పంద్రాగస్టు ఏర్పాట్లను పర్యవేక్షించిన డీజీపీ | DGP Gautam Sawang Oversees The Arrangements For Independence Celebrations At Vijayawada | Sakshi
Sakshi News home page

పంద్రాగస్టు ఏర్పాట్లను పర్యవేక్షించిన డీజీపీ

Published Fri, Aug 9 2019 6:18 PM | Last Updated on Fri, Aug 9 2019 6:26 PM

DGP Gautam Sawang Oversees The Arrangements For Independence Celebrations At Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : పంద్రాగస్టు సందర్భంగా ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ శుక్రవారం ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కంటెంజెన్స్‌ నిర్శమించిన కవాతుల ట్రయల్‌ రన్‌ను స్వయంగా పర్యవేక్షించారు. స్వాతంత్యదినోత్సవ వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు.కంటెంజెన్ట్ల కవాతు ఆకట్టుకునేలా ఉందని, ఈసారి వేడుకల్లో మాజీ సైనికుల ఆధ్వర్యంలో సాంఘీక,సంక్షేమ,గురుకుల పాఠశాల విద్యార్థులతో నిర్వహించనున్న పైప్‌ బ్యాండ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని తెలిపారు. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో భద్రత విషయంలో ఏపీకి ఎలాంటి ముప్పు లేదని, అయినా అప్రమత్తంగానే ఉంటామని తెలిపారు. ఆహ్లదకర వాతావరణంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు డీజీపీ వెల్లడించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement