బీజేపీ దళితమోర్చా సమావేశంలో డప్పు కొట్టి కార్యకర్తల్లో జోష్ నింపుతున్న కిషన్‌రెడ్డి
మన్సూరాబాద్/ఘట్‌కేసర్: తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే 80 రోజుల్లో ఎన్నికలు రానున్నాయని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్రస్థాయి సమ్మేళనాన్ని మన్సూరాబాద్‌లో నిర్వహించారు. మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి కిషన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
అలాగే మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం అవుషాపూర్‌లో నిర్వహించిన బీజేవైఎం రాష్ట్రస్థాయి సమావేశానికి కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాల్లో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించిన కేసీఆర్.. ఎన్నికల ఫలితాలు వెలువడగానే వారికి వెన్నుపోటు పొడిచి దగా చేశారని ధ్వజమెత్తారు. దళితబంధు పేరుతో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను నిర్విర్యం చేశారని మండిపడ్డారు. ఈ నెల 17న పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఉద్యోగాలు రాక తెలంగాణ యువత కన్నీరు పెడుతోందని ఈటల రాజేందర్ ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి డప్పుకొట్టి కార్యకర్తల్లో జోష్ నింపారు. కాగా, తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ పాలనను అంతమొందించడానికి బీఆర్‌ఎస్‌ను, దేశంలో గాంధీ కుటుంబ పాలన రాకుండా కాంగ్రెస్‌ను ఓడించాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. బీజేవైఎం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ డీఎన్‌ఏ ఒక్కటేనన్నారు. బుధ, గురువారాల్లో నిరుద్యోగ దీక్ష, 15న హైదరాబాద్– పరకాల బైక్ ర్యాలీ ఉంటాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment