సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో ఉన్నారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు. అనంతరం, పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో 13 వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తే అందులో రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు బహుమతిగా ఇచ్చారు. రూ.714 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్లే ఎంఎంటీఎస్ బడ్జెట్ పెరిగింది. రాష్ట్ర సహకారం లేకున్నా వందే భారత్ రైలును ప్రారంభించాం. రూ, 7864 కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి జరిగిందన్నారు. తెలంగాఆణలో జాతీయ రహదారులకు రూ. 1.04 లక్షల కోట్లు కేటాయించినట్టు తెలిపారు. తెలంగాణలో 33 జిల్లాల్లో 32 జిల్లాలకు కేంద్రం జాతీయ రహదారులతో అనుసంధానం చేసిందన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ప్రపంచస్థాయిలో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధికి కేంద్రం సంకల్పించింది. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలి. భూసేకరణకు ప్రభుత్వం ముందుకు రావాలి. తొమ్మిదేళ్లలో ప్రధాని మోదీ రైల్వేను సమూలంగా మార్చారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్ట్‌ల కోసం రూ.4400 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment