విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి
విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి
Published Sat, Sep 10 2016 7:55 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
నల్లగొండ టూటౌన్ : సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు డిమాండ్ చేశారు. తిరంగా యాత్రలో భాగంగా శనివారం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 17వ తేదీన విమోచన దినోత్సవ సందర్భంగా వాడవాడలా జాతీయ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఇప్పుడు పీఠం ఎక్కగానే మాటమార్చారని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ కిసార్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, శ్రీరామోజు షణ్ముక, నూకల వెంకటనారాయణరెడ్డి, పల్లెబోయిన శ్యాంసుందర్, బాకి పాపయ్య, పోతెపాక సాంబయ్య, బండారు ప్రసాద్, బొజ్జ శేఖర్, బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండగోని భరత్‌కుమార్‌గౌడ్, మొరిశెట్టి నాగేశ్వర్‌రావు, జి. మల్లయ్య, బీజేవైఎం జిల్లా కార్యదర్శి పోతెపాక లింగస్వామి, సాగర్ల లింగయ్య, మారెడ్డి ప్రశాంత్‌రెడ్డి, శ్రవణ్‌కుమార్, తదితరులున్నారు.
Advertisement