సాక్షి, హైదరాబాద్: వెయ్యి రకాలకుపైగా మిఠాయిలు.. అద్భుతమైన వినోదాన్ని పంచే పతంగులు.. కళ్లు తిçప్పనివ్వని సాంస్కృతిక ప్రదర్శనలు.. ఇవన్నీ ఒకేచోట ఏర్పాటైతే.. ఆ సందడే వేరు. సంక్రాంతి సందర్భంగా భాగ్య నగరంలో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. నేటి(శనివారం) నుంచి ఈ నెల 15 వరకు అంటే మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు ఒకేచోట కనువించు చేయను న్నాయి.
స్వీట్, కైట్ ఫెస్టివల్స్‌తో పాటు సాంస్కృతిక ఉత్సవం నగరం నడిబొడ్డున ఉన్న పరేడ్ గ్రౌండ్ వేదికగా నగరవాసులను అలరించనున్నాయి. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ ఎస్.మధుసూదనాచారి ఈ వేడుకలను ప్రారంభించనున్నారు. స్వీట్ ఫెస్టి వల్ చైర్మన్ బుర్రా వెంకటేశం, వైస్ చైర్మన్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొంటారు.
మిఠాయిల పండుగ
అంతర్జాతీయ మిఠాయిల పండుగకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ ఫెస్టివల్‌లో నగరంలో స్థిరపడ్డ 15 దేశాలు, 25 రాష్ట్రాల వారు పాల్గొననున్నారు. వారి సంప్రదాయ స్వీట్లను ఫెస్టివల్‌లో ఉంచి విక్ర యిస్తారు. శనివారం మధ్యాహ్నం 3 గంట లకు స్వీట్ ఫెస్టివల్ ప్రారంభమై.. మూడు రోజులపాటు జరుగుతుంది. ఇందులో తెలంగాణ నుంచి 20, ఏపీ నుంచి 20 రకాల స్వీట్లతో పాటు పలు దేశాలు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 1,000 రకాల మిఠాయిలను ప్రదర్శనలో ఉంచనున్నారు.
కైట్ ఫెస్టివల్
రాష్ట్ర ప్రభుత్వం 2015 నుంచి అంతర్జాతీయ పతంగుల ఉత్సవం నిర్వహిస్తోంది. ఏటా అగాఖాన్ అకాడమీలో దీనిని నిర్వహించే వారు. కానీ తొలిసారిగా ప్రజల్ని భాగస్వాము లను చేయాలని పరేడ్ గ్రౌండ్‌లో ఈ ఫెస్టి వల్‌ను ఏర్పాటు చేశారు. సింగపూర్, మలేసియా, జర్మనీ తదితర 14 దేశాలు, గుజరాత్, కేరâý తదితర రాష్ట్రాలకు చెందిన ఔత్సాహికులు ఇందులో పాల్గోనున్నారు. నైట్ కైట్ ఫెస్టివల్ ఈసారి ప్రత్యేక ఆకర్షణ.
సాంస్కృతిక ఉత్సవం
సాంస్కృతిక ఉత్సవంలో 15 అంతర్జాతీయ, భారతీయ కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం 6 గంటలకు పరేడ్ గ్రౌండ్‌లో ఇది ప్రారం భమవుతుంది. ఒగ్గుడోలు, పేర్ని, కథక్, కూచిపూడి, పులివేషాలు తదితర ప్రదర్శనలు ఉంటాయి. దీనిలో భాగంగానే ఫుడ్ ఫెస్టివల్‌ను సైతం ఏర్పాటు చేశారు. హైదరాబాదీ స్పెషల్ బిర్యానీతో పాటు వివిధ రకాల తెలంగాణ వంటకాలు నోరూరించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment