విమోచన దినాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి
విమోచన దినాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి
Published Sat, Aug 27 2016 9:16 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
నల్లగొండ టూటౌన్ : సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరావు డిమాండ్ చేశారు. శనివారం బండారు గార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ ఇచ్చిన వాగ్ధానాలను తుంగలో తొక్కిందని విమర్శించారు. ఎంఐఎం పార్టీకి భయపడి తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించకుండా కేసీఆర్ ప్రభుత్వం మాటమార్చిందని విమర్శించారు. నేటి నుంచి సెప్టెంబర్ 15 వరకు గ్రామాల్లో పర్యటించి తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలను పరామర్శిస్తామని అన్నారు. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని పోస్టుకార్డు ఉద్యమం, నిరసన ప్రదర్శన చేపడుతున్నట్లు తెలిపారు.
రేపు బీజేపీ జిల్లా కార్యాలయం ప్రారంభం
జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన బీజేపీ జిల్లా కార్యాలయాన్ని ఈనెల 29వ తేదీన ప్రారంభిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు తెలిపారు. కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఫగన్‌సింగ్ కులస్త, రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఇతర రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు శ్రీరామోజు షణ్ముకాచారి, పార్టీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, నూకల వెంకటనారాయణరెడ్డి, ఓరుగంటి రాములు, బాకి పాపయ్య, పోతెపాక సాంబయ్య తదితరులున్నారు.
Advertisement
Advertisement