సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల పర్వం ముగియడంతో టీఆర్‌ఎస్ ప్రచార జోరు పెంచింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ రోడ్‌షోల షెడ్యూల్ ఖరారైంది. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌రావు ఈ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 22 నుంచి 29 వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కేటీఆర్ ప్రచారం చేస్తారని.. రోడ్‌షోలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. రోడ్‌షోలు ముగిసిన అనంతరం డిసెంబర్ 3న పరేడ్‌గ్రౌండ్‌లో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. మొత్తం 15 నియోజకవర్గాల్లో ఈ రోడ్‌షోలు ఉంటాయని వివరించారు. వీలును బట్టి రోడ్‌షోల సంఖ్య పెరగవచ్చని తెలిపారు. రోజూ మధ్యాహ్నం 3 గంటల దాకా కేటీఆర్‌తో టౌన్ హాల్ మీటింగ్స్ ఉంటాయని, సాయంత్రం 4 గంటల నుం చి రోడ్‌షోలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
రోడ్‌షోల వివరాలు..
ఈ నెల 22న ఉప్పల్, కంటోన్మెంట్, 23న మహేశ్వరం, ఎల్బీనగర్, 24న జూబ్లీహిల్స్, సనత్‌నగర్, 25న విరామం, 26న గోషామహల్, ఖైరతాబాద్, 27న రా జేంద్రనగర్, శేరిలింగంపల్లి, 28న అంబర్‌పేట, ము షీరాబాద్, 29న కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లిలో కేటీఆర్ రోడ్ షోలు ఉంటాయని రామ్మోహన్ తెలిపారు.
సమన్వయ కమిటీ సభ్యులు వీరే..
జీహెచ్‌ఎంసీ పరిధిలో మంత్రి కేటీఆర్ రోడ్‌షోల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు సమన్వయ కమిటీ ఏర్పాటైంది. ఇందులో బొంతు రామ్మోహన్ (జీహెచ్‌ఎంసీ మేయర్), పోచంపల్లి శ్రీనివాసరెడ్డి (రాష్ట్ర కార్యదర్శి), గ్యాదరి బాలమల్లు (ప్రధాన కార్యదర్శి), మారెడ్డి శ్రీనివాసరెడ్డి (ప్రధాన కార్యదర్శి), నేవూరి ధర్మేందర్‌రెడ్డి (రాష్ట్ర యువజన సమన్వకర్త), వై.సతీశ్‌రెడ్డి (యువజన ప్రధాన కార్యదర్శి)లు సభ్యులుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment