కేసీఆర్కు లక్ష మందితో స్వాగతం: సారయ్య | A mega rally of one lakh people will welcome kcr, says Baswaraju Saraiah | Sakshi
Sakshi News home page

కేసీఆర్కు లక్ష మందితో స్వాగతం: సారయ్య

Published Sat, Feb 22 2014 10:00 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 AM

కేసీఆర్కు లక్ష మందితో స్వాగతం: సారయ్య

కేసీఆర్కు లక్ష మందితో స్వాగతం: సారయ్య

యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని రాష్ట్ర మంత్రి బస్వరాజ్ సారయ్య అన్నారు. న్యూఢిల్లీ పర్యటన ముగించుకుని శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న బస్వరాజు సారయ్యకు తెలంగాణ వాదులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సారయ్య మాట్లాడుతూ... 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేసినందుకు తమ ప్రాంత ప్రజలు ఎల్లవేళలా  సోనియాకు రుణపడి ఉంటారని అన్నారు.

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంతో తిరిగి వస్తానని ప్రతిజ్ఞ చేసిన కేసీఆర్ అన్న మాట నిలబెట్టుకున్నారని సారయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు. న్యూఢిల్లీ నుంచి కేసీఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు  చేరుకోగానే లక్ష మంది ప్రజలతో స్వాగతం పలుకుతామని సారయ్య వెల్లడించారు. అందుకు సన్నాహక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. శనివారం తెలంగాణ వాదులతో శంషాబాద్  ఎయిర్ పోర్ట్ కిక్కిరిసి పోయింది. అలాగే జై తెలంగాణ నినాదాలతో మారుమ్రోగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement