
ముంబైలో కేసీఆర్ జన్మదిన వేడుకలు
ముంబై: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ముంబైలో జన్మదిన వేడుకలు చేసుకున్నారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు రాజ్భవన్లో కేసీఆర్ చేత కేక్ కట్ చేయించారు.
విద్యాసాగర్ రావు మంగళవారం మధ్యాహ్నం కేసీఆర్ బృందానికి విందు ఏర్పాటు చేశారు. విద్యాసాగర్ రావు తెలంగాణ ప్రాంతానికి చెందినవారన్న సంగతి తెలిసిందే. నీటి వనరుల విషయంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు కేసీఆర్ నిన్న సాయంత్రం ముంబై వెళ్లారు. కేసీఆర్ విద్యాసాగర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు.