Toyota land cruiser
-
ప్రపంచంలోని బెస్ట్ ఆఫ్-రోడింగ్ కార్లు (ఫోటోలు)
-
బెదిరింపులు.. అయినా ఆ కారునే వాడుతున్న సల్మాన్ ఖాన్!
సౌకర్యవంతమైన ప్రయాణం కోసం లగ్జరీ కార్లను ఎంచుకుంటారు. అయితే ఒక్కోసారి కంఫర్ట్‌తో పాటు భద్రతను దృష్టిలో ఉంచుకుని కొన్ని కార్లని ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. ఈ జాబితాలో టయోటా ల్యాండ్ క్రూయిజర్ కూడా ఉంది. అందుకే దేశంలోని పలువురు రాజకీయ నాయకులు టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎల్సీ 200 (LC200) కారుకి బుల్లెట్ ప్రూఫ్‌తో అప్‌గ్రేడ్ చేసి వాడుతున్నారు. భద్రత పరంగా ప్రముఖులు ఈ తరహా కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అసలు కథేంటంటే.. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్‌కు చంపుతామంటూ బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే కదా! తనను, తన తండ్రిని హెచ్చరిస్తూ వచ్చిన బెదిరింపు లేఖపై సల్మాన్ ముంబై పోలీస్ చీఫ్ వివేక్ ఫన్సాల్కర్‌ను కలిశారు. ఈ బెదిరింపుల తర్వాత సల్మాన్ ముందు జాగ్రత్తగా తన ల్యాండ్ క్రూయిజర్‌ను బుల్లెట్ ప్రూఫ్ చేయించారు. ఈ బాలీవుడ్ హీరో తరచూ ఈ టయోటా ల్యాండ్ క్రూయిజర్ కారులోనే తిరుగుతూ కనిపిస్తాడు. ఆశ్చర్యమేమంటే సల్మాన్ వాడుతున్న టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎస్యూవీ లేటెస్ట్ మోడల్ కూడా కాదు. కానీ ఈ కారు తయారీ మోడల్ అనుసరించి దీనికి పకడ్బందీగా బుల్లెట్ ప్రూఫ్‌తో భద్రత ఏర్పాట్లను చేసుకున్నాడు. సల్మాన్ ఖాన్‌కి కార్లంటే చాలా ఇష్టం. మార్కెట్లో ఏదైనా కొత్త మోడల్ కారు వచ్చిందంటే చాలు అందులో లాంగ్ డ్రైవ్‌కు వెళ్తుంటాడు. టయోటా ల్యాండ్ క్రూయిజర్ బుల్లెట్ ప్రూఫ్‌తో పాటు సల్మాన్ ఖాన్ వద్ద మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, లెక్సస్ ఎల్ఎక్స్ 470, ఆడి ఎ8, పోర్స్చే కయెన్, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ఆడి ఆర్ఎస్7, మెర్సిడెస్ ఎఎమ్‌జి జిఎల్ఇ 63 ఎస్, మెర్సిడెస్ బెంజ్ జిఎల్-కేజ్‌లు ఉన్నాయి. చదవండి: Narendra Modi: ‘అమ్మ కొడుతోంది.. ధరలు మండుతున్నాయ్ మోదీ జీ’.. ఈ పాపకి ఎంత కష్టం వచ్చిందో! -
రూ. కోటి కారులో కరువు పర్యటన!
యడ్యూరప్ప తీరు వివాదాస్పదం బెంగళూరు: కర్ణాటక బీజేపీ చీఫ్‌గా ఇటీవల పగ్గాలు చేపట్టిన బీఎస్ యడ్యూరప్ప వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు రాష్ట్రంలోని కరువు ప్రాంతాల్లో పర్యటించేందుకు మాజీ మంత్రి, తన విధేయుడు, వ్యాపారవేత్త మురేగేశ్ నిరానీ రూ.1.15కోట్ల ఖరీదైన టయోటా ల్యాండ్ క్రూజర్ వాహనాన్ని ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికే నిరానీ తనకు కారు ఇచ్చారని, పార్టీ చీఫ్‌గా రెండేళ్ల పదవీకాలం ముగియగానే తిరిగి తీసుకుంటారని యడ్యూరప్ప శనివారం చెప్పారు. 73 ఏళ్ల యడ్యూరప్ప రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించేందుకు సౌకర్యవంతంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఖరీదైన కారును సమకూర్చానని నిరానీ తెలిపారు. -
మాజీ సీఎంకు రూ. కోటి కారు గిఫ్ట్
బెంగళూరు: నిన్న, మొన్నటి వరకూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఖరీదైన వాచీ కలకలం రేపితే...తాజాగా సొంతగూటికి చేరిన మాజీ సీఎం యడ్యూరప్ప కారు వివాదంలో చిక్కుకున్నారు. రెండు రోజుల క్రితం అధికారికంగా కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన యెడ్డీకి... కోటి రూపాయల విలువైన టయోటా ల్యాండ్ క్రూయిజర్ బహుమతిగా ఇవ్వటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయటం ఆలస్యం యెడ్డీకి... మాజీ మంత్రి మురుగేశ్ నిరానీ పార్టీ కార్యాలయంలోనే ల్యాండ్ క్రూయిజర్ కారును గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే కరువు ప్రాంతాల్లో సందర్శించేందుకు యడ్యూరప్ప ఈ వాహనాన్ని వినియోగించనున్నారట. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో యడ్యూరప్ప శనివారం నోరు విప్పారు. 'పార్టీ అవసరాల దృష్ట్యా వాడుకునేందుకు మురుగేశ్ నిరానీ నాకు కారు బహుమతిగా ఇచ్చాడు. పని అయిపోయిన అనంతరం అతడికే కారును అప్పగిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాల్సి ఉన్నందున సురక్షితమైన, సౌకర్యవంతమైన వాహనం' అవసరమంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు కరవు ప్రభావిత జిల్లాల్లో పర్యటించేందుకు యడ్యూరప్ప ఖరీదైన కారు వాడకంపై ప్రతిపక్షం విమర్శల దాడికి దిగింది.