
సాక్షి, గుంటూరు: తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ నేతల చిత్రపటాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో శాసనమండలి ప్రతిపక్ష నేత లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, విడదల రజని, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘‘ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండే రోజు.. బానిస సంకెళ్లను తెంచుకున్న రోజు.. మనందరికీ స్వేచ్ఛా వాయువులు పంచిన రోజు ఈ రోజు. రాష్ట్ర ప్రజలందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులందరికీ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండే రోజు.. బానిస సంకెళ్లను తెంచుకున్న రోజు.. మనందరికీ స్వేచ్ఛా వాయువులు పంచిన రోజు ఈ రోజు. రాష్ట్ర ప్రజలందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులందరికీ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 15, 2024


Comments
Please login to add a commentAdd a comment