సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. మూడురోజులపాటు జరగనున్న ఈ ఫెస్టివల్‌లో 20 దేశాలకు చెందిన ప్రతినిధులు సందడి చేస్తున్నారు. మనదేశంలోని 25 రాష్ట్రాలకు చెందిన ఔత్సాహికులు కూడా ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. కైట్ ఫెస్టివల్‌కుతోడు స్వీట్ ఫెస్టివల్ కూడా ఇక్కడ జరుగుతుండటంతో పరేడ్ గ్రౌండ్‌లో కోలాహలం నెలకొంది. స్వీట్ ఫెస్టివల్‌లో భాగంగా 1200 రకాల మిఠాయిలు ఆహూతుల నోరూరింపజేస్తున్నాయి. దీనికితోడు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే జానపద నృత్యాలు ఆహూతులకు కనువిందు చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment