mega rally
-
కాంగ్రెస్ పార్టీకి నా రక్తం ధారపోశా: గులాం నబీ ఆజాద్
సాక్షి, జమ్మూ: కాంగ్రెస్ పార్టీకి తన రక్తం ధారపోస్తే పార్టీ తనను విస్మరించిందని ఆరోపించారు జమ్ముకశ్మీర్ నేత గులాం నబీ ఆజాద్. కాంగ్రెస్‌ను వీడిన తర్వాత తొలిసారి జమ్మూలోని సైనిక్ ఫామ్స్‌లో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న దాదాపు 20,000 మంది మద్దతుదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మా కృషితో కాంగ్రెస్ ఏర్పడిందిగానీ.. ట్వీట్స్, ఎస్ఎంఎస్లతో కాదని ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్ పార్టీని మేము రక్తం ధారపోసి నిర్మించాం. కానీ, కంప్యూటర్లు, ట్విట్టర్ ద్వారా ఏర్పాటు కాలేదు. కొందరు నాపై ఆరోపణలు చేస్తున్నారు. కానీ, వారి పరిధి కంప్యూటర్లు, ట్వీట్లకే పరిమితం. దాంతోనే కాంగ్రెస్ ప్రస్తుతం అట్టడుగు స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్‌కు చెందిన వారు బస్సుల్లో జైలుకు వెళ్తున్నారు. వారు డీజీపీ, కమిషనర్లకు కాల్ చేసి గంటల్లోనే బయటకు వస్తున్నారు. ఆ కారణంగానే కాంగ్రెస్ పుంజుకోలేకపోతోంది.’ అని ఆరోపించారు ఆజాద్. సొంత పార్టీపై క్లారిటీ.. సొంతపార్టీ ఏర్పాటుపై పలు విషయాలు వెల్లడించారు ఆజాద్. తమ పార్టీ జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ, భూమి హక్కులు, స్థానికులకు ఉద్యోగాలు తీసురావడం కోసం పోరాడుతుందని తెలిపారు. ఇప్పటి వరకు పార్టీ పేరును నిర్ణయంచలేదన్నారు. జమ్ముకశ్మీర్ ప్రజలే పార్టీ పేరు, జెండాను నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా పార్టీకి హిందుస్థానీ పేరు పెడతానని తెలిపారు. ఇటీవల గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి జమ్ముకశ్మీర్ కాంగ్రెస్‌లో రాజీనామాలు మొదలయ్యాయి. రాష్ట్ర పార్టీ నేతలు తారా చంద్, అబ్దుల్ మజిద్ వనీ, మనోహర్ లాల్ శర్మ,ఘరు రామ్, బల్వాన్ సింగ్ వంటి ఆజాద్ పక్షాన నిలిచారు. శనివారం పార్టీ నేత అశోక్ శర్మ కూడా తన రాజీనామా పత్రాన్ని సోనియాగాంధీకి పంపారు. ఆయన కూడా గులాం నబీ ఆజాద్ పార్టీలో చేరనున్నారు. #WATCH | J&K: "People from Congress now go to jail in buses, they call DGP, Commissioners, get their name written & leave within an hour. That is the reason Congress has been unable to grow," says Ghulam Nabi Azad at a public meeting in Jammu pic.twitter.com/SVjxTVUeQ4 — ANI (@ANI) September 4, 2022 ఇదీ చదవండి: రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ మెగా ర్యాలీ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై రాహుల్ ఫైర్ -
కాంగ్రెస్ మెగా ర్యాలీ వాయిదా
న్యూఢిల్లీ: దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యకు నిరసనగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ నెల 28వ తేదీన తలపెట్టిన తలపెట్టిన మెగా ర్యాలీ వాయిదా పడింది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో సెప్టెంబర్ 4వ తేదీన ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ గురువారం తెలిపారు. దేశ రాజధానిలో కరోనా మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని మెగా ర్యాలీని వాయిదా వేసినట్లు వెల్లడించారు. వచ్చే నెల 4న నిర్వహించబోయే భారీ ర్యాలీతో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి బలమైన సందేశం పంపిస్తామని అన్నారు. ప్రజా సమస్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ నెల 22న రాష్ట్ర స్థాయిలో, 25న జిల్లా స్థాయిలో, 27న బ్లాక్ స్థాయిలో ర్యాలీలు నిర్వహించాలని కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటికే నిర్ణయించింది. అలాగే సెప్టెంబర్ 7న ప్రారంభమయ్యే భారత్ జోడో యాత్రకు సిద్ధమవుతోంది. కన్యాకుమారి నుంచి జమ్మూకశ్మీర్ దాకా ఆ యాత్ర సాగనుంది. -
2 కోట్లు.. ఓ పెట్రోల్ బంకు
కోల్‌కతా: కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డంపెట్టుకొని తమ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బెదిరిస్తోందని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. తమ పార్టీలో చేరాలని, లేకుంటే కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించి చిట్‌ఫండ్ కుంభకోణంలో జైలుకు పంపిస్తామని టీఎంసీ ప్రజాప్రతినిధులను బీజేపీ భయపెడుతోందని మండిపడ్డారు. ఆదివారం కోల్‌కతాలో అమరవీరుల దినాన్ని పురస్కరించుకొని టీఎంసీ భారీ ర్యాలీ నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలు భారీగా హాజరైన ఈ ర్యాలీలో ఆమె ప్రసంగించారు. కర్ణాటకలో అనుసరిస్తున్న వైఖరినే రాష్ట్రంలోనూ ప్రయోగించాలని బీజేపీ చూస్తోందని ఆమె విమర్శించారు. దీనికోసం తమ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి రూ.2 కోట్లతోపాటు పెట్రోల్ బంక్ ఇస్తామని ప్రలోభపెడుతోందని ఆరోపించారు. తమ పార్టీ గ్రామ నేతలకు రూ.20 లక్షలు ఇస్తామని ఆశ చూపుతోందన్నారు. డబ్బుతో ఎవరినైనా కొనేయగలమనే అహంకారంలో బీజేపీ ఉందని మండిపడ్డారు. ఇలాగైతే మరో రెండేళ్లే.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేసి బీజేపీ గెలిచిందని మమత ఆరోపించారు. ప్రస్తుత తీరుగానే వారి వ్యవహారం ఉంటే మరో రెండేళ్లే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటుందని హెచ్చరించారు. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల నుంచి టీఎంసీ నాయకులు వసూలు సొమ్మును తిరిగిచ్చేయాలని తాను అన్నట్లుగా తన గత ప్రకటనను బీజేపీ వక్రీకరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాల అమలుపై ఓ కన్నేసి ఉంచాలని తమ పార్టీ నాయకులకి తాను చెప్పానని, అయితే తన మాటలని వక్రీకరించి తమ నాయకులను బీజేపీ భయపెడుతోందని మండిపడ్డారు. ముందు బీజేపీ తరలించిన నల్లధనాన్ని వెనక్కి తీసుకురావాలని, అలాగే ఆ పార్టీ నాయకులు ఉజ్వల పథకంలో వసూలు చేసిన సొమ్మును వెనక్కి ఇవ్వాలన్నారు. ఇదే డిమాండ్‌తో 26వ తేదీన నిరసనలు చేపట్టాలని కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. ఉచిత ఎల్పీజీ పేరుతో బీజేపీ నేతలు డబ్బు వసూలు చేయడంపై దర్యాప్తు జరుపుతామన్నారు. 18 లోక్‌సభ స్థానాలు గెలిచి.. మొత్తం రాష్ట్రాన్ని గెలిచేసినట్లుగా బీజేపీ భావిస్తోందని ఎద్దేవా చేశారు. గంటపాటు ర్యాలీలో ఆమె.. ఏ ఒక్క బీజేపీ నాయకుడి పేరు కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం. -
ఛీటింగ్ చేసి ఎన్నికల్లో గెలిచారు: దీదీ
కోల్కత్తా: అధికార దాహంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలను కుట్రపూరితంగా కూల్చివేస్తోందని బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనికి నిదర్శనం కర్ణాటక రాజకీయ సంక్షోభమేనని అన్నారు. బెంగాల్లో కూడా టీఎంసీ నేతలను ప్రలోభాలకు గురిచేస్తూ.. బలవంతగా పార్టీలో చేర్చుకుంటున్నారని దీదీ ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న బెంగాల్లో మత సంఘర్షణ సృష్టించాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్ ప్రజలను ఈవీఎంలతో ఛీటింగ్ చేసి బీజేపీ గెలిచిందని అన్నారు. దేశ వ్యాప్తంగా ఈవీఎంలపై అనేక ఆరోపణలు వస్తున్నాయని, భవిష్యత్తులో జరిగే ఎన్నికలను బ్యాలెట్ పద్దతిన ఎన్నుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ.. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని మమత విమర్శించారు. కాగా ఆదివారం బెంగాల్ రాజధాని కోల్‌కత్తాలో టీఎంసీ భారీ మెగా ర్యాలీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఈ ర్యాలీకి హాజరయ్యారు. కాగా ప్రతి ఏడాది జాలై 21న కోల్‌కత్తాలో టీఎంసీ మెగా ర్యాలీని ఏర్పాటు చేస్తోన్న విషయం తెలిసిందే. -
ఆ ర్యాలీకి నిధులెక్కడివి..?
కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్ శనివారం విపక్షాలతో కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన ర్యాలీపై పశ్చిమ బెంగాల్ బీజేపీ రాష్ట్ర శాఖ ఘాటుగా స్పందించింది. ఈ భారీ ర్యాలీకి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై విచారణకు డిమాండ్ చేస్తూ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయనున్నట్టు పేర్కొంది. ఈ మెగా ర్యాలీకి రూ కోట్లలో వెచ్చించారని, అడుగడుగునా కటౌట్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారని, వందలాది వాహనాలు సమకూర్చారని వీటన్నింటికీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే ప్రశ్నకు తృణమూల్ కాంగ్రెస్ బదులివ్వాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ముకుల్ రాయ్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై విచారణ కోరుతూ తాము ఈసీకి లేఖ రాస్తామని చెప్పారు. ప్రజలు తిరస్కరించిన నేతలతో తృణమూల్ చేతులు కలిపిందని విపక్షాల ర్యాలీని ఆయన ఎద్దేవా చేశారు. ఆ పార్టీలకు బీజేపీని ఎదుర్కొనే సత్తా లేదని వ్యాఖ్యానించారు. బెంగాల్లో ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన మాయావతి ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడటం విడ్డూరమని పేర్కొన్నారు. -
మమతా మహార్యాలీలో చంద్రబాబు కామెడీ
-
నేడే విపక్ష మహా ప్రదర్శన
కోల్‌కతా: రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీఏయేతర పక్షాలను సంఘటితపరచడమే లక్ష్యంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగే విపక్షాల మెగా ర్యాలీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ‘ఐక్య విపక్ష ర్యాలీ’ పేరిట శనివారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి బీజేపీయేతర ప్రాంతీయ, జాతీయ పార్టీలకు ఆహ్వానాలు అందాయి. కొన్ని పార్టీల అధినేతలే స్వయంగా ఈ ర్యాలీకి హాజరవుతోంటే, మరికొన్ని పార్టీలు తమ ప్రతినిధులను పంపుతున్నాయి. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్(ఎస్పీ), స్టాలిన్(డీఎంకే), కుమార స్వామి, దేవెగౌడ(జేడీఎస్), కేజ్రీవాల్(ఆప్) ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా(ఎన్సీ), శరద్‌పవార్(ఎన్సీపీ), చంద్రబాబు(టీడీపీ), తేజస్వి యాదవ్(ఆర్జేడీ), మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్‌శౌరి, బీజేపీ అసంతృప్త నేత శత్రుఘ్న సిన్హా, పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్, దళితనేత జిగ్నేశ్ మేవానిసహా 20 పార్టీల నేతలు హాజరవుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్పర్సన్ సోనియా, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి గైర్హాజరవుతున్నారు. కాంగ్రెస్ తరఫున సీనియర్ నాయకులు ఖర్గే, బీఎస్పీ తరఫున సతీశ్ మిశ్రా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌కు సమదూరం పాటిస్తున్న టీఆర్ఎస్, బిజూ జనతా దళ్(బీజేడీ) నుంచి ఎవరూ హాజరుకావడం లేదు. వామపక్ష పార్టీలు ర్యాలీలో పాల్గొనవద్దని నిర్ణయించుకున్నాయి. కాగా, కోల్‌కతా ర్యాలీని బీజేపీ ఎగతాళి చేసింది. విపక్ష కూటమి తొలుత ప్రధాని అభ్యర్థిని నిర్ణయించుకోవాలని, ఆ తరువాతే ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించడం గురించి ఆలోచించాలని హితవు పలికింది. లక్షలాదిగా వస్తున్న టీఎంసీ కార్యకర్తలు కోల్‌కతా విపక్ష ర్యాలీకి తృణమూల్ కార్యకర్తలు లక్షల్లో తరలివస్తున్నారు. బహిరంగ సభలకు సంబంధించి పాత రికార్డులను బద్దలుకొట్టేందుకు ఆ పార్టీ ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. శుక్రవారం నాటికే రాష్ట్రం నలుమూలల నుంచి రైలు, రోడ్డు, జల మార్గాల ద్వారా సుమారు 5 లక్షల మంది కోల్‌కతాకు చేరుకున్నట్లు తృణమూల్ వర్గాలు తెలిపాయి. తమ ప్రాంతాల నుంచి వస్తున్న కార్యకర్తలకు భోజనం, వసతి ఇతర సౌకర్యాలను పార్టీ నాయకులే ఏర్పాటుచేస్తున్నారు. ర్యాలీకి అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. సభాస్థలిలో మొత్తం ఐదు పెద్ద వేదికలను సిద్ధం చేశారు. 3000 మంది వలంటీర్లను నియమించారు. సభా ప్రాంగణంలో రెండ్రోజుల ముందే ఎల్ఈడీ లైట్లు, బారికేడ్లు, తోరణాలు పెద్ద సంఖ్యలో అమర్చారు. మమతా బెనర్జీ బలం చాటేందుకేనా? లోక్‌సభ ఎన్నికల తరువాత ఢిల్లీ రాజకీయాల్లో మమతా బెనర్జీని తిరుగులేని నాయకురాలిగా చూపేందుకు ఈ ర్యాలీని ఒక వేదికగా ఉపయోగించుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ యోచిస్తోంది. ‘దేశంలోని ప్రముఖ విపక్ష నాయకుల్లో మమతా బెనర్జీ కూడా ఒకరనేది కాదనలేని సత్యం. బీజేపీ వ్యతిరేక పోరులో ఇతర పార్టీలను ఆమె కలుపుకుపోగలరు. కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. ఇక తుది నిర్ణయం తీసుకోవాల్సింది ప్రజలే’ అని తృణమూల్ సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. కేంద్రంలో తదుపరి ప్రభుత్వం ఆమె నేతృత్వంలోనే ఏర్పడాలని ర్యాలీ ప్రచార సమయంలో ఆ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. కోల్‌కతాలో విపక్షాల భారీ ర్యాలీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్దతు ప్రకటిస్తూ మమతా బెనర్జీకి లేఖ రాశారు. ‘విపక్షాల ఐక్యతా ప్రదర్శన ర్యాలీ విషయంలో మమతా దీదీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నా. దీని ద్వారా మనం ఐక్యభారతానికి సంబంధించి గట్టి సందేశం ఇస్తామని ఆశిస్తున్నాను’ అని రాహుల్ పేర్కొన్నారు. -
మమత ర్యాలీకి మద్దతు తెలిపిన రాహుల్
కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం కోల్‌కతాలో నిర్వహించనున్న మెగా ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. ఈ మేరకు మమతా బెనర్జీకి లేఖ రాశారు. ‘దేశంలోని ప్రతిపక్షాలన్ని ఏకమై బలమైన శక్తిగా రూపొందుతున్నాయి. మోదీ ప్రభుత్వం చేసిన మోసపూరితమైన వాగ్దానాలు, అసత్యాల వల్ల జనాలు కోపం, నిరాశలో మునిగిపోయి ఉన్నారు. ప్రసుత్త భారతదేశం రేపటి గురించి ఆందోళన చెందుతుంద’ని లేఖలో పేర్కొన్నారు. ఈ బలాలన్ని(ప్రతిపక్షాలు) రేపటి గురించి ఆశను రేకేత్తిస్తున్నాయన్నారు. కులం, మతం, ప్రాంతం, ఆర్థిక హోదాలతో సంబంధం లేకుండా దేశంలోని ప్రతి ఆడ, మగ, పిల్లలు, పెద్దలు అందరిని వీరు గౌరవిస్తారని తెలిపారు. బీజేపీ, మోదీ కలిసి ప్రజాస్వామ్యాన్ని, సామాజిక న్యాయాన్ని, లౌకికవాద సిద్ధాంతాలను నాశనం చేశారు. వాటి పరిరక్షణ కోసం ప్రతిపక్షాలన్ని ఏకమవుతున్నాయని పేర్కొన్నారు. అయితే ఈ ర్యాలీకి రాహుల్ గాంధీ హాజరుకావడం లేదని.. పార్టీ తరఫున అభిషేక్ మను సింఘ్వీని, మల్లికార్జున్ ఖర్గే వెళ్తారని తెలిసింది. -
మమత ర్యాలీలో పాల్గొంటా: శతృఘ్న సిన్హా
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం కోల్‌కతాలో నిర్వహించనున్న మెగా ర్యాలీలో పాల్గొననున్నట్లు నటుడు, బీజేపీ ఎంపీ శతృఘ్న సిన్హా తెలిపారు. బీజేపీలో తనకు గౌరవం దక్కడం లేదన్న ఆయన, ‘రాష్ట్ర మంచ్’ సంస్థ తరఫున ఆ ర్యాలీకి హాజరవుతానన్నారు. కొందరు బీజేపీ నేతలు ఆర్ఎస్ఎస్ సమావేశాలకు హాజరవుతుండగా లేనిది తాను టీఎంసీ ర్యాలీకి వెళ్ల కూడదా అంటూ సిన్హా సమర్ధించుకున్నారు. బీజేపీ పట్ల తన నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరన్నారు. మమతా బెనర్జీని కీలక జాతీయ స్థాయి నేతగా ఆయన పేర్కొన్నారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు హెచ్డీ దేవెగౌడ, మల్లికార్జున ఖర్గే, కేజ్రీవాల్, అఖిలేశ్ యాదవ్, తేజస్వీ యాదవ్ తదితరులు పాల్గొంటున్న ఆ ర్యాలీలో శతృఘ్న సిన్హా ‘స్టార్ స్పీకర్’గా మారనున్నట్లు సమాచారం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను బాహాటంగానే గత కొంతకాలంగా తప్పుబడుతున్న శతృఘ్న సిన్హా బీజేపీకి చెందిన మరో సీనియర్ నేత యశ్వంత్ సిన్హా ఏర్పాటు చేసిన ‘రాష్ట్ర మంచ్’లో చేరారు. దీంతో ప్రభుత్వం ఆయనకు సెక్యూరిటీ సహా పలు సౌకర్యాలను ఉపసంహరించింది. -
కేసీఆర్‌కు లక్ష మందితో స్వాగతం: సారయ్య
యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని రాష్ట్ర మంత్రి బస్వరాజ్ సారయ్య అన్నారు. న్యూఢిల్లీ పర్యటన ముగించుకుని శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న బస్వరాజు సారయ్యకు తెలంగాణ వాదులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సారయ్య మాట్లాడుతూ... 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేసినందుకు తమ ప్రాంత ప్రజలు ఎల్లవేళలా సోనియాకు రుణపడి ఉంటారని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంతో తిరిగి వస్తానని ప్రతిజ్ఞ చేసిన కేసీఆర్ అన్న మాట నిలబెట్టుకున్నారని సారయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు. న్యూఢిల్లీ నుంచి కేసీఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోగానే లక్ష మంది ప్రజలతో స్వాగతం పలుకుతామని సారయ్య వెల్లడించారు. అందుకు సన్నాహక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. శనివారం తెలంగాణ వాదులతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కిక్కిరిసి పోయింది. అలాగే జై తెలంగాణ నినాదాలతో మారుమ్రోగింది.