కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్: సువిశాల భారతదేశం లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించేందుకు నిరంతరం పాటుపడిన మహనీయుల త్యాగాలు అందరికీ స్ఫూర్తిదాయకం కావాలని కలెక్టర్ కోన శశిధర్ అన్నారు. ఆదివారం పోలీసు పెరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించిన 65వ గణతంత్ర దినోత్సవంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. పెరేడ్‌ను తిలకించిన తర్వాత రాష్ట్రీయ సెల్యూట్ స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం వివిధ పథకాలను అమలు చేస్తోందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు విత్తనాల సరఫరా కోసం రూ. 5 కోట్లు ఖర్చు చేశామన్నారు. అలాగే 80 వేల మెట్రిక్ టన్నుల ఎరువులను సరఫరా చేశామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1668 కోట్ల రూపాయల పంట రుణాలను అందించామన్నారు. 2012 ఖరీఫ్‌లో పంట నష్టపోయిన 59,364 మంది రైతులకు నష్టపరిహారం కింద రూ. 52.51 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.
గండికోట రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తి చేసి మూడు టీఎంసీల నీరు నిల్వ చేశామన్నారు. శ్రీశైలం జలాశయం నుంచి తగినంత నీటి సరఫరా జరిగితే తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది రబీలో 60 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యంగా నిర్ణయించామన్నారు. జీఎన్‌ఎస్‌ఎస్‌లో అంతర్భాగమైన వామికొండ సాగర్ రిజర్వాయర్ ద్వారా మూడు వేల ఎకరాలకు, గండికోట లిఫ్ట్ ద్వారా ఐదు వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.
సంక్షేమానికి పెద్దపీట
జిల్లాలోని మహిళా సంఘాలకు రూ. 487 కోట్ల బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని లక్ష్యం కాగా, ఇప్పటివరకు రూ. 353 కోట్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. రుణాలు సక్రమంగా చెల్లించిన సంఘాలకు రూ. 28 కోట్లు వడ్డీ రూపంలో ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించిందన్నారు. స్త్రీ నిధి ద్వారా 17 వేల మంది సంఘ సభ్యులకు రూ. 30 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. బంగారుతల్లి పథకం కింద 2787 మందికి నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. రాజీవ్ యువశక్తి కింద యువత స్వయం ఉపాధి కల్పన కోసం రూ. 3.70 కోట్లతో 370 యూనిట్ల స్థాపనకు చర్యలు తీసుకున్నామన్నారు.
ఇందిరమ్మ, రచ్చబండ పథకాల కింద 3,76,190 ఇళ్లు మంజూరు కాగా, 2,49,685 పూర్తి చేశామని, మిగిలిన ఇళ్లను కూడా ప్రణాళిక బద్ధంగా పరిపూర్తి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. ఉపాధి హామీ కోసం రూ. 150 కోట్లు ఖర్చు చేసి 20,471 కుటుంబాలకు వంద రోజుల పని కల్పించామన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకోసం రూ. 6 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇందిర జలప్రభ కింద ఎస్సీ ఎస్టీలకు చెందిన 12 వేల ఎకరాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఏడవ విడతలో 10,582 మందికి 15,811 ఎకరాల భూమిని పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్, జాయింట్ కలెక్టర్ నిర్మల, ఏజేసీ సుదర్శన్‌రెడ్డి, డీఆర్వో ఈశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన 386 మందికి ప్రశంసాపత్రాలు అందజేశారు.
అప్రమత్తంగా లేకపోతే అంతే
బియ్యం కోసం చౌకదుకాణానికి వెళ్లేటప్పుడుగానీ, తిరిగి వచ్చేటప్పుడుగానీ, దుకాణాలు, బజారులకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా లేకపోతే గొలుసు దొంగల బారిన పడాల్సిందే. ఎన్నో సంవత్సరాలుగా కూడబెట్టుకున్న బంగారు ఆభరణాలు దొంగలపాలు కావాల్సిందే. మహిళలు ఎవరి జాగ్రత్తలో వారు ఉండటం మంచిది.
- పాలగిరి మహేశ్వరి, శాస్త్రినగర్, కడప
ఒంటరిగా వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి
మహిళలు ఒంటరిగా వెళ్లాల్సి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు అనేకమార్లు సూచనలు ఇస్తూ ఉంటారు. ఆ సూచనలను తప్పక పాటించాలి. లేకపోతే విలువైన బంగారు ఆభరణాలను కోల్పోవాల్సి వస్తుంది.
- బత్తల అంజనమ్మ, అక్కాయపల్లె, కడప
పోలీసుల నిఘా పెరగాలి
గొలుసు దొంగల విషయంలో పోలీసులు తమ శైలిని మార్చుకుని నిఘా పెంచాలి. ఎప్పటికప్పుడు నిందితుల నేరాల పద్ధతులను బట్టి పోలీసులు కూడా నిర్మానుష్య ప్రదేశాలలోఎవరైనా యువకులు గుంపులుగా గానీ, ఇద్దరు లేక ముగ్గురు గానీ మోటారు సైకిళ్లలో అనుమానాస్పదంగా తిరుగుతుంటే వారిపై చర్యలు తీసుకోవాలి.
- ఆర్.స్వప్న, అల్మాస్‌పేట, కడప
మహిళలకు రక్షణ కల్పించాలి
గొలుసు దొంగల బారి నుంచి మహిళలకు రక్షణ కల్పించాలి. బంగారు ఆభరణాలు వేసుకోవాలంటేనే భయమేస్తోంది. ఎక్కడ బంగారు చైన్లు పోగొట్టుకుంటామోనని మెడలలో తాడులు వేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మహిళలు ఫిర్యాదు చేయడానికి వెళితేపోలీసులు కొన్ని సందర్భాలలో సరైన పద్ధతిలో స్వీకరించడం లేదు.
-గౌసియా, అక్కాయపల్లె, కడప.
మహనీయుల త్యాగాలు..
Published Mon, Jan 27 2014 2:39 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement