Itala Rajender
-
షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు
మన్సూరాబాద్/ఘట్కేసర్: తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే 80 రోజుల్లో ఎన్నికలు రానున్నాయని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్రస్థాయి సమ్మేళనాన్ని మన్సూరాబాద్‌లో నిర్వహించారు. మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి కిషన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. అలాగే మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అవుషాపూర్‌లో నిర్వహించిన బీజేవైఎం రాష్ట్రస్థాయి సమావేశానికి కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాల్లో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించిన కేసీఆర్.. ఎన్నికల ఫలితాలు వెలువడగానే వారికి వెన్నుపోటు పొడిచి దగా చేశారని ధ్వజమెత్తారు. దళితబంధు పేరుతో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను నిర్విర్యం చేశారని మండిపడ్డారు. ఈ నెల 17న పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉద్యోగాలు రాక తెలంగాణ యువత కన్నీరు పెడుతోందని ఈటల రాజేందర్ ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి డప్పుకొట్టి కార్యకర్తల్లో జోష్ నింపారు. కాగా, తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ పాలనను అంతమొందించడానికి బీఆర్ఎస్ను, దేశంలో గాంధీ కుటుంబ పాలన రాకుండా కాంగ్రెస్‌ను ఓడించాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. బీజేవైఎం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ డీఎన్ఏ ఒక్కటేనన్నారు. బుధ, గురువారాల్లో నిరుద్యోగ దీక్ష, 15న హైదరాబాద్– పరకాల బైక్ ర్యాలీ ఉంటాయని తెలిపారు. -
కేసీఆర్‌ను మళ్లీ గెలిపిస్తే చేతికి చిప్పే
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : ధనికరాష్ట్రంగా ఉన్న తెలంగాణ కేసీఆర్ పాలనలో పూర్తిగా దివాలా తీసిందని.. కనీసం జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి దిగజారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. మళ్లీ కేసీ ఆర్‌ను గెలిపిస్తే ప్రజల చేతికి చిప్పే మిగులుతుందని చెప్పారు. బీఆర్ఎస్ కౌన్సిలర్, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజు బీజేపీ లో చేరారు. ఈ సందర్భంగా సంగా రెడ్డిలోని అంబేడ్కర్ స్టేడియంలో సోమవారం ఏర్పాటు చేసిన విజయ సంకల్పసభలో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేక మద్యం టెండర్లు 6 నెలలు ముందు నిర్వహించిందని, ఓఆర్ఆర్ టెండర్లతో వచ్చిన డబ్బులతో జీతా లు చెల్లించాల్సి వస్తోందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంల తీరును ఆయన తీవ్రంగా విమ ర్శించారు. కాంగ్రెస్ సోని యా కుటుంబం కోసం..బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం కోసం..ఎంఐఎం ఒవైసీ కుటుంబం కోసం పనిచేస్తాయని చెప్పారు. ఒక్క బీజేపీ మాత్రమే అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందనే విషయం ప్రజలు గుర్తించాలన్నారు. సోనియా నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో రూ.పది లక్షల కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు దేశంలోని అన్ని పార్టీల ఖర్చులను తానే భరిస్తానని సీఎం కేసీఆర్ చెప్పారని, అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్‌కు బీసీలపై నమ్మకం లేదు: ఈటల బీఆర్ఎస్ ఉన్నంత వరకు ఆ పార్టీకి సాధారణ వ్యక్తి అధ్యక్షుడిగా ఉండే ఆస్కారం ఉంటుందా అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్‌కు బీసీలపై నమ్మకం లేకనే మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్చార్జ్ బాధ్యతలను కూడా తన అన్న కొడుక్కే కట్టబెట్టారని విమర్శించారు. బీఆర్ఎస్ ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబసభ్యులు మినహా ఇతరులు సీఎం కాలేరని, కేసీఆర్ కాకపోతే ఆయన కొడుకు.. మనవడే ముఖ్యమంత్రి అవుతారని, సాధారణ వ్యక్తులు సీఎం కాలేరని అన్నారు. సభలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల, ఎమ్మెల్యే రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
ఈటల,రేవంత్ రెడ్డి ఇద్దరూ తోడుదొంగలు
-
టీపీసీసీ చీఫ్ రేవంత్ ప్రమాణంపై స్పందించిన ఈటల
-
హుస్నాబాద్ సభకు స్మృతి ఇరానీ
-
ట్రాన్స్‌ఫార్మర్‌పైనే ప్రాణం పోయింది
కోహెడరూర్(హుస్నాబాద్): ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతు చేస్తుండగా కరెంట్ షాక్‌కు గురై ట్రాన్స్‌ఫార్మర్‌పైనే ఓ వ్యక్తి ప్రాణాలు వదిలిన ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం ఆరెపల్లిలో శనివారం చోటు చేసుకుంది. పోరెడ్డిపల్లికి చెందిన మంద తిరుపతి(35) లైన్‌మన్ సహాయంతో ఎల్సీ తీసుకొని ఆరెపల్లిలోని ఓ రైతు పొలంలో ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేస్తున్నాడు. మధ్యలోనే విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురై ట్రాన్స్‌ఫార్మర్‌పైనే ప్రాణాలు విడిచాడు. కుటుంబసభ్యులు, గ్రామస్తులు మృతదేహం తో సిద్దిపేట– హన్మకొండ రహదారిపై ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రహదారి పై అటుగా వెళ్తున్న రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ ఘటనాస్థలాన్ని పరిశీలించి రూ.15 లక్షలు, తిరుపతి భార్యకు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. మంత్రి హామీతో ఆందోళన విరమించారు. -
రండి.. రండి.. దయచేయండి!
హైదరాబాద్: 79వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన–2019 (నుమాయిష్)కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది జనవరి 1న ఈ నుమాయిష్ ప్రారంభం అవుతుంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ అధ్యక్షత వహించే నుమాయిష్‌ను రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారు. ఫిబ్రవరి 15తో ప్రదర్శన ముగుస్తుంది. నిజాం స్టేట్‌లో ప్రారంభమైన ఎగ్జిబిషన్ సొసైటీ 78 సంవత్సరాలు పూర్తి చేసుకుని 79వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన వివరాలను శనివారం ఈటల ఎగ్జిబిషన్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులతో కలసి మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక వాతావరణం నెలకొల్పేందుకు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీని స్థాపించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉత్పత్తి అయ్యే కళాఖండాలను ఇక్కడ ప్రదర్శించేందుకు వీలు కల్పించారు. ఈ ఏడాది 2,500 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ప్రైవేట్ సంస్థలతో పాటు కేంద్ర, రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థలకు స్టాళ్లను కేటాయించారు. ఈ సంస్థలు ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తాయి. మెట్రో రైలు కళ... ఈ ఏడాది నుమాయిష్‌కు మెట్రో రైలు కళ సంతరించుకోనుంది. మియాపూర్ నుంచి నాంపల్లి, ఎల్బీ నగర్ నుంచి నాంపల్లికి మెట్రో రైలు సౌకర్యం ఉంది. సందర్శకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజూ రాత్రి 11.30 గంటల వరకు మెట్రో సర్వీసులను అదనంగా నడిపేందుకు అధికారులు అంగీకరించారు. మెట్రో టికెట్లు కొనేందుకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోని మూడు గేట్ల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉచిత పార్కింగ్... రాష్ట్ర ప్రభుత్వ చొరవతో నుమాయిష్‌కు ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాల్లో ఇదొకటి. నుమాయిష్ చుట్టుప్రక్కల ఉండే ప్రభుత్వ శాఖల భవన సముదాయాల్లో పార్కింగ్ ఉచితంగా చేసుకోవచ్చు. గగన్ విహార్, చంద్రవిహార్, భీంరావ్ బాడా, గృహకల్ప, మనోరంజన్ కాంప్లెక్స్, అబ్కారీ భవన్ ఎదుట ఉచిత పార్కింగ్ స్థలాలుగా ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. వీటితో పాటుగా తాజ్ ఐల్యాండ్ నుంచి చంద్రవిహార్ వరకు ఉన్న రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. గతంలో సందర్శకుల నుంచి కాంట్రాక్టర్లు ఇష్టానుసారం ధరలు నిర్ణయించి దోచుకునేవారు. లాభాపేక్షలేని సంస్థ ఇదిః ఈటల రాజేందర్ పారిశ్రామిక విధానాన్ని ప్రోత్సహించడానికి ఎగ్జిబిషన్ సొసైటీని ప్రారంభించారని ఈటల రాజేందర్ అన్నారు. ఈ ఎగ్జిబిషన్ నిర్వహణతో వచ్చే ఆదాయాన్ని 18 విద్యా సంస్థలకు వినియోగిస్తున్నామని చెప్పారు. గత 78 సంవత్సరాలుగా వచ్చిన ఆదాయంతో పాఠశాలలు, కళాశాలలు స్థాపించి విద్యను ప్రోత్సహించడం జరుగుతోందన్నారు. కేసీఆర్ చొరవతో ఎగ్జిబిషన్‌ను మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా సరికొత్త సంస్కరణలను తీసుకువస్తున్నామన్నారు. కొనసాగనున్న రోజులు: 45 ప్రవేశ రుసుం: రూ.30 ఏర్పాటు చేసే మొత్తం స్టాల్స్: 2,500 మెట్రో రైలు సర్వీసులు: రాత్రి 11.30 వరకు పాల్గొననున్న వలంటీర్లు: 1,500 మంది -
జిల్లాకు దక్కని ప్రాధాన్యం...
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ బుధవారం శాసనసభలో రూ.1,00,637.96 కోట్లతో ప్రవేశపెట్టిన 2014-15 వార్షిక బడ్జెట్లో జిల్లాకు అంతగా ప్రాధాన్యత దక్కలేదు. 2013-14 బడ్జెట్లో జిల్లా సాగునీటి పథకాలకు రూ.922 కోట్లు కేటాయిస్తే.. ఈ సారి రూ.346.90 కోట్లు ఇచ్చారు. ఏడు జిల్లాలకు చెందిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు రూ.1790 కోట్లు కేటాయించినా జిల్లా వాటా తేల్చలేదు. ఇందిర జలప్రభ, పావలా వడ్డీ, వడ్డీ లేని రుణం... తదితర పథకాలపై పాత కేటాయింపులను ప్రభుత్వం బడ్జెట్లో వల్లె వేసిందని, ప్రధాన అంశాలను పక్కన బెట్టిందన్న చర్చ జరగుతోంది. రహదారులు, మౌళిక వసతుల కల్పనల కోసం బడ్జెట్ కేటాయింపుల్లో జిల్లాకు చోటు దక్కగా పోగా.. ప్రభుత్వ బడ్జెట్‌పై రాజకీయ పక్షాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఏడు సాగునీటి పథకాలకు.. అమరులకు.. భారీ ప్రాజెక్టులుగా రెండేళ్ల కాలంలో నిర్లక్ష్యానికి గురైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు ఈసారి బడ్జెట్లో రూ.1790 కోట్లు కేటాయించారు. అయితే జిల్లాలో 20, 21, 22 ప్యాకేజీలకు మాత్రం కేటాయింపులు జరగలేదు. గత బడ్జెట్లో ప్రాణహిత-చేవెళ్లకు రూ.1051 కేటాయించిన అప్పటి ప్రభుత్వం పైసా విదిల్చలేదు. 2013-14 బడ్జెట్లో ఎస్సారెస్పీ స్టేజ్-1కు రూ.160 కోట్లు కేటాయించగా ఈసారి రూ.63.40 కోట్లకే సరిపుచ్చారు. లెండి ప్రాజెక్టుకు గతంలో రూ.45 కోట్లు కేటాయించినా నిధులు విడుదల కాకపోయినా.. ఈ సారి రూ.3 కోట్లకే పరిమిత చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి. నిజాంసాగర్ ఆధునీకరణ పనుల బడ్జెట్ రూ.180 కోట్ల నుంచి ఈసారికి రూ.69.50 కోట్లకు తగ్గింది. జిల్లా నుంచి కరీంనగర్‌కు విస్తరించిన ఇందిరమ్మ వరద కాల్వ నిర్మాణం కోసం గతంలో రూ.400 కోట్లు కేటాయించి రూ.140 కోట్లే ఖర్చు చేయగా.. ఈ సారి ఆ బడ్జెట్‌ను తగ్గించి రూ.200 కోట్లకు పరిమితం చేశారు. రూ.10 కోట్లున్న చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతలకు రూ.1కోటి, అలీసాగర్, గుత్పలకు రూ.12 కోట్ల నుంచి రూ.2 కోట్లకు, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన సింగూరు ప్రాజెక్టుకు రూ.40 కోట్ల నుంచి రూ.8 కోట్లకు బడ్జెట్ కుదించారు. సాగునీటి పథకాలకు అంతంతమాత్రంగానే నిధులు కేటాయించారన్న వాదనలు వినిపిస్తుండగా.. జిల్లాలో 757 చెరువుల మరమ్మతులకు మొదటి విడతగా రూ.200 కోట్ల వరకు రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించే అవకాశం ఉందని అధికారపార్టీ నేతలు ఊరడిస్తున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 459 మంది తెలంగాణ అమరవీరులకు రూ.100 కోట్లు బడ్జెట్లో కేటాయించగా, జిల్లాకు చెందిన 31 మంది కుటుంబాలకు రూ.3.10 కోట్లు అందనున్నాయి. శాసనసభ నియోజకవర్గం అభివృద్ధి నిధులు (ఏసీడీపీ) రూ.1కోటి నుంచి రూ.1.50 కోట్లకు పెంచడంతో జిల్లాకు ఇకపై ప్రతి సంవత్సరం అదనంగా రూ.4.50 కోట్లు రానున్నాయి. కేటాయింపులపైనే ఆధారం... ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలిపద్దులో జిల్లాకు ప్రత్యక్షంగా చేకూర్చిన ప్రయోజనం ఏమీ లేదన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి. వైద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాలకు కేటాయింపులు ప్రత్యక్షంగా జరగలేదంటున్నారు. మొత్తంగా వైద్య రంగానికి రూ.2,882 కోట్లు కేటాయిస్తే.. జిల్లాలో ప్రసిద్ధిగాంచిన వైద్య కళాశాల, జిల్లా కేంద్ర ఆసుపత్రుల ఊసులేదు. రహదారుల నిర్మాణానికి రూ.800ల కోట్ల నుంచి రూ.1000 కోట్ల వరకు అవసరం ఉంటాయని సంబంధిత శాఖ అధికారులు జిల్లా ప్రజాప్రతినిధుల ద్వారా ప్రతిపాదనలు పంపించారు. 3,169 చెరువులకు గాను 757 చెరువుల ఆధునీకరణకు ప్రభుత్వం హామీ ఇచ్చిన ఉమ్మడి బడ్జెట్లోనే నిధులు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 2.97 లక్షల ఎకరాలకు సాగునీరు అదనంగా ఇస్తామన్నా.. జిల్లా ప్రాజెక్టుల ప్రస్తావన రాలేదు. 125 గజాల స్థలంలో రూ.3.50 లక్షల వ్యయంతో రెండు పడక గదులతో పేదలకు పక్కాఇళ్లు నిర్మిస్తామన్న హామీ ఉండగా.. బడ్జెట్ కేటాయింపుల ప్రకారం నియోజకవర్గానికి 250 ఇండ్లకు మించి వచ్చే అవకాశం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన పసుపు పరిశోధన కేంద్ర, చక్కెర కర్మాగారం పునరుద్ధరణ, గల్ఫ్‌బాధితుల ప్రత్యేక విభాగం, వంగడాల పరిశోధన కేంద్రాలు తదితర హామీలు నెరవేర్చే అంశాలు బడ్జెట్లో కనిపించలేదు. రెండు పార్లమెంట్, 9 అసెంబ్లీ స్థానాలను ఏకపక్షంగా గెలిపించిన ఇందూరు జిల్లాకు ప్రభుత్వ బడ్జెట్లో భారీగా కేటాయింపులు ఉంటాయని భావించగా.. ఆ మేరకు ప్రాతినిధ్యం కల్పించలేదంటున్నారు.