సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేంద్రం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం వేడుకలు జరుగుతున్నాయి. కాగా, పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ తలపెట్టిన తెలంగాణ విమోచన వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమరవీరుల స్థూపం, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి అమిత్ షా నివాళులు అర్పించారు.
అలాగే, పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర పారామిలటరీ బలగాలు(12 బృందాలతో) పరేడ్ నిర్వహించాయి. ఈ సందర్బంగా అమిత్ షా కేంద్ర బలగాల గౌరవ వందనం స్వీకరించారు. విమోచన దినోత్సవ వేడుకలకు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే హాజరయ్యారు. అలాగే, ఈ వేడుకల్లో భాగంగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటకకు చెందిన 1500 మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు.
Union Home Minister #AmitShah hoisted #NationalFlag at Parade ground in #Secunderabad during the celebrations of #BJP Central govt's #HyderabadLiberationDay
— Surya Reddy (@jsuryareddy) September 17, 2022
Vs#TelanganaJateeyaSamaikyataVajrotsavalu#TelanganaNationalIntegrationDay of #TRS govt. #Hyderabad #TelanganaPolitics pic.twitter.com/AxFJ5Big0B
Comments
Please login to add a commentAdd a comment