16న రాత్రే నగరానికి అమిత్‌ షా | Amit Shah to attend Hyderabad Liberation Day Program | Sakshi
Sakshi News home page

16న రాత్రే నగరానికి అమిత్‌ షా

Published Wed, Sep 13 2023 2:24 AM | Last Updated on Wed, Sep 13 2023 5:10 AM

Amit Shah to attend Hyderabad Liberation Day Program - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ఒకరోజు ముందే ఆయన హైదరాబాద్‌కు చేరుకుంటారు. 17న సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగే హైదరాబాద్‌ విమోచన దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. 16న మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఐఏఎఫ్‌ ప్రత్యేక విమానంలో రాత్రి 8 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు.

ఆదివారం ఉదయం 8.30 గంటలకు సీఆర్‌పీఎఫ్‌ ఆఫీసర్స్‌ మెస్‌ నుంచి రోడ్డుమార్గాన సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. ఉదయం 9 నుంచి 11 గంటల దాకా హైదరాబాద్‌ విమోచన దినోత్సవంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా సీఆర్‌పీఎఫ్, సీఐఎప్‌ఎఫ్‌ ఇతర పోలీసు బలగాల వందనం స్వీకరిస్తారు. అనంతరం రోడ్డుమార్గాన శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఉదయం 11.50 నిమిషాలకు ఐఏఎఫ్‌ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళతారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement