Kites Festival
-
సికింద్రాబాద్‌లో పతంగుల సందడి.. కైట్స్ ఎగరేసిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ (ఫోటోలు)
-
సంక్రాంతికి పతంగులు ఎందుకు ఎగురవేస్తారో తెలుసా?
సంక్రాంతి సంబరం అంటే చుట్టాలు పక్కాలు, అరిసెలు, స్వీట్లు, భోగి పళ్లు, గంగిరెద్దులు, గొబ్బెమ్మల ముచ్చటే కాదు. వీటన్నింటికి మించి మరో పండుగ కూడా ఉంది. అసలు సంక్రాంతి అంటేనే చాలా ప్రదేశాల్లో పతంగుల పండుగ. , రెండు నెలల ముందు నుంచి పిల్లలు, పెద్దలు గాలి పటాలను ఎగుర వేస్తారు. ఎవరికి నచ్చిన సైజులు, ఆకారాల్లో రకరకాల గాలి పటాలను ఎగురవేస్తూ ఆనందంలో మునిగి తేలతారు. ఆకాశంలో ఎటు చూసినా పట్ట పగలే నక్షత్రాలొచ్చాయా అన్నట్టు గాలిపటాలు దర్శనిమిస్తాయి. తెలంగాణా, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పతంగులు గురవేయడాన్ని పండగలా నిర్వహిస్తారు సంక్రాంతికి గాలి పటాలు ఎందుకు ఎగురవేస్తారు..? చరిత్ర ఏమిటి..? ఎక్కడి నుంచి మొదలైంది? తొలి రోజుల్లో వీటిని ఆత్మరక్షణకు, సమాచారాన్ని పంపించడం కోసం ఉపయోగించేవారట. దాదాపు 2 వేల సంవత్సరాల కిందట చైనాలో వీటిని తయారు చేశారట. సిగ్నలింగ్, మిలటరీ ఆపరేషన్స్‌లోనూ వీటిని వినియోగించారు. చైనాలో హేన్ వంశపు రాజుల చరిత్ర ప్రారంభం కావటానికి గాలిపటమే దోహదం చేసిందని పరిశోధకులు చెబుతారు. మకర సంక్రాంతికి శీతాకాలం ముగిసి వసంత రుతువు ప్రారంభానికి సూచికగా చూస్తారు గాలిపటాలను పగటిపూట ఎగరవేయడంలో ఒక ఆరోగ్యపరమైన కారణం కూడా ఉంది. పతంగులు ఎగురవేయడం అనేది దేవుళ్లకు కృతజ్ఞతలు చెప్పడానికి ఒక మార్గం అని కొందరు విశ్వసిస్తారు. గాలిపటాలు ఎగరేసేటపుడు ఎక్కువ సమయం మన బాడీ సన్లెటై్కి ఎక్స్పోజ్ అవుతుంది. అంతేకాదు లేలేత సూర్యకిరణాల్లో విటమిన్ డి లభిస్తుంది. సూర్యుడి లేతకిరణాలు చర్మంపై పడితే చర్మ సమస్యలు, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. అలాగే చలిగాలుల వల్ల కలిగే అనేక అంటువ్యాధులు, అనారోగ్యాలతో పోరాడేందుకు ఎంతో సహాయ పడుతుంది.ఆకాశంలో ఎగిరే గాలిపటాలను చూడటం కంటిచూపును మెరుగు పరుస్తుందని చైనీయుల విశ్వాసం. తల పైకి ఎత్తి చూసేటపుడు నోరు కొద్దిగా తెరచు కుంటుందని, అది శరీరానికి శక్తిని ఇస్తుందని కూడా వారు నమ్ముతారు. మొదట్లో వీటిని ఆత్మరక్షణకు, సమాచారాన్ని పంపించడం కోసం ఉపయోగించేవారట. ఆ తర్వాత సిగ్నలింగ్, మిలటరీ ఆపరేషన్స్‌లోనూ వీటిని వినియోగించారు. ఒకప్పటి గాలిపటాలు మందంగా, దీర్ఘచతురస్రాకారంలో ఉండేవి. క్రీస్తుపూర్వం 206లో చైనాలో హేన్ వంశపు రాజుల చరిత్ర ప్రారంభం కావటానికి గాలిపటమే దోహదం చేసిందని పరిశోధకులు చెబుతారు. దుర్మార్గుడైన రాజును ఓడించేందుకు వచ్చిన ఆలోచనే తొలి గాలిపటం. ఇందులో భాగంగా కోటలోకి సొరంగాన్ని తవ్వాలనేది హేన్ చక్రవర్తి ప్లాన్. అలా ఒక పతంగ్‌ను తయారు చేసి దానికి దారం కట్టి ఎగరవేశాడు. ఆ దారం ఆధారంగానే, సొరంగం తవ్వి సైనికులను పంపి కోటను వశం చేసుకున్నాడని చెబుతారు. ఈ నియమాలు తెలుసా? పతంగులు ఎగురవేసేటపుడు కొన్ని నిబంధనలు కూడా పాటించాలి. ఇది ఆయా దేశాలని బట్టి ఉంటాయి. థాయ్‌లాండ్‌లో పతంగులు ఎగురవేయాలంటే 78 రకాల నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. బెర్లిన్ గోడపై నుంచి అవతలికి వెళ్ళే అవకాశం ఉండడంతో భారీ గాలిపటాలను ఎగురవేయడంపై తూర్పు జర్మనీలో నిషేధం విధించారు. జపాన్‌లో కొన్ని గాలిపటాల బరువు కొన్ని కిలోల వరకు ఉంటుందట. -
పండుగొచ్చె.. భాగ్యనగరంలో పతంగుల సందడి
-
గాలికి గాలం వేస్తూ.. ఆకాశానికి రంగులు అద్దుతూ..
సంక్రాంతి వచ్చిందంటే చాలు.. పతంగుల హడావుడి మొదలైపోతుంది. తలెత్తి పైకి చూస్తే చాలు.. ఆకాశం రంగులు అద్దుకుందా అన్నట్టుగా మెరిసిపోతుంది. చిన్నా పెద్దా తేడా లేదు.. గల్లీల్లో, ఇళ్లపై, మైదానాల్లో ఎక్కడ చూసినా గాలిపటాలు ఎగరేస్తూనే కనిపిస్తారు. ఇలా మన దగ్గరే కాదు..ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల ‘పతంగుల పండుగ’లు జరుగుతూనే ఉంటాయి. కొన్ని దేశాల్లో వారి సాంప్రదాయాలకు, ప్రత్యేక సందర్భాలకు అనుగుణంగా.. మరికొన్ని దేశాల్లో సరదాగా గాలిపటాలు ఎగరేస్తుంటారు. మరి పతంగుల ప్రత్యేకతలు, ఆ పండుగల విశేషాలు తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ ధనికుల ఆట నుంచి..పిల్లల చేతిలోకి.. ఇప్పుడంటే చిన్న పిల్లలు కూడా గాలిపటాలు, దారాలు కొనుక్కుని ఎగరేస్తున్నారుగానీ.. ఒకప్పుడు పతంగులు అంటే రాజులు, బాగా డబ్బున్నవారి ఆట అని చరిత్రకారులు చెప్తున్నారు. తర్వాత మెల్లగా సాధారణ ప్రజలకు కూడా చేరిందని అంటున్నారు. గాలిపటాలు ఎగరేయడమన్నది మొదట చైనాలో మొదలైంది. సుమారు వెయ్యేళ్ల కింద కొరియా మీదుగా భారత్‌కు, ఇతర దేశాలకు విస్తరించింది. పురాతత్వ ఆధారాల ప్రకారం.. చైనాకు చెందిన బౌద్ధ భిక్షువులు పట్టువస్త్రాలు, వెదురుపుల్లలతో తయారు చేసిన గాలిపటాలు ఎగురవేసేవారు. దైవాన్ని ప్రార్థిస్తూ వాటిలో సందేశాలు పెట్టేవారు. ఇక మన దేశంలో 500 ఏళ్ల కింద మొఘల్ పాలన సమయంలోనే పతంగులు ఎగరేసినట్టుగా పెయింటింగ్‌లు ఉన్నాయి. ‘కై పో చే’ గాలిపటాలు ఎగరేయడమే కాదు.. మన గాలిపటంతో అవతలివారి గాలిపటాలను తెంపేయడమూ ఈ ఆటలో భాగమే. అలా మనకు దగ్గరిలోని ఒక్కో గాలిపటాన్ని తెంపేస్తూ.. ఆ విజయ సంకేతంగా వెంటనే గట్టిగా కేకలు వేస్తుంటారు. గుజరాత్ ‘ఉత్తరాయణ్’ ఫెస్టివల్లో ఇలా వేరేవారి గాలిపటాలను తెంపేయగానే ‘కై పో చే (నేను తెంపేశానోచ్)’ అని బిగ్గరగా అరవడం అనేది పాపులర్. ఏయే దేశాల్లో ఎలా? ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో వేర్వేరు సందర్భాల్లో గాలిపటాలను ఎగురవేస్తారు. మనదేశంతోపాటు చైనా, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, ఇండోనేíసియా, వియత్నాంలో సాంప్రదాయంగా, పండుగల సమయంలో ప్రత్యేక ఆటగా భావిస్తారు. జపాన్‌లో మేలో జరిగే పిల్లల పండుగలో.. బ్రెజిల్, కొలంబియాల్లో కొత్త సంవత్సర సెలవుల్లో.. చిలీలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. గయానాలో ఈస్టర్ సమయంలో పతంగులను ఎగురవేస్తారు. ►గాలిపటాలకు జన్మస్థానంగా భావించే చైనాలో జరిగే పతంగుల పండుగ ‘వీఫాంగ్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్’. ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. ఇక్కడ గాలిపటం ఏదైనా సరే.. చైనా ఆధ్యాత్మిక చిహ్నమైన డ్రాగన్గానీ, దాని ఆనవాళ్లుగానీ తప్పనిసరిగా ఉంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద గాలిపటాల మ్యూజియం వీఫాంగ్లోనే ఉంది. ►ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న బొండి బీచ్‌లో ‘ఫెస్టివల్ ఆఫ్ ది విండ్స్’ పేరిట గాలిపటాల పండుగ నిర్వహిస్తారు. అక్కడ వేసవికాలం ప్రారంభానికి సూచికగా ఏటా సెప్టెంబర్‌లో ఈ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ప్రపంచంలోని పెద్ద పతంగుల పండుగల్లో ఇది ఒకటి. ►‘బ్లాసమ్ కైట్ ఫెస్టివల్’ పేరిట అమెరికాలోని వాషింగ్టన్ లాంగ్ బీచ్‌లో అతిపెద్ద కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. 55 ఏళ్లుగా ఏటా ఏప్రిల్ చివరిలో నిర్వహిస్తున్న ఈ పతంగుల పండుగకు.. ప్రతిసారీ ఒక థీమ్‌ను ఎన్నుకుంటారు. ►అత్యంత చిత్రమైన ఆకారాలు, డిజైన్లతో పతంగులు ఎగరేసే పండుగ ఫ్రాన్స్‌లోని ‘డిప్పె కైట్ ఫెస్టివల్’. డిప్పే పట్టణంలో సముద్రతీరాన రెండేళ్లకోసారి ఈ ఫెస్టివల్ జరుగుతుంది. ►జపాన్‌లో సంప్రదాయంగా జరిగే పతంగుల పండుగ ‘హమమట్సు కైట్ ఫెస్టివల్’. 16వ శతాబ్దం నుంచి జరుగుతున్న ఈ ఫెస్టివల్లో ఎగరేసే పతంగులన్నీ చతురస్రాకారంలోనే ఉంటాయి. వేరే ఆకారాలను ఎగరవేయరు. ►వీటితోపాటు బ్రిటన్‌లో పోర్ట్స్మౌత్ ఫెస్టివల్, దక్షిణాఫ్రికాలో కేప్‌టౌన్ ఫెస్టివల్, ఇటలీలో సెర్వియా ఫెస్టివల్ వంటివి కూడా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందాయి. గుజరాత్లో ‘ఉత్తరాయణ్’గా.. మన దేశంలో హైదరాబాద్ సహా చాలాచోట్ల పతంగుల పండుగలు జరుగుతాయి. ముఖ్యంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 1989 నుంచి జరుగుతున్న ‘ఉత్తరాయణ్–ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టి వల్’ దేశంలోనే పెద్దది. సంక్రాంతి సమయంలో జరిగే ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా 40కిపైగా దేశాల నుంచి గాలిపటాలు ఎగరేసే వారు, పర్యాటకులు వస్తుంటారు. మొత్తంగా ఇరవై లక్షల మంది వరకు ఈ ఫెస్టివల్‌కు హాజరవుతారని అంచనా. ►గ్వాటెమాలాలో ఏటా నవంబర్‌లో జరిగే ‘బారిలెట్ ఫెస్టివల్’ చాలా విశిష్టమైనది. గుండ్రంగా ఉండే ప్రత్యేకమైన పతంగులు, వాటికి పెట్టే తోకలపై.. స్థానికులు తమ సందేశాలను రాసి ఎగురవేస్తారు. చనిపోయిన తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆ పతంగులపై సందేశాలను చదువుకుంటారని భావిస్తారు. మాయన్ నాగరికత కాలం నుంచీ ఈ సాంప్రదాయం ఉందని చెప్తారు. ►మనకు జీవితాన్నిచ్చిన దేవతలకు కృతజ్ఞతలు చెప్తూ పతంగులు ఎగరేసే సాంప్రదాయం ఇండోనేíసియాలో ఉంది. అక్కడి బాలి ద్వీపంలోని సనూర్ బీచ్‌లో ఏటా జూలైలో ‘బాలి కైట్ ఫెస్టివల్’ జరుగుతుంది. బాలి ప్రాంతంలో హిందూ జనాభా ఎక్కువ. దాంతో అక్కడ ఎగరేసే గాలిపటాల్లో హిందూ దేవతల చిత్రాలు కనిపిస్తుంటాయి. -
కైట్స్ ఎగిరే
-
కైట్స్ ఎగిరే.. స్వీట్స్ అదిరే!
