కొనసాగిన ఎస్సై దేహదారుఢ్య పరీక్షలు  | Police Recruitment In Eluru Police Parade Grounds, Details Inside - Sakshi
Sakshi News home page

కొనసాగిన ఎస్సై దేహదారుఢ్య పరీక్షలు 

Sep 13 2023 12:18 PM | Updated on Sep 13 2023 1:03 PM

Police Recruitment in Eluru Police Parade Grounds - Sakshi

ఏలూరుని పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్స్‌లో పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఎస్సై అభ్యర్థులకు నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు మంగళవారం కూడా కొనసాగాయి. మొత్తం 538 మంది మహిళా అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా, 260 మంది మాత్రమే హాజరయ్యారు. వీరికి ఫిజికల్‌ ఎఫీషియెన్సీ పరీక్షల్లో భాగంగా 1600 మీటర్లు, 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌ తదితర పరీక్షలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏలూరు రేంజ్‌ డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ ఇప్పటివరకు నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలకు 4,581 మంది పురుష అభ్యర్థులు హాజరు కాగా, 3,233 మంది, 1177 మంది మహిళ అభ్యర్థులు హాజరు కాగా, 607 మంది అర్హత సాధించారని చెప్పారు. పరీక్షలను ఎస్పీ డి.మేరి ప్రశాంతి, ఏఎస్పీ ఎంజేవీ భాస్కరరావు పరిశీలించారు.   
– సాక్షి ఫొటోగ్రాఫర్‌/ఏలూరు   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement