కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం కోల్‌కతాలో నిర్వహించనున్న మెగా ర్యాలీలో పాల్గొననున్నట్లు నటుడు, బీజేపీ ఎంపీ శతృఘ్న సిన్హా తెలిపారు. బీజేపీలో తనకు గౌరవం దక్కడం లేదన్న ఆయన, ‘రాష్ట్ర మంచ్’ సంస్థ తరఫున ఆ ర్యాలీకి హాజరవుతానన్నారు. కొందరు బీజేపీ నేతలు ఆర్‌ఎస్‌ఎస్ సమావేశాలకు హాజరవుతుండగా లేనిది తాను టీఎంసీ ర్యాలీకి వెళ్ల కూడదా అంటూ సిన్హా సమర్ధించుకున్నారు.
బీజేపీ పట్ల తన నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరన్నారు. మమతా బెనర్జీని కీలక జాతీయ స్థాయి నేతగా ఆయన పేర్కొన్నారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు హెచ్‌డీ దేవెగౌడ, మల్లికార్జున ఖర్గే, కేజ్రీవాల్, అఖిలేశ్ యాదవ్, తేజస్వీ యాదవ్ తదితరులు పాల్గొంటున్న ఆ ర్యాలీలో శతృఘ్న సిన్హా ‘స్టార్ స్పీకర్’గా మారనున్నట్లు సమాచారం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను బాహాటంగానే గత కొంతకాలంగా తప్పుబడుతున్న శతృఘ్న సిన్హా బీజేపీకి చెందిన మరో సీనియర్ నేత యశ్వంత్ సిన్హా ఏర్పాటు చేసిన ‘రాష్ట్ర మంచ్’లో చేరారు. దీంతో ప్రభుత్వం ఆయనకు సెక్యూరిటీ సహా పలు సౌకర్యాలను ఉపసంహరించింది.
Comments
Please login to add a commentAdd a comment