కైట్ ఫెస్టివల్ లో మంచు ఫ్యామిలీ సందడి
ఆగాఖాన్ అకాడమీ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్-2016' లో శుక్రవారం మంచు మోహన్ బాబు ఫ్యామిలీ సందడి చేసింది. రెండు రోజులుగా సాగుతున్న ఈ పతంగుల పండుగలో ఆరు దేశాల నుంచి 32 మంది ఔత్సాహికులు పోటీ పడుతున్నారు.
గాలి పటాల పండుగలో నటుడు సుమన్ పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పతంగుల పోటీలు నిర్వహిస్తున్న తెలంగాణ టూరిజం శాఖను ఆయన అభినందించారు. వివిధ దేశాల వారు .. ఈ పోటీల్లో పాల్గొనటం వల్ల మన సంస్కృతి విదేశీయులకు తెలిసే అకాశం ఉంటుంది. వారి నుంచి కొత్త తరహా గాలి పటాలు... వాటి నిర్మాణం వంటి విషయాలు తెలుసుకోవచ్చని అన్నారు.ఈ పోటీల్లో పాల్గొన్న బృందాలు భారీ సైజులో ఉన్న గాలి పటాలు ఉపయోగించాయి. వింత ఆకారాలు.. డిజైనర్ గాలిపటాలు చూసేందుకు అగాఖాన్ అకాడమీ చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తరలి వచ్చారు.