భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం విలీనమైన సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని అసెంబ్లీ సమావేశాల తొలిరోజున బీజేఎల్‌పీ డిమాండ్ చేయనుంది. గతంలో టీఆర్‌ఎస్ ప్రజలకిచ్చిన హామీ మేరకు సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకురావాలని నిర్ణయించింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించే వరకు పార్టీపరంగా ఉద్యమాన్ని కొనసాగించాలని తీర్మానించినట్లు ఆ పార్టీ ఒక ప్రకటనలో స్పష్టంచేసింది మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ఎదుటనున్న మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి జాతీయ జెండాలు పట్టుకుని వారు అసెంబ్లీ,కౌన్సిల్‌కు వస్తారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు శాసనసభలో ఇదే అంశంపై నిలదీయాలని బీజేపీ నిర్ణయించింది.
విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి
Published Mon, Aug 29 2016 8:33 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement