కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం కోల్‌కతాలో నిర్వహించనున్న మెగా ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. ఈ మేరకు మమతా బెనర్జీకి లేఖ రాశారు. ‘దేశంలోని ప్రతిపక్షాలన్ని ఏకమై బలమైన శక్తిగా రూపొందుతున్నాయి. మోదీ ప్రభుత్వం చేసిన మోసపూరితమైన వాగ్దానాలు, అసత్యాల వల్ల జనాలు కోపం, నిరాశలో మునిగిపోయి ఉన్నారు. ప్రసుత్త భారతదేశం రేపటి గురించి ఆందోళన చెందుతుంద’ని లేఖలో పేర్కొన్నారు.
ఈ బలాలన్ని(ప్రతిపక్షాలు) రేపటి గురించి ఆశను రేకేత్తిస్తున్నాయన్నారు. కులం, మతం, ప్రాంతం, ఆర్థిక హోదాలతో సంబంధం లేకుండా దేశంలోని ప్రతి ఆడ, మగ, పిల్లలు, పెద్దలు అందరిని వీరు గౌరవిస్తారని తెలిపారు. బీజేపీ, మోదీ కలిసి ప్రజాస్వామ్యాన్ని, సామాజిక న్యాయాన్ని, లౌకికవాద సిద్ధాంతాలను నాశనం చేశారు. వాటి పరిరక్షణ కోసం ప్రతిపక్షాలన్ని ఏకమవుతున్నాయని పేర్కొన్నారు. అయితే ఈ ర్యాలీకి రాహుల్ గాంధీ హాజరుకావడం లేదని.. పార్టీ తరఫున అభిషేక్ మను సింఘ్వీని, మల్లికార్జున్ ఖర్గే వెళ్తారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment