బీజేపీ సీనియర్ నేత ముకుల్ రాయ్ (ఫైల్ ఫోటో)
కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్ శనివారం విపక్షాలతో కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన ర్యాలీపై పశ్చిమ బెంగాల్ బీజేపీ రాష్ట్ర శాఖ ఘాటుగా స్పందించింది. ఈ భారీ ర్యాలీకి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై విచారణకు డిమాండ్ చేస్తూ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయనున్నట్టు పేర్కొంది. ఈ మెగా ర్యాలీకి రూ కోట్లలో వెచ్చించారని, అడుగడుగునా కటౌట్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారని, వందలాది వాహనాలు సమకూర్చారని వీటన్నింటికీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే ప్రశ్నకు తృణమూల్ కాంగ్రెస్ బదులివ్వాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ముకుల్ రాయ్ డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంపై విచారణ కోరుతూ తాము ఈసీకి లేఖ రాస్తామని చెప్పారు. ప్రజలు తిరస్కరించిన నేతలతో తృణమూల్ చేతులు కలిపిందని విపక్షాల ర్యాలీని ఆయన ఎద్దేవా చేశారు. ఆ పార్టీలకు బీజేపీని ఎదుర్కొనే సత్తా లేదని వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన మాయావతి ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడటం విడ్డూరమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment