ఏ జట్టుకైనా నా మద్దతు ఉంటుంది: క్రికెటర్‌ | sachin tendulkar started the half marathon in mumbai | Sakshi
Sakshi News home page

ఏ జట్టుకైనా నా మద్దతు ఉంటుంది: క్రికెటర్‌

Published Sun, Aug 20 2017 11:57 AM | Last Updated on Sun, Sep 17 2017 5:45 PM

ఏ జట్టుకైనా నా మద్దతు ఉంటుంది: క్రికెటర్‌

ఏ జట్టుకైనా నా మద్దతు ఉంటుంది: క్రికెటర్‌

ముంబాయి: టీమిండియాకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని మాస్టర్ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అన్నారు. టీం సరైనా ప్రదర్శన చేసినా.. లేక ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిన తన మద్దతు మాత్రం ఉంటుందని ఆయన తెలిపారు. ఐడీబీఐ లైఫ్‌ ఇన్సురెన్స్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడ  హాఫ్‌ మారథాన్‌ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సచిన్‌ జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు.
 
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..‘ భారత జట్టుకు నా మద్దతూ ఎల్లప్పుడు ఉంటుంది. అది పురుషుల జట్టైనా, మహిళల జట్టైనా అందులో ఎలాంటి మార్పు ఉండదు. మా శుభాకాంక్షలు ఎల్లవేళల మీ వెంట ఉంటాయి. కొన్నిసార్లు జట్టు అంచనాలను అందుకోలేకపోయినా మా వైఖరీలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. నేను ఎల్లప్పుడు మీతోనే ఉన్నానని భావిస్తూ ఉంటానని ఆయన స్పష్టం చేశారు’.. 
 
శ్రీలంకలో పర్యటనలో ఉన్న కోహ్లీ సేన మూడు టెస్టుల సిరీస్‌ను 3-0తో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా దంబుల్లాలో ఈ రోజు తొలి వన్డే జరగనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement