సాక్షి, యాదాద్రి /యాదగిరికొండ / యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలోని పెద్దగుట్టపై జరిగిన అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు పతంగులను ఎగురవేసి సంబ రాలు జరుపుకున్నారు. నింగిలో ఎగురుతున్న పతంగులను చూసి స్థానిక ప్రజలు ఆనందపారవశ్యంతో మునిగితేలా రు. ఫెస్టివల్‌కు భువనగిరికి చెందిన బచ్‌పన్ పాఠశాల, వివిధ ఇంజనీరింగ్ కలేజీల విద్యార్థులు వలంట రీలుగా వ్యవహరించారు.
ఆరోగ్య శిబిరం ఏర్పాటు
కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్న ప్రదేశంలో జిల్లా వైద్యాధికారి డీకే చారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, అర్‌అండ్‌బీ చీఫ్ ఇంజనీర్ నాయక్ ప్రారంభించారు. మధ్యాహ్న సమయంలో పెద్దగుట్టపై ఎండ ఎక్కువగా ఉండటంతో జిల్లా కలెక్టర్ బీపీ చెక్ చేయించుకున్నారు. అనంతరం వైద్యులు కలెక్టర్‌కు గ్లూకోజ్ తాగించారు.
ప్రత్యేక ఆకర్షణగా చేనేత వస్త్రాలు
ఈ కైట్ ఫెస్టివల్‌లో చేనేత వస్త్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరూ ధరించాలన్న తెలంగాణ ప్రభుత్వం సూచనలతో ఈ వేడుకలు జరుగుతున్న సమయంలో భూదాన్‌పోచంపల్లి నుంచి తీసుకొచ్చి ఇక్కడ విక్రయించారు. ఎక్కువగా చీరలు తీసుకురావడంతో అధిక సంఖ్యలో మహిళలు అక్కడికి చేరుకొని తిలకించారు. అలాగే వేడుకలు జరుగుతున్న సమయంలో ఎలాంటి అగ్ని ప్రమాదం జరగకుండా భువనగిరి అగ్నిమాపక కేంద్రం నుంచి ఫైరింజన్ తీసుకువచ్చారు. సంక్రాంతి రోజున జరిగిన అగ్నిప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా ఈ ఫైరింజన్‌ను తీసుకువచ్చారు.
అందరికీ తెల్ల టోపీలు
తెలంగాణ ఇంటర్‌నేషనల్ కైట్ ఫెస్టివల్ పే రిట వైటీడీఏ అధికారులు అక్కడికి వచ్చిన భక్తులకు, ప్రజలకు, విదేశీయులకు శాంతి ని కోరుతూ తెల్లటోపీలను ఉచితంగా అం దజేశారు. వచ్చిన అతిథులు కూర్చోవడానికి శామియానాలతో పాటు కుర్చీలను ఏర్పాటు చేశారు.
టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక రుచులు
పెద్దగుట్టపై తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఫుడ్‌కోర్టు ఏర్పాటు చేశారు. ఇందులో సమోసా, మిర్చీలు, స్యాండ్‌విచ్ వంటి ఆహార పదార్థాలను విక్రయించారు.
చిరువ్యాపారుల సందడి
పతంగుల పండుగ సందర్భంగా చిరువ్యాపారులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పుట్నాలు, జామకాయలు, ఐస్‌క్రీమ్స్ వ్యాపారులు వచ్చి తమ వ్యాపారాన్ని కొనసాగించారు.జేసీ జి.రవినాయక్, ఈఓ గీతారెడ్డి, వైటీడీఏ వైస్‌చైర్మన్ కిషన్Sరావు, జౌళిశాఖ ఏడీ పద్మ, ఏసీపీ మోహన్‌రెడ్డి, తహసీల్దార్ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు
అట్టహాసంగా కైట్ ఫెస్టివల్
Published Tue, Jan 17 2017 4:46 AM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM
Advertisement
Advertisement