హాఫ్ మారథాన్‌లో అపశృతి
ముంబై: మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ఆదివారం ఉదయం ముంబైలో హాఫ్ మారథాన్‌ను ప్రారంభించారు. సీఎస్‌టీలో ఉత్సాహంగా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది.
మారథాన్‌లో పాల్గొన్న ఓ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అక్కడ కలకలం రేగింది. స్పృహ కోల్పోయిన యువకుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలియాల్సి ఉంది.