సాక్షి, సిటీబ్యూరో: కైట్, స్వీట్ ఫెస్టివల్‌తో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ జనసందోహంగా మారింది. ఆనందాల పతంగులు అంబరంలో విహరించాయి. మిఠాయిల రుచుల సంగమం నోరూరించాయి. టూరిజం, సాంస్కృతిక శాఖలు ఒకరోజు ముందే నగరానికి సంక్రాంతి శోభను తీసుకువచ్చాయి. సందర్శకుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఆదివారంఅంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌ను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. విభిన్న ఆకారాల గాలిపటాలు, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన స్వీట్లు అదరహో అనిపించాయి. వేడుకల్లో 20 దేశాల నుంచి 42 మంది కైట్ ఫ్లైయర్స్, 60 దేశవాళీ కైట్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. థాయ్‌లాండ్, సింగపూర్, సౌత్‌కొరియా, ఇండోనేషియా, చైనా, ఫ్రాన్స్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, టర్కీ తదితర దేశాల నుంచి వచ్చిన ఔత్సాహికులు పతంగులతో సందడిచేశారు. స్వీట్ ఫెస్టివల్లో భాగంగా 22 విదేశాలు, దేశంలోని 25 రాష్ట్రాలకు చెందిన 1,200 రకాల స్వీట్లు కొలువుదీరాయి. ఈ నెల 15 వరకు ఫెస్టివల్ కొనసాగనుంది. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. పక్షులకు ప్రాణాంతకం కావొద్దు అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్లో పక్షి ప్రేమికుడు సత్తి రామచంద్రారెడ్డి ఓ స్టాల్ ఏర్పాటు చేశారు. పతంగులకు మాంజా వాడకూడదని, కాటన్ దారాలను ఉపయోగించాలని అవగాహన కల్పించారు. పట్టణ ప్రాంతాల్లో ఉండే చిన్న పక్షులు కనుమరుగు కాకుండా వాటికి గూళ్లు ఏర్పాటు చేయడం, తాగునీరు అందించాలని, బాల్కనీ లేదా టెర్రస్‌పై దాణా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. తియ్యని వేడుక సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రారంభమైన స్వీట్ ఫెస్టివల్లో తెలుగురుచులతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల స్వీట్లు రుచి చూడవచ్చు. అవీ సరిపోలేదనుకుంటే అంతర్జాతీయ రుచులను ఆస్వాదించవచ్చు. అర్జెంటీనా, నేపాల్, అఫ్గానిస్థాన్, సోమాలియా, కొరియా, ఇటలీ, శ్రీలంక, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ ఇలా 22 దేశాల స్వీట్లతో పాటు అసోం, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, బెంగాలీ ఇలా 25 రాష్ట్రాల తీపి వంటలూ ఇక్కడకొలువుదీరాయి. నేపాల్.. రాధిక, ఐశ్వర్య, జెమిశ్, సునీల్, రమేశ్, సంత్ బహదూర్ మేమంతా నేపాల్ నుంచి వచ్చాం. ఇక్కడే చాలా ఏళ్లుగా ఉంటున్నాం. ఈ ఫెస్టివల్లో నేపాల్‌లో బాగా పాపులరైన సిల్కోట్, గోర్కలీ చట్నీని మా స్టాల్లో అందిస్తున్నాం. అసోం.. మేం అసోంలోని గువాహటి నుంచి వచ్చాం. చందన, సరపర్ణ, మొనాలిసా, పాపోరి నలుగురం కలిసి మా ప్రాంతంలో చేసే నల్లబియ్యం, తెల్లబియ్యం పాయసం చేశాం. ఇక్కడ ఇలా తొలిసారి అస్సాం వంటలు అందరితో పంచుకోవటం మాకు పండగలా ఉంది. బెంగళూరు.. మేం గృహిణులం. బెంగుళూరు నుంచి ఈ ఫెస్టివల్లో పాల్గొనడానికి వచ్చాం. బియ్యం పిండితో చేసిన రోజ్ ఫ్లవర్స్ చూడటానికి అలంకరణ కోసం తెచ్చుకునే పూలలా ఉన్నా వీటిని బియ్యం పిండితో తయారు చేశాం. 7 కప్ కేక్స్ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. -
సింథటిక్, నైలాన్ మాంజాలపై నిషేధం అమలు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులు ఎగురవేసినపుడు తెగిపోకుండా ఉండేందుకు నిషేధిత సింథటిక్, నైలాన్ మాంజాలను ఉపయోగించకుండా కఠినచర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, పర్యాటక, సాంస్కృతికశాఖ డైరెక్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. నైలాన్, సింథటిక్ మాంజా తయారీ, అమ్మకం, నిల్వ చేయడం, కొనడం, ఉపయోగించడాన్ని 2016 డిసెంబర్లోనే రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2018 డిసెంబర్ 17న జారీచేసిన ఉత్తర్వులను తప్పకుండా పాటించాలని సూచించింది. ఇనుప, గాజు రజను వంటివి లేకుండా తయారు చేసిన దారాన్ని ఉపయోగించేలా చూడాలని తెలిపింది. పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఐదేళ్ల వరకు జైలుశిక్ష,లక్ష రుపాయల వరకు జరిమానా లేదా రెండింటిని విధించవచ్చని వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అజయ్ మిశ్రా శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. -
డేంజర్ మాంజా
సాక్షి,సిటీబ్యూరో: సంక్రాంతి అంటే నగరంలో పతంగులే గుర్తుకు వస్తాయి. ఈ పండగకు వారంరోజుల ముందు నుంచే చిన్నా, పెద్దా అన్న తారతమ్యం లేకుండా గాలిపటాలను ఎగరవేసేందుకు ఆసక్తి చూపిస్తారు. గతంలో ఈ పతంగులను ఎగరేసేందుకు కాటన్ మాంజాను వాడేవారు. పోటీ పెరగడంతో మాంజా దారానికి గాజు పిండి, సాబుదానా(సగ్గుబియ్యం), గంధకం, రంగులు వేసి మాంజాను తయారు చేసేవారు. కానీ ప్రస్తుతం మార్కెట్లో ప్రమాదకరమైన‘చైనా మాంజా’ రాజ్యమేలుతోంది. రసాయనాలు పూసిన ఈ మాంజాతో పక్షులు, మనుషులకు కూడా ముప్పు వాటిల్లుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం 2017, జూలై 11న నిషేధం విధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం అమ్మినా, కొనుగోలు చేసినా నేరమే. చైనా మాంజాను అమ్మితే ఏడేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తారు. రెండేళ్ల క్రితం నిషేధ చట్టం చేసినా ఇప్పటికీ నగర మార్కెట్లో చైనా మాంజా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గురువారం ‘సాక్షి’ ప్రతినిధి పలు మార్కెట్లలో చైనా మాంజా నిషేధం అమలుపై ఆరా తీయగా అమలు చేయడం లేదని తేలింది. విచ్చలవిడిగా అమ్మకాలు.. నగరంలోని పంజేషా, ధూల్‌పేట్‌తో పాటు పంగతులు అమ్మే వివిధ ప్రాంతాల్లో చైనా మంజా విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. సాక్షి ప్రతినిధి చైనా మాంజా ఖరీదు చేయడానికి ప్రయత్నించగా చైనా మాంజా నిషేధించారని, తమ వద్ద లేదని వ్యాపారులు చెప్పారు. తర్వాత వారే డబ్బులు ఎక్కువగా చెల్లిస్తే గోదాం తెచ్చి ఇస్తామన్నారు. గీటీకి రూ.150 అవుతుందన్నారు. బేరం కుదరగానే రహస్యంగా పేపర్లో చుట్టి మంజా ఇచ్చారు. హెచ్చరికలు బేఖాతరు.. గతంలో చైనా మాంజా ముంబైతో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి నగరానికి దిగుమతి అయ్యేది. రెండేళ్ల నుంచి ప్రభుత్వ నిషేధంతో దీన్ని దిగుమతికి వ్యాపారులు జంకుతున్నా రహస్యంగా తెచ్చి విక్రయిస్తున్నారు. చైనా మాంజా విక్రయం లాభసాటిగా ఉండడంతో పాటు బలంగా ఉంటుందన్న అభిప్రాయంతో చిన్నారులు నైలాన్ దారంతోనే పతంగులు ఎగురవేయడానికి ఇష్టపడుతున్నారు. చైనా మాంజాపై నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలని, పక్షుల ప్రాణాలను కాపాడాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. పక్షులకు గాయాలు పతంగులను ఎగురవేసే సమయంలో ఎదుటివారి గాలిపటాన్ని నేలకూల్చడానికి (కైంచీ) చైనా మాంజాను వినియోగిస్తున్నారు. ఈ మాంజా తంగూŠస(ప్లాస్టిక్ దారం)కు గాజుపొడి అద్ది తయారు చేస్తారు. అయితే, ఈ మాంజా వల్ల గాలిపటం ఎగురవేసే వారికి, పక్కనున్న వారి చేతులకూ గాయాలవుతున్నాయి. పతంగులు ఎగురవేస్తున్న సమయంలో చెట్లకు, విద్యుత్ స్తంబాలకు పతంగులతో పాటు చైనా మాంజా చిక్కుకోవడంతో మాంజాకు తగిలే పక్షులు, జంతువులు కూడా మృత్యువాత పడుతున్నాయి. స్థానికంగా తయారు చేసినా.. కొన్నేళ్ల క్రితం కైట్స్ ఫెస్టివల్ సందర్భంగా చైనా నుంచి మాంజా దేశానికి వచ్చింది. దాని పనితీరును చూసిన ఇక్కడి వ్యాపారులు సొంతంగా సింథటిక్ దారానికి గాజుపొడి అద్ది మాంజాను తయారు చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం వివిధ నగరాల్లో స్థానికంగా తయారు చేస్తున్నప్పటికీ పేరు మాత్రం చైనా మాంజాగానే మనుగడలో ఉంది. ఈ మాంజా కారణంగా పక్షులు, జంతువులే కాదు.. ఓ ద్విచక్ర వాహనదారుడికి గొంతు తెగిపోయి ఆస్పత్రి పాలైన ఉదంతమూ ఉంది. ఢిల్లీకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడి కుమారుడికి సైతం ఇలాంటి ప్రమాదం జరగడంతో అతడు కోర్టును ఆశ్రయించి ప్రమాదానికి కారణాలను కోర్టు ముందు ఉంచాడు. దీంతో ప్రమాదానికి కారణాలను గుర్తించిన కోర్టు మాంజా నిషేధించాలని ప్రభుత్వానికి సూచించింది. -
భాగ్యనగరిలో ఉత్సవాల ‘పరేడ్’
సాక్షి, హైదరాబాద్: వెయ్యి రకాలకుపైగా మిఠాయిలు.. అద్భుతమైన వినోదాన్ని పంచే పతంగులు.. కళ్లు తిçప్పనివ్వని సాంస్కృతిక ప్రదర్శనలు.. ఇవన్నీ ఒకేచోట ఏర్పాటైతే.. ఆ సందడే వేరు. సంక్రాంతి సందర్భంగా భాగ్య నగరంలో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. నేటి(శనివారం) నుంచి ఈ నెల 15 వరకు అంటే మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు ఒకేచోట కనువించు చేయను న్నాయి. స్వీట్, కైట్ ఫెస్టివల్స్‌తో పాటు సాంస్కృతిక ఉత్సవం నగరం నడిబొడ్డున ఉన్న పరేడ్ గ్రౌండ్ వేదికగా నగరవాసులను అలరించనున్నాయి. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ ఎస్.మధుసూదనాచారి ఈ వేడుకలను ప్రారంభించనున్నారు. స్వీట్ ఫెస్టి వల్ చైర్మన్ బుర్రా వెంకటేశం, వైస్ చైర్మన్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొంటారు. మిఠాయిల పండుగ అంతర్జాతీయ మిఠాయిల పండుగకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ ఫెస్టివల్లో నగరంలో స్థిరపడ్డ 15 దేశాలు, 25 రాష్ట్రాల వారు పాల్గొననున్నారు. వారి సంప్రదాయ స్వీట్లను ఫెస్టివల్లో ఉంచి విక్ర యిస్తారు. శనివారం మధ్యాహ్నం 3 గంట లకు స్వీట్ ఫెస్టివల్ ప్రారంభమై.. మూడు రోజులపాటు జరుగుతుంది. ఇందులో తెలంగాణ నుంచి 20, ఏపీ నుంచి 20 రకాల స్వీట్లతో పాటు పలు దేశాలు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 1,000 రకాల మిఠాయిలను ప్రదర్శనలో ఉంచనున్నారు. కైట్ ఫెస్టివల్ రాష్ట్ర ప్రభుత్వం 2015 నుంచి అంతర్జాతీయ పతంగుల ఉత్సవం నిర్వహిస్తోంది. ఏటా అగాఖాన్ అకాడమీలో దీనిని నిర్వహించే వారు. కానీ తొలిసారిగా ప్రజల్ని భాగస్వాము లను చేయాలని పరేడ్ గ్రౌండ్లో ఈ ఫెస్టి వల్‌ను ఏర్పాటు చేశారు. సింగపూర్, మలేసియా, జర్మనీ తదితర 14 దేశాలు, గుజరాత్, కేరâý తదితర రాష్ట్రాలకు చెందిన ఔత్సాహికులు ఇందులో పాల్గోనున్నారు. నైట్ కైట్ ఫెస్టివల్ ఈసారి ప్రత్యేక ఆకర్షణ. సాంస్కృతిక ఉత్సవం సాంస్కృతిక ఉత్సవంలో 15 అంతర్జాతీయ, భారతీయ కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం 6 గంటలకు పరేడ్ గ్రౌండ్లో ఇది ప్రారం భమవుతుంది. ఒగ్గుడోలు, పేర్ని, కథక్, కూచిపూడి, పులివేషాలు తదితర ప్రదర్శనలు ఉంటాయి. దీనిలో భాగంగానే ఫుడ్ ఫెస్టివల్‌ను సైతం ఏర్పాటు చేశారు. హైదరాబాదీ స్పెషల్ బిర్యానీతో పాటు వివిధ రకాల తెలంగాణ వంటకాలు నోరూరించనున్నాయి. -
ఇండోర్ లో మోడీ, కేజ్రివాల్ ల మధ్య ఉత్కంఠ పోరు!
లోకసభ ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల గడువు ఉండగానే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ల మధ్య ఇండోర్ లో ఫైటింగ్ మొదలైంది. అయితే మోడీ, కేజ్రివాల్ ల మధ్య పోరు రాజకీయ ఎన్నికల్లో అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇరువురు దిగ్గజాల మధ్య ఇండోర్ లో పతంగుల పోటీ రంజుగా కొనసాగుతోంది. మకర సంక్రాంతి పండగను పురస్కరించుకుని మోడీ, కేజ్రివాల్ ల బొమ్మలతో పతంగుల తయారు చేసి పోటీకి తెర లేపారు. అయితే రాహుల్ బ్రాండ్ పతంగులు పోటీలో లేకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశంగా మారింది. వివిద రకాల సైజు, ఫోటోగ్రాఫులతో ఇద్దరి నేతల బొమ్మలతో పతంగులను తయారు చేసామని సోహ్రాబ్ హుస్సేన్ అనే అమ్మకందారు తెలిపారు. వీటి ధర 5 రూపాయల నుంచి 50 రూపాయల మధ్య ఉందని తెలిపారు. కాషాయం కలర్ తో మోడీ బ్రాండ్ పతంగులు, ఆమ్ ఆద్మీ పార్టీ టోపి గుర్తుతో కేజ్రివాల్ బ్రాండ్ పతంగులను డిమాండ్ బాగా ఉందన్నారు. గత సంవత్సరం 'అన్నా' బ్రాండ్ పతంగులకు బాగా గిరాకీ ఉందని ఆయన తెలిపారు.