సభకు 10 లక్షల మంది | 10 million people in attend the sabha | Sakshi
Sakshi News home page

సభకు 10 లక్షల మంది

Published Sun, Apr 26 2015 12:27 AM | Last Updated on Sun, Sep 3 2017 12:52 AM

సభకు 10 లక్షల మంది

సభకు 10 లక్షల మంది

హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి

హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఆవి ర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగసభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలి పారు. పది లక్షల మంది హాజ రయ్యే ఈ భారీ బహిరంగసభ కోసం కనీవినీ ఎరుగని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.

శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేపాల్, భారత్‌లలోని పలు ప్రాంతాల్లో సంభవించిన భూకంపంలో మృతి చెందిన వారికి టీఆర్‌ఎస్ తరపున నాయిని సంతాపం ప్రకటించారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువాళ్లను రప్పిం చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, డీజీపీ, హోం సెక్రటరీలకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. కాగా సికింద్రాబాద్ పరేడ్‌మైదానంలో జరగనున్న  సభ ఏర్పాట్లను శనివారం మంత్రులు కేటీఆర్, పద్మారావు, తలసాని,  ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, భానుప్రసాద్‌లతో కలసి పర్యవేక్షించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement