జాతీయ పతాకం.. జాతీయ గీతం మన దేశ సంపద
స్వామిగౌడ్
నార్సింగి: రాజేంద్రనగర్ బండ్లగూడలోని శారదాధామంలో శుక్రవారం సాయంత్రం భారత జాతీయ పతాక 95వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్, సరస్వతీ విద్యామందిర్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ పతాకం, జాతీయ గీతం, వందేమాతరం జాతీయ సంపద అని అన్నారు.
రోజూ ఉదయం లేవగానే భారతమాతాకీ జై అని నినదించి తమ పనులు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కె.హెచ్.ఎస్.జగదాంబ, వి.రాముడు యాదవ్, ప్రమీల యాదవ్, కె.సంజీవ్‌కుమార్, సురేష్, నర్సింహా రెడ్డి, రావుల విశ్వనాథ్‌రెడ్డి, రాంప్రసాద్‌రావు, ప్రవీన్‌కుమార్, పి.రాజు, ప్రజాప్రతినిధులు, నాయకులు మల్లేష్, కృష్ణా రెడ్డి, హరికృష్ణ, స్వర్ణలత భీమార్జున్‌రెడ్డి హాజరయ్యారు.