెక్సస్ ఎల్‌ఎక్స్ 470, ఆడి ఎ8, పోర్స్చే కయెన్, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ఆడి ఆర్‌ఎస్7, మెర్సిడెస్ ఎఎమ్‌జి జిఎల్‌ఇ 63 ఎస్, మెర్సిడెస్ బెంజ్ జిఎల్-కేజ్‌లు ఉన్నాయి.

చదవండి: Narendra Modi: ‘అమ్మ కొడుతోంది.. ధరలు మండుతున్నాయ్‌ మోదీ జీ’.. ఈ పాపకి ఎంత కష్టం వచ్చిందో!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement