వేడుక వేళ.. | Independence day celebrations at Golconda Fort | Sakshi
Sakshi News home page

వేడుక వేళ..

Aug 15 2014 1:16 AM | Updated on Sep 2 2017 11:52 AM

వేడుక వేళ..

వేడుక వేళ..

పంద్రాగస్టు వేడుకల కోసం గోల్కొండ కోటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రాత్రి వేళ విద్యుత్ దీపాలతో కోట ధగధగ మెరిసిపోతుంది.

 నేడు గోల్కొండ కోటపై జెండా పండుగ
 కనువిందు చేసేలా ఏర్పాట్లు
 మెరిసిపోతున్న కోట

 
గోల్కొండ: పంద్రాగస్టు వేడుకల కోసం గోల్కొండ కోటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రాత్రి వేళ విద్యుత్ దీపాలతో కోట ధగధగ మెరిసిపోతుంది. పరిసరాలను చూడముచ్చటగా అలంకరించారు. ఈ ఏర్పాట్లను చూసి పర్యాటకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. గురువారం నుంచి పోలీసు, ఇంటలిజెన్స్ అధికారులు గోల్కొండ కోటలో జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంత్రం వరకు జెండా వే దిక సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించే వేదిక చుట్టూ సెక్యూరిటీ అధికారులు మెటల్ డిటెక్టర్‌తో అణువణువు గాలించారు. గోల్కొండ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
 
అదిరిన కల్చరల్ ఫెస్ట్ డెమో..
వేడుకల్లో భాగంగా సాంస్కృతిక శాఖ వారు రిహార్సల్స్ నిర్వహించారు. రాణిమహల్ టైస్, ఆయుధగారం వెనుక భాగంలో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టేలా కళాకారులు అద్భుతంగా ప్రదర్శనలిచ్చారు. కొమ్ము, డప్పు, బూర, డోలు తదితర సంగీత వాయిద్యాల మాధుర్యాలు ఓ పక్కన మరోవైపు లంబాడి నృత్యాలతో కోట పరిసరాలు హోరెత్తాయి.
 
పటిష్ట బందోబస్తు...
వేడుక ల నిర్వహణ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన గోల్కొండలో ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కోటలోని వివిధ భవనాలు, శిథిలాలు ఉండడంతో ఏర్పాట్లు కష్టతరమైనా ఆయా శాఖల అధికారుల స మన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. అనంతరం ఆయన ప్రొటోకాల్ డిప్యూటీ సెక్రెటరీ అరవిందర్‌సింగ్, ఇతర అధికారులతో కలిసి కోటలోకి ముఖ్యమంత్రి, ఇతర వీఐపీలు వచ్చే మార్గాలు, వేదికలను క్షుణ్ణంగా పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement