Day formation
-
జాతీయ పతాకం.. జాతీయ గీతం మన దేశ సంపద
స్వామిగౌడ్ నార్సింగి: రాజేంద్రనగర్ బండ్లగూడలోని శారదాధామంలో శుక్రవారం సాయంత్రం భారత జాతీయ పతాక 95వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్, సరస్వతీ విద్యామందిర్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ పతాకం, జాతీయ గీతం, వందేమాతరం జాతీయ సంపద అని అన్నారు. రోజూ ఉదయం లేవగానే భారతమాతాకీ జై అని నినదించి తమ పనులు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కె.హెచ్.ఎస్.జగదాంబ, వి.రాముడు యాదవ్, ప్రమీల యాదవ్, కె.సంజీవ్‌కుమార్, సురేష్, నర్సింహా రెడ్డి, రావుల విశ్వనాథ్‌రెడ్డి, రాంప్రసాద్‌రావు, ప్రవీన్‌కుమార్, పి.రాజు, ప్రజాప్రతినిధులు, నాయకులు మల్లేష్, కృష్ణా రెడ్డి, హరికృష్ణ, స్వర్ణలత భీమార్జున్‌రెడ్డి హాజరయ్యారు. -
‘దేశం’ ఉనికి ప్రశ్నార్థకమే..!
జిల్లాలో అదృశ్యమవుతున్న టీడీపీ నేడు ఆవిర్భావ దినోత్సవం సిటీబ్యూరో: పార్టీ ఆవిర్భావించాక గడచిన మూడు దశాబ్దాల కాలంలో ఎన్నడూలేని రీతిలో నగరంలో టీడీపీ కోలుకోలేని దెబ్బతిన్నది. దాదాపుగా పార్టీ అవసాన దశకు చేరుకుంది. ఈ నగరంలోనే పురుడుపోసుకున్న పార్టీ.. సుదీర్ఘ పయనంలో ఎన్నో ఉత్తానపతనాల్ని చవి చూసినప్పటికీ..ఇంత దారుణంగా దెబ్బతినడం ఇప్పుడే. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేళ.. పార్టీ జిల్లాశాఖకు అధ్యక్షుడు కానీ.. కన్వీనర్ కానీ లేని దయనీయ స్థితి. అంతేకాదు.. ఒకరిద్దరు జిల్లా స్థాయి నాయకులు తప్ప ఎవరూ మిగలని దుస్థితి. పార్టీకి ఇంతటి అవమానం.. పతనం గతంలో లేవు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ స్థానాలకు గాను 15 స్థానాలను గెలుచుకున్న పార్టీకి వారిలో ఒక్కరు తప్ప మిగతా వారెవరూ మిగల్లేదు. పార్టీ టికెట్‌పై గెలిచినప్పటికీ.. 14 మంది పార్టీని వీడి వెళ్లిపోయారు. ఎల్బీనగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్.కృష్ణయ్య తప్ప ప్రస్తుతం ఇంకెవరూ లేరు. ఇది ఎమ్మెల్యేల పరిస్థితి కాగా.. పార్టీ జిల్లాశాఖకు అధ్యక్షులుగా పనిచేసినవారు సైతం పార్టీలో లేకుండా పోవడం పార్టీ పరిస్థితికి దర్పణం. జిల్లా పార్టీకి అధ్యక్షులుగా వ్యవహరించిన తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, కృష్ణయాదవ్లతోపాటు ముఠాగోపాల్, జి.సాయన్న వంటివారు సైతం టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరారు. జిల్లా అధ్యక్షునిగా వ్యవహరించిన సీబీఐ మాజీ డెరైక్టర్ కె. విజయరామారావు సైతం పార్టీకి దూరమయ్యారు. ఆఖరుకు కృష్ణయాదవ్ పార్టీని వీడి పోవడానికి కారకుడైన మాగంటి గోపీనాథ్ సైతం టీఆర్ఎస్ పంచన చేరడం టీడీపీ పతనానికి నిలువెత్తు నిదర్శనం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటికి జిల్లా పగ్గాలు కూడా అప్పగించినందునే కృష్ణయాదవ్ టీడీపీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ పూర్తిగా వ్యాపారమయమైందని, బడుగులకు, కష్టసమయంలో ఆదుకున్నవారికి గుర్తింపులేదని కృష్ణయాదవ్ వెళ్లిపోగా.. ఆయన వెళ్లిన కొద్దిరోజులకే మాగంటి సైతం టీడీపీకి టాటా చెప్పడం విచిత్రం. టీడీపీ అధ్యక్షులుగా వ్యవహరించిన తలసాని, కృష్ణారెడ్డి, సాయన్న ఎమ్మెల్యేలుగా గెలిచాక టీఆర్ఎస్కు వెళ్లిపోయారు. వీరిలో అందరికంటే ముందు టీఆర్ఎస్లోకి వె ళ్లిన ముఠాగోపాల్ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసినప్పటికీ, ఎమ్మెల్యే కాలేకపోయారు. ఇక కార్పొరేషన్ విషయానికి వస్తే 2002లో మేయర్‌కు జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంఐంను ఢీకొని మేయర్ పదవిని కైవసం చేసుకున్న పార్టీకి ఇటీవలి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒకే ఒక సీటు దక్కింది. గత పాలకమండలిలో అధికార కాంగ్రెస్ తర్వాత అత్యధిక స్థానాల్లో 45 డివిజన్లలో గెలిచిన టీడీపీ..ప్రస్తుత పాలకమండలిలో నామ్కేవాస్తేగా మారింది. -
ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
భారీ ఏర్పాట్లు చేస్తున్న సర్కారు జూన్ 2 నుంచి 7 వరకు కార్యక్రమాలు హైదరాబాద్: జూన్ 2 నుంచి వారం రోజులపాటు నిర్వహించనున్న రాష్ట్రావతరణ వేడుకలకు ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌లోని 30 ప్రాంతాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఐదు బృందాలను నియమించింది. ప్రత్యేకంగా సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహించాలని భావిస్తోంది. జూన్ 2న గన్‌పార్కు వద్ద అమరవీరులకు నివాళితో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు ప్రారంభమవుతాయి. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసే కార్యక్రమంలో వివిధ రంగాల వారికి అవార్డుల ప్రదానం, 20 విభాగాలకు చెందిన శకటాల ప్రదర్శన, సీఎం కేసీఆర్ ప్రసంగం ఉంటుంది. ఇక 7వ తేదీ సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై కనీవినీ ఎరుగని రీతిలో ముగింపు ఉత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అత్యాధునిక త్రీడీ మ్యాపింగ్ సిస్టం ద్వారా సికింద్రాబాద్ క్లాక్ టవర్, కాచిగూడ రైల్వే స్టేషన్, హుస్సేన్‌సాగర్‌లోని బుద్దుడి విగ్రహానికి సప్తవర్ణాల్లో మిరుమిట్లు గొలిపే వెలుగు జిలుగులు అమర్చనున్నారు. మునుపెన్నడూ లేని విధంగా చార్మినార్ వేదికపై అంతర్జాతీయ కళాకారుడితో అద్భుత ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అలాగే శిల్పారామం, రవీంద్రభారతి, చౌమహల్లా ప్యాలెస్, తారామతి బారాదరి, గోల్కొండ తదితర ప్రాంతాల్లోనూ సాయంత్రం 6.30 గంటలకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. లితిత కళా తోరణంలో 2 నుంచి 7వ తేదీ వరకు తెలంగాణ సినిమాలను ప్రదర్శించనున్నారు. సాంస్కృతిక సారథి నేతృత్వంలో అన్ని జిల్లాల్లో 500 మంది కళాకారులతో సాంస్కృతిక జైత్రయాత్ర నిర్వహించేందుకు పకడ్బందీ ప్రణాళికను రూపొందించారు. -
సభకు 10 లక్షల మంది
హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి హైదరాబాద్: టీఆర్ఎస్ ఆవి ర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగసభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలి పారు. పది లక్షల మంది హాజ రయ్యే ఈ భారీ బహిరంగసభ కోసం కనీవినీ ఎరుగని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. శనివారం తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేపాల్, భారత్‌లలోని పలు ప్రాంతాల్లో సంభవించిన భూకంపంలో మృతి చెందిన వారికి టీఆర్ఎస్ తరపున నాయిని సంతాపం ప్రకటించారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువాళ్లను రప్పిం చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, డీజీపీ, హోం సెక్రటరీలకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. కాగా సికింద్రాబాద్ పరేడ్‌మైదానంలో జరగనున్న సభ ఏర్పాట్లను శనివారం మంత్రులు కేటీఆర్, పద్మారావు, తలసాని, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, భానుప్రసాద్‌లతో కలసి పర్యవేక్షించారు. -
పండుగ కళ తేవాలి
హైదరాబాద్‌లో బహిరంగసభపై నేతలకు కేసీఆర్ సూచన హైదరాబాద్: టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ముఖ్య నేతలకు ఆదేశించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పల్లెపల్లెనా, ఇంటింటికీ చాటిచెప్పేలా పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేయాలని సూచించారు. పది నెలల్లో చేపట్టిన బృహత్తర కార్యక్రమాల ప్రచార బాధ్యతలను కార్యకర్తలకు అప్పగించాలని చెప్పారు. 27న (సోమవారం) పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ విజయోత్సవ సభగా జరుపుకోవాలని కేసీఆర్ సూచించారు. హైదరాబాద్‌లో బహిరంగ సభకు ఏర్పాట్లు, ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం క్యాంప్ కార్యాలయంలో మంత్రులు మహమూద్ అలీ, పద్మారావు, తలసాని శ్రీనివాసయాదవ్, నాయిని, మహేందర్‌రెడ్డి, ఇతర ముఖ్య నేతలతో సీఎం సమీక్షించారు. అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో.. హైదరాబాద్‌లో పండుగ వాతావరణం ఉట్టిపడాలని కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. ఈ సభను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు జన సమీకరణపై దృష్టి పెట్టాలని ఆదేశించినట్లు సమాచారం. జిల్లాల వారీగా పార్టీని బలోపేతం చేసే బాధ్యతను, బహిరంగ సభను విజయవంతం చేసే బాధ్యతలను పార్టీ ఇన్చార్జులకు అప్పగించాలని కూడా సూచించారు. జిల్లాకు లక్ష మందికి తక్కువ కాకుండా పది లక్షల మంది జనాన్ని బహిరంగ సభకు తరలించాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలుస్తోంది. కాగా సీఎం కేసీఆర్ ఆదివారం ఉదయం నల్లగొండలో జరిగే ఒక వివాహానికి హాజరుకానున్నారు. అనంతరం నకిరేకల్ నియోజకవర్గంలోని చందుపట్లలో మిషన్ కాకతీయ కార్యక్రమంలో పాల్గొంటారు.