International Kite Festival
-
అహ్మదాబాద్ : ‘ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్’ (ఫొటోలు)
-
పట్నం వస్తున్న పల్లె...
సాక్షి, హైదరాబాద్: మహానగరం ఒక్కసారిగా పల్లె జ్ఞాపకాల్లోకి వెళ్లబోతోంది. ఈ నెల 13, 14, 15 తేదీల్లో సికింద్రాబాద్ పరేడ్, జింఖానా మైదానాలు స్వీట్, కైట్ ఫెస్టివల్‌కు వేదిక కాబోతున్నాయి. గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలకు ఏటా ఓ కొత్త ఈవెంట్‌ను జోడించే క్రమంలో భాగంగా ఈసారి గ్రామీణ పని, ఆటపాటలను (విలేజ్ గేమ్స్ అండ్ కల్చర్) జోడిస్తున్నారు. పల్లెల్లోనూ కనిపించకుండా పోయిన విసుర్రాయి, తాడూ బొంగరం, చిర్రగోన, టైరు ఆట, గోలీలాటల సందడితో పదికి పైగా ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. 20 దేశాల పతంగ్‌లు.. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో భాగంగా ఈసారి అమెరికా, సింగపూర్, ఇండోనేసియా, థాయ్‌లాండ్, శ్రీలంక తదితర 20 దేశాల పతంగ్‌లు ఎగరనున్నాయి. 13న ఉదయం, సాయంత్రం వేళల్లో 100 మంది పతంగ్ ఫ్లయర్స్ తో పాటు ముప్పైకి పైగా కైట్ క్లబ్‌లు ఈ పెస్టివల్‌లో పాల్గొంటాయి. ఇక స్వీట్ ఫెస్టివల్లో భాగంగా ఆంధ్రా పూతరేకులు, తమిళ పొంగళ్, గుజరాత్ బాసుంది, జార్ఖండ్ అనార్సా, మణిపూర్ ఖీర్, సిక్కిం సీల్‌రోటీ ఇలా దాదాపు 1,200 రకాల స్వీట్లన్నీ ఒకే చోట నోరూరించనున్నాయి. 13, 14, 15 తేదీల్లో మధ్యాçహ్నం 2 నుంచి రాత్రి వరకు ఈ స్టాళ్లు అందుబాటులో ఉంటాయి. ఏటా కొత్త ఈవెంట్లు నగరానికి పండుగ కళ తీసుకువచ్చే క్రమంలో 2016 నుంచి కైట్, 2017 నుంచి స్వీట్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నాం. ఈ యేడు కొత్తగా విలేజ్ గేమ్స్ అండ్ కల్చర్ ఈవెంట్లను కొత్తగా తీసుకువస్తున్నాం. వచ్చే ఏడాది మరో కొత్త అంశాన్ని యాడ్ చేస్తాం. ఈసారి జరిగే ఉత్సవాలకు 15 లక్షల మందికి పైగా జనాలు వస్తారని అంచనా వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నాం. – బుర్రా వెంకటేశం, పర్యాటక శాఖ కార్యదర్శి -
ముగిసిన స్వీట్.. కైట్ ఫెస్టివల్
-
సయ్యారే వయ్యారి గాలిపటం..!
-
పద పదవే వయ్యారి గాలిపటమా!
సంక్రాంతి పండుగ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాలుబోసిపోగా పరేడ్ గ్రౌండ్ పరిసరాలు మాత్రం సందర్శకులతో కిక్కిరిసి పోయాయి. నగరంలో సంక్రాంతి సందడంతా పరేడ్ గ్రౌండ్లోనేకనిపించింది. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్‌ను చూసేందుకు పలు ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.ఈ ఉత్సాహం.. పండుగ వాతావరణాన్ని చూసేందుకు రెండు కళ్లుచాలవంటే అతిశయోక్తి కాదు. ఈ హడావుడితో మైదానం చుట్టూ రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం మురిసిపోయింది. ఆకాశం సప్తవర్ణ శోభితమైంది. పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నగర గగనానికి కొత్తరంగులు అద్దింది. అంతర్జాతీయ పతంగుల పండుగను నగర యువత ఎంజాయ్ చేస్తోంది. అసలే పండుగ.. ఆపై వరుస సెలవులు కావడంతో సోమవారం భారీ సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. రకరకాల ఆకారాలు, రంగురంగుల పతంగులను ఎగరేస్తూ.. రాత్రి వరకు ఉత్సాహంగా గడిపారు. ఈ పండుగకోసమే వచ్చిన దేశ, విదేశాలకు చెందిన పతంగులు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. గాలిలో నృత్యం చేస్తున్న టైగర్, డ్రాగన్, చింపాంజీ, గరుడ వంటి రకరకాల పతంగులు చూసేందుకు ఉత్సాహం చూపించారు. గ్రౌండ్లో ఏర్పాటుచేసిన డీజే సౌండ్స్ సందర్శకుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచాయి. రిమోట్ సహాయంతో రాత్రి ఆకాశంలో ఎగురవేసిన లైటింగ్ పతంగులు ఈ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సప్తవర్ణాల పతంగులతో పరేడ్ గ్రౌండ్ పరిసరాలు కలర్పుల్గా మారాయి. అటు నెక్లెస్ రోడ్‌లోనూ కుర్రకారు ఉత్సాహంగా పతంగులు ఎగురవేశారు. ఇదినాలుగోసారి హైదరాబాద్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో పాల్గొనడం ఇది నాలుగోసారి. ఈసారి.. ఇండోనేసియా, థాయ్‌లాండ్, మలేసియా, స్వీడన్, పోలాండ్, న్యూజిలాండ్, అమెరికా, బ్రిటన్, కొరియా, కాంబోడియా, పిలిప్పీన్స్ దేశాలకు చెందిన కైట్ ప్లేయర్స్ పాల్గొన్నారు. మాది గుజరాత్. వ్యక్తిగతంగా నాకు ఇది 15వ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్. 45 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్ ఇందులో పాల్గొంటున్నారు. – పవన్ సొలంకి, తెలంగాణ టూరిజం కైట్స్ కన్సల్టెంట్ -
కన్నులపండువగా కైట్ ఫెస్టివల్..
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. మూడురోజులపాటు జరగనున్న ఈ ఫెస్టివల్లో 20 దేశాలకు చెందిన ప్రతినిధులు సందడి చేస్తున్నారు. మనదేశంలోని 25 రాష్ట్రాలకు చెందిన ఔత్సాహికులు కూడా ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. కైట్ ఫెస్టివల్‌కుతోడు స్వీట్ ఫెస్టివల్ కూడా ఇక్కడ జరుగుతుండటంతో పరేడ్ గ్రౌండ్లో కోలాహలం నెలకొంది. స్వీట్ ఫెస్టివల్లో భాగంగా 1200 రకాల మిఠాయిలు ఆహూతుల నోరూరింపజేస్తున్నాయి. దీనికితోడు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే జానపద నృత్యాలు ఆహూతులకు కనువిందు చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
అట్టహాసంగా కైట్ ఫెస్టివల్
సాక్షి, యాదాద్రి /యాదగిరికొండ / యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలోని పెద్దగుట్టపై జరిగిన అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు పతంగులను ఎగురవేసి సంబ రాలు జరుపుకున్నారు. నింగిలో ఎగురుతున్న పతంగులను చూసి స్థానిక ప్రజలు ఆనందపారవశ్యంతో మునిగితేలా రు. ఫెస్టివల్‌కు భువనగిరికి చెందిన బచ్పన్ పాఠశాల, వివిధ ఇంజనీరింగ్ కలేజీల విద్యార్థులు వలంట రీలుగా వ్యవహరించారు. ఆరోగ్య శిబిరం ఏర్పాటు కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్న ప్రదేశంలో జిల్లా వైద్యాధికారి డీకే చారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, అర్అండ్బీ చీఫ్ ఇంజనీర్ నాయక్ ప్రారంభించారు. మధ్యాహ్న సమయంలో పెద్దగుట్టపై ఎండ ఎక్కువగా ఉండటంతో జిల్లా కలెక్టర్ బీపీ చెక్ చేయించుకున్నారు. అనంతరం వైద్యులు కలెక్టర్‌కు గ్లూకోజ్ తాగించారు. ప్రత్యేక ఆకర్షణగా చేనేత వస్త్రాలు ఈ కైట్ ఫెస్టివల్లో చేనేత వస్త్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరూ ధరించాలన్న తెలంగాణ ప్రభుత్వం సూచనలతో ఈ వేడుకలు జరుగుతున్న సమయంలో భూదాన్‌పోచంపల్లి నుంచి తీసుకొచ్చి ఇక్కడ విక్రయించారు. ఎక్కువగా చీరలు తీసుకురావడంతో అధిక సంఖ్యలో మహిళలు అక్కడికి చేరుకొని తిలకించారు. అలాగే వేడుకలు జరుగుతున్న సమయంలో ఎలాంటి అగ్ని ప్రమాదం జరగకుండా భువనగిరి అగ్నిమాపక కేంద్రం నుంచి ఫైరింజన్ తీసుకువచ్చారు. సంక్రాంతి రోజున జరిగిన అగ్నిప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా ఈ ఫైరింజన్‌ను తీసుకువచ్చారు. అందరికీ తెల్ల టోపీలు తెలంగాణ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ పే రిట వైటీడీఏ అధికారులు అక్కడికి వచ్చిన భక్తులకు, ప్రజలకు, విదేశీయులకు శాంతి ని కోరుతూ తెల్లటోపీలను ఉచితంగా అం దజేశారు. వచ్చిన అతిథులు కూర్చోవడానికి శామియానాలతో పాటు కుర్చీలను ఏర్పాటు చేశారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక రుచులు పెద్దగుట్టపై తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఫుడ్‌కోర్టు ఏర్పాటు చేశారు. ఇందులో సమోసా, మిర్చీలు, స్యాండ్విచ్ వంటి ఆహార పదార్థాలను విక్రయించారు. చిరువ్యాపారుల సందడి పతంగుల పండుగ సందర్భంగా చిరువ్యాపారులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పుట్నాలు, జామకాయలు, ఐస్‌క్రీమ్స్ వ్యాపారులు వచ్చి తమ వ్యాపారాన్ని కొనసాగించారు.జేసీ జి.రవినాయక్, ఈఓ గీతారెడ్డి, వైటీడీఏ వైస్‌చైర్మన్ కిషన్Sరావు, జౌళిశాఖ ఏడీ పద్మ, ఏసీపీ మోహన్‌రెడ్డి, తహసీల్దార్ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు -
ప్రతీ అమ్మాయి కోసం గాలిపటాన్ని ఎగరేద్దాం!
పతంగుల పండుగకు సర్వంసిద్ధం సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్బంగా గురువారం నుంచి ఆరు రోజుల పాటు నిర్వహించే రెండో అంతర్జాతీయ పతంగుల పండుగకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. అమ్మాయిల చదువు, సాధికారతపై అవగాహన పెంపొందించడంలో భాగంగా నిర్వహించనున్న ఈ పండుగను వీక్షించడానికి 50,000 మంది ప్రేక్షకులు వస్తారని అంచనా. 17 దేశాల నుంచి 70 అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్, మనదేశం నుంచి 40 జాతీయ మంది కైట్ ఫ్లయర్స్ ఈ వేడుకల్లో పాల్గొంటారని రాష్ట్ర పర్యాటక శాఖ తెలిపింది. పీపుల్స్ ప్లాజాలో గురువారం జరిగే ప్రత్యేక కైట్ ఫ్లయింగ్ కార్యక్రమంతో ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఆగాఖాన్ అకాడమీలో ఈ నెల 13, 14,15 తేదీల్లో ‘ఆకాశాన్ని రంగుల మయం చేద్దాం- ప్రతీ అమ్మాయి కోసం గాలిపటాన్ని ఎగరేద్దాం’అనే నినాదంతో ప్రధాన వేడుకలు జరుగుతాయి. యాదగిరి, వరంగల్ జిల్లాల్లో ఈ నెల 16, 17 తేదీల్లో పతంగుల పండుగ జరుగుతుంది. రాబోయే అయిదేళ్లలో పతంగుల పండుగను రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకునేలా చర్యలు తీసుకోనున్నట్లు పర్యాటక శాఖ తన ప్రకటనలో తెలిపింది. -
పద పదవే వయ్యారి గాలిపటమా..
ఓరుగల్లులో పతంగుల విహారం మొదటిసారిగా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ హన్మకొండ ఆర్ట్స్ కళాశాల వేదికగా ఈనెల 17న సంబురాలు ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేందుకు సరికొత్త ఆట వీక్షకుల కోసం స్టాళ్లు, ఫుడ్ కోర్టుల ఏర్పాటు హాజరుకానున్న30 దేశాల ప్రతినిధులు హన్మకొండ : ఆకాశంలో రివ్వు రివ్వున ఎగురుతూ.. వివిధ రకాల రంగులతో ఊయలూగుతూ.. చిన్నారులు, యువకులతో కేరింతలు కొట్టించే పతంగుల పండుగ సంబురాలకు వరంగల్ నగరం వేదిక కానుంది. ఆకర్షణీయమైన ఆకృతులతో నింగిలోకి ఎగిరే గాలిపటాలు ప్రజలను కనువిందు చేయనున్నాయి. ఈ మేరకు మహానగరంలో ఈనెల 17న ఆంతర్జాతీయ పతంగుల పం డుగను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచ పర్యాటకుల దృష్టిని వరంగల్ జిల్లా వైపునకు మరలించేందుకు ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇంటర్ నేషనల్ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో ఈనెల 14, 15 తేదీల్లో, యాదాద్రి భువనగిరి జిల్లాలో 16న, వరంగల్‌లో 17న ఉత్సవాలను నిర్వహించేందుకు సిద్ధమైంది. వరంగల్ కేంద్రంగా నిర్వహిస్తున్న సంబురాల ఏర్పాట్లపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు హన్మకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో వేడఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. 30 దేశాల నుంచి క్రీడాకారులు.. అంతర్జాతీయ పతంగుల పండుగలో 30 దేశాల నుంచి ఔత్సాహిక క్రీడాకారులు పాల్గొననున్నారు. వీరితో పాటు మన రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన వారు కూడా హాజరుకానున్నారు. సంబురాల్లో భాగంగా ఈనెల 17వ తేదీన ఉదయం ఖిలా వరంగల్‌లో హెరిటేజ్ వాక్ నిర్వహిస్తారు. అనంతరం అల్ఫాహారం చేసి ఆర్ట్స్ కళాశాలకు చేరుకుని పతంగులను ఎగురవేస్తారు. కాగా, గాలిపటాల ఆటను నిర్వహిస్తున్న చోట క్రాఫ్ట్‌బజార్, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్వహణకు ప్రత్యేకంగా స్టాళ్లను కూడా అందుబాటులో ఉంచనున్నారు. అలాగే వరంగల్ జర్రీస్, పెంబర్తి కళా ఖండాలు, చేర్యాల నకాషీ చిత్రాలు, హస్త కళలు, చేనేత ఉత్పత్తులను స్టాళ్లలో పెట్టనున్నారు. వీటితో పాటు పండుగను వీక్షించేందుకు వచ్చే ప్రజల కోసం ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. టూరిజం ప్రమోషన్లో భాగంగా అంతర్జాతీయ పతంగుల పండుగను ఇక్కడ నిర్వహిస్తుండడంతో జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక రంగాన్ని పరిచయం చేసేందుకే.. పాత వరంగల్ జిల్లాలోని పర్యాటక రంగాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం. అంతర్జాతీయస్థాయి పతంగుల సంబురాల్లో విదేశాల్లోని ఔత్సాహిక క్రీడాకారులు ఈనెల 16న హన్మకొండకు చేరుకుంటారు. 17న ఉదయం వారితో పాటు తెలంగాణలో ఆసక్తి కలిగిన క్రీడాకారులు పతంగుల పోటీలో పాల్గొంటారు. వీక్షకుల కోసం క్రాఫ్ట్‌బజార్, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నాం. – శివాజీ, జిల్లా పర్యాటక అధికారి -
కైట్ ఫెస్టివల్ లో మంచు ఫ్యామిలీ సందడి
ఆగాఖాన్ అకాడమీ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్-2016' లో శుక్రవారం మంచు మోహన్ బాబు ఫ్యామిలీ సందడి చేసింది. రెండు రోజులుగా సాగుతున్న ఈ పతంగుల పండుగలో ఆరు దేశాల నుంచి 32 మంది ఔత్సాహికులు పోటీ పడుతున్నారు. గాలి పటాల పండుగలో నటుడు సుమన్ పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పతంగుల పోటీలు నిర్వహిస్తున్న తెలంగాణ టూరిజం శాఖను ఆయన అభినందించారు. వివిధ దేశాల వారు .. ఈ పోటీల్లో పాల్గొనటం వల్ల మన సంస్కృతి విదేశీయులకు తెలిసే అకాశం ఉంటుంది. వారి నుంచి కొత్త తరహా గాలి పటాలు... వాటి నిర్మాణం వంటి విషయాలు తెలుసుకోవచ్చని అన్నారు.ఈ పోటీల్లో పాల్గొన్న బృందాలు భారీ సైజులో ఉన్న గాలి పటాలు ఉపయోగించాయి. వింత ఆకారాలు.. డిజైనర్ గాలిపటాలు చూసేందుకు అగాఖాన్ అకాడమీ చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తరలి వచ్చారు. -
కైట్ ఫెస్టివల్ లో మంచు ఫ్యామిలీ సందడి
-
పతంగులు.. ముత్యాలు..
సాక్షి, హైదరాబాద్: మకర సంక్రాంతి వేళ ‘గుజరాత్’ కొత్త శోభతో మెరిసిపోతుంది. అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, థాయిలాండ్ సహా దాదాపు 45 దేశాల పర్యాటకులు అహ్మదాబాద్‌లో వాలిపోతుంటారు. 3 రోజులు అహ్మదాబాద్ ఆకాశం సప్తవర్ణశోభితంగా వెలిగిపోతుంది. ఆ వేడుకకు గిన్నిస్‌బుక్‌లో చోటు కూడా దక్కింది. అదే అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం. విదేశీ పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటున్న ఆ వేడుకకు ఈసారి మన భాగ్యనగరం కూడా వేదిక కాబోతోంది. నగర శివారులో వంద ఎకరాల సువిశాల స్థలంలో విస్తరించిన ఆగాఖాన్ ట్రస్టు అకాడమీలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ ట్రస్టుతో కలసి ఈ అంతర్జాతీయ ఉత్సవాన్ని నిర్వహించాలని యోచిస్తోంది. అంతర్జాతీయంగా పతంగులు ఎగురవేయటంలో దిట్టలుగా పేరున్న ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు పర్యాటక అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ బ్రాండ్‌తో దీన్ని నిర్వహించటం ద్వారా విదేశీయుల దృష్టి హైదరాబాద్‌పై పడేలా చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. ఇలాంటి మరిన్ని వేడుకలు నిర్వహించటం ద్వారా తరచూ హైదరాబాద్/తెలంగాణ పేరు అంతర్జాతీయంగా వినిపించాలనే తాపత్రయంలో ఉంది. త్వరలో ముత్యాల ప్రదర్శన భాగ్యనగరానికి మరో పేరు ముత్యాల నగరం (పెరల్స్ సిటీ). అప్పట్లో ముత్యాలను ప్రపంచం నలుమూలలకు ఎగుమతి చేసిన ఖ్యాతి ఈ నగర సొంతం. చార్మినార్‌కు ఓ పక్కన ఉన్న లాడ్ బజార్ ఇప్పటికీ దానికి గుర్తుగా నిలుస్తోంది. దీన్ని కూడా ఇప్పుడు అంతర్జాతీయ విపణిలో మరోసారి గుర్తు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం అంతర్జాతీయ స్థాయిలో ముత్యాలు, గాజుల ప్రదర్శనను నిర్వహించాలనీ యోచిస్తోంది. దీన్ని కూడా జనవరిలోనే నిర్వహించాలనే ఆలోచనతో ఉంది. మూడు రోజులు జరిగే ఈ ప్రదర్శనకు అలనాటి ప్రముఖ హోటల్ ‘రిట్జ్’ను వేదికగా చేసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ ప్రదర్శనకు అనుబంధంగా హైదరాబాద్ వంటకాల ఘుమఘుమలు, ఇక్కడి కళల హొయలనూ సందర్శకుల ముందు నిలపాలని నిర్ణయించింది. ఇందుకోసం గోల్కొండ సమీపంలోని తారామతి బారాదరిని వేదికగా గుర్తించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ముత్యాలు, గాజుల ప్రదర్శన.. సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు అక్కడ ‘రుచులు’, కళల ప్రదర్శన నిర్వహించటం ద్వారా అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకోవచ్చని భావిస్తోంది. ‘బతుకమ్మ’లో సాధ్యం కాకపోవటంతో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి తనకుంటూ ఓ ప్రత్యేకత ఉండాలని భావిస్తున్న ప్రభుత్వం ఇందుకు బతుకమ్మ వేడుకను వినియోగించుకోవాలని భావించింది. గత బతుకమ్మ ఉత్సవాన్ని అంతర్జాతీయ వేడుకగా నిర్వహించాలని అనుకుంది. ప్రపంచంలో ఉన్న ఏకైక మహిళా పండుగగా దానికి విదేశాల్లో ప్రచారం చేసి విదేశీ పర్యాటకులను ఆకట్టుకోవాలని భావించింది. కానీ సమయం చిక్కకపోవటంతో చేయలేకపోయింది. వచ్చే ఏడాది నిర్వహించే వేడుకల్లో దాన్ని సాధించాలనే పట్టుదలతో ఉంది.