ఇండోర్ లో మోడీ, కేజ్రివాల్ ల మధ్య ఉత్కంఠ పోరు!
ఇండోర్ లో మోడీ, కేజ్రివాల్ ల మధ్య ఉత్కంఠ పోరు!
Published Sun, Jan 5 2014 9:47 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
లోకసభ ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల గడువు ఉండగానే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ల మధ్య ఇండోర్ లో ఫైటింగ్ మొదలైంది. అయితే మోడీ, కేజ్రివాల్ ల మధ్య పోరు రాజకీయ ఎన్నికల్లో అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇరువురు దిగ్గజాల మధ్య ఇండోర్ లో పతంగుల పోటీ రంజుగా కొనసాగుతోంది. మకర సంక్రాంతి పండగను పురస్కరించుకుని మోడీ, కేజ్రివాల్ ల బొమ్మలతో పతంగుల తయారు చేసి పోటీకి తెర లేపారు. అయితే రాహుల్ బ్రాండ్ పతంగులు పోటీలో లేకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశంగా మారింది.
వివిద రకాల సైజు, ఫోటోగ్రాఫులతో ఇద్దరి నేతల బొమ్మలతో పతంగులను తయారు చేసామని సోహ్రాబ్ హుస్సేన్ అనే అమ్మకందారు తెలిపారు. వీటి ధర 5 రూపాయల నుంచి 50 రూపాయల మధ్య ఉందని తెలిపారు. కాషాయం కలర్ తో మోడీ బ్రాండ్ పతంగులు, ఆమ్ ఆద్మీ పార్టీ టోపి గుర్తుతో కేజ్రివాల్ బ్రాండ్ పతంగులను డిమాండ్ బాగా ఉందన్నారు. గత సంవత్సరం 'అన్నా' బ్రాండ్ పతంగులకు బాగా గిరాకీ ఉందని ఆయన తెలిపారు.
Advertisement
Advertisement