సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని రాష్ట్రంలో జరుపుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుత సర్కార్‌తో పాటు గత ప్రభుత్వాలు విమోచన దినోత్స వాలు అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి.. మజ్లిస్ పార్టీని సంతృప్తి పరిచేందుకు ఈ కార్యక్రమాన్ని విస్మరించాయని విమర్శించారు.
అయితే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గతేడాది సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అధికారికంగా విమోచన ఉత్సవాలు నిర్వహించామని, ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముఖ్యఅతిథిగా హాజర య్యారని గుర్తుచేశారు. ఈ ఏడాది కూడా పరేడ్ గ్రౌండ్స్‌లోనే కేంద్రం తరఫున ఈ కార్యక్రమా లు నిర్వహించనున్నట్టు తెలిపారు.
మంగళవారం ఆయన ‘మేరీ మాటీ మేరా దేశ్’లో భాగంగా ‘మనమట్టికి నమస్సు లు, మన వీరులకు వందనం’ నినాదంతో స్వాతంత్య్ర సమరయోధులు, దేశం కోసం త్యాగాలు చేసిన వారి స్మరణకు చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమా లను గురించి వివరించారు. దేశవ్యాప్తంగా ప్రజలను మరోసారి ఏకతాటి పైకి తెచ్చేందుకు ‘నేను పుట్టిన నేల, నన్ను కన్న దేశం’ పేరుతో సెప్టెంబర్ 1న కార్యక్రమం ప్రారంభమైందని చెప్పారు. గ్రామస్తులంతా ఇంటినుంచి పిడి కెడు మట్టి కానీ, పిడికెడు బియ్యాన్ని కానీ కలశంలో సేకరించేలా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు.
7,500 కలశాల ద్వారా ఢిల్లీకి మట్టి
ఈ నెలలో అన్ని గ్రామాల నుంచి పవిత్రమైన మట్టిని సేకరించి, మండల కేంద్రాల్లో దాన్ని గౌరవించి, తర్వాత జిల్లా కేంద్రానికి, అక్కడి నుంచి రాష్ట్ర రాజధానికి చేర్చడం జరుగుతుందని చెప్పారు. హైదరాబాద్‌లో కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. చివర్లో ఢిల్లీలోని అమృత్ పార్క్ (అమృత వనం)లో 75 వేల మొక్కలు నాటి సుమారు 7,500 కలశాల ద్వారా తెచ్చిన మట్టిని కర్తవ్యపథ్‌లోని వార్ మెమోరియల్ పక్కనున్న స్థలంలో పెడతామని, అక్కడ అమరవీరుల స్మారక వనాన్ని ఏర్పాటు చేస్తామని కిషన్‌రెడ్డి వివరించారు.
భూములు లాక్కొనేందుకే ధరణి
ఇబ్రహీంపట్నం రూరల్: రైతులు, అమాయకుల నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు భూములు లాక్కొనేందుకే ధరణి ఉపయోగపడుతోందని, దీనివల్ల రైతులకు ఒరిగిందేమీ లేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలో మంగళవారం నిర్వహించిన బీజేపీ రైతు మోర్చా సమావేశంలో ఆయన మాట్లాడారు. ధరణి.. బీఆర్‌ఎస్‌కు భరణిగా మారిందని ఎద్దేవా చేశారు.
రైతును రాజును చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి.. తెలంగాణ వచ్చిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న 7 వేల మంది రైతుల కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సమావేశంలో కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు శంభూజీ కుమార్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment