
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని (జూన్ 2) పురస్కరించుకొని నగరంలోని పరేడ్ గ్రౌండ్‌లో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు 2500 మంది పోలీసులతో బందోబస్తు చేస్తున్నట్లు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఆక్టోపస్ బలగాలతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పోలీసులు పరేడ్ గ్రౌండ్‌ను తమ ఆదీనంలోకి తీసుకున్నారు.
ఇప్పటికే పరేడ్ గ్రౌండ్‌ను తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు బాంబ్, డాగ్ స్వ్కాడ్‌లతో ముమ్మర తనిఖీలు చేపట్టారు. అదే విధంగా గురువారం 9 బెటాలియన్లు, ఒక మౌంటెడ్ పోలీస్, రెండు బ్యాండ్ బృందాలతో
కవాతు నిర్వహించారు.
శుక్రవారం ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యక్రమం ఉంటుంది. పాసులు ఉన్నవారిని మాత్రమే పరేడ్ గ్రౌండ్‌లోకి అనుమతించనున్నారు. జనరల్ పబ్లిక్ కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు
చేశారు. నిర్దేశిత ప్రాంతాల్లోనే వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి. జూన్ 2న పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment