
గోల్కొండ కోట కిటకిట
హైదరాబాద్: గోల్కొండ కోట ఆదివారం పర్యాటకులతో కిట కిటలాడింది. అధిక సంఖ్యలో పర్యాటకులు ఒకే రోజు తరలిరావడం రెండు నెలల తర్వాత ఇదే ప్రథమం. దీంతో గోల్కొండ కోటతో పాటు పరిసరాలు కిట కిటలాడాయి. పరీక్షల సీజన్ ముగియడంతో విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు.
కాగా, మరో పర్యాటక ప్రాంతమైన కుతుబ్‌షాహి సమాధుల ప్రాంగణంలో కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు సందడి చేశారు.