
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు, ప్రపంచ తెలుగు మహాసభల తర్వాత మరో ప్రపంచస్థాయి వేడుకకు నగరం వేదిక కానుంది. జనవరి 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో వరల్డ్ స్వీట్ ఫెస్టివల్ జరగనుంది. ప్రతి రాష్ట్రం నుంచి 50 రకాల స్వీట్లను వేడుకల్లో ప్రదర్శించనున్నారు.
1000 రకాల స్వీట్లను అమ్మకానికి ఉంచనున్నారు. దీనికి లక్ష మంది హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పర్యాటక, సాంస్కృతిక కార్యదర్శి బుర్రా వెంకటేశం అధ్యక్షతన పలు రాష్ట్రాల సాంస్కృతిక సంఘాల ప్రతినిధులతో బుధవారం జరిగిన సమీక్షలో వేడుకల నిర్వహణపై పలు నిర్ణయాలు తీసుకున్నారు